TE/Prabhupada 0112 - ఫలితం ద్వారా ఏదైనా విషయం నిర్ణయించబడుతుంది



Television Interview -- July 29, 1971, Gainesville

ఇంటర్వ్యూయర్: సార్. మీరు ఈ దేశమునకు 1965 లో వచ్చారు నేను చెప్పినట్లుగా మీ ఆధ్యాత్మిక గురువు ఇచ్చిన ఆదేశాలపై లేదా ఆదేశాల వలన. ఇంతకు, మీ ఆధ్యాత్మిక గురువు ఎవరు?

ప్రభుపాద: నా ఆధ్యాత్మిక గురువు ఓం విష్ణుపాద పరమహంస భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదల వారు.

ఇంటర్వ్యూయర్: మనము ఇంతకు ముందు మాట్లాడుకుంటున్న గురు శిష్య పరంపర గురించి, ఈ పరంపర ఎక్కడ నుండి మొదలవుతుంది అంటే స్వయముగా కృష్ణుని దగ్గరనుండి. సరే. మీ ఆద్యాత్మిక గురువు, మీ ముందు వున్నా అయిన

ప్రభుపాద: అవును. గురుశిష్య పరంపర 5000 సంవత్సరాల నుండి కృష్ణుడి దగ్గర నుండి వస్తుంది. ఇంటర్వ్యూయర్: మీ ఆధ్యాత్మిక గురువు, ఇప్పటికీ సజీవంగా ఉన్నార? ప్రభుపాద: లేరు, అయిన 1936లో పరమపదించారు.

ఇంటర్వ్యూయర్: మీరు ఇప్పుడు, ఇ సమయంలో ప్రపంచంలో ఈ ఉద్యమము యొక్క నాయకులు? ఇది సరైనదేనా?

ప్రభుపాద: నేను అనేక మంది ఆధ్యాత్మిక సోదరులు కలిగి వున్నాను, కానీ నన్ను ముఖ్యంగా ప్రారంభము నుండి ఇలా ఆదేశించారు.. నేను నా ఆధ్యాత్మిక గురువును సంతృప్తి పరచటానికి ప్రయత్నిస్తున్నాను. అంతే.

ఇంటర్వ్యూయర్: ఇప్పుడు మీరు ఈ దేశానికి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పంపబడ్డారు. ఇది మీ భూభాగం. అది సరైనదేనా?

ప్రభుపాద: నా ప్రాంతం. అయిన. మీరు వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలకు ఈ తత్వమును ప్రచారము చేయండి అన్నారు

ఇంటర్వ్యూయర్: ఇంగ్లీష్ మాట్లాడే ప్రపంచానికి.

ప్రభుపాద: అవును. ముఖ్యంగా పాశ్చాత్య ప్రపంచమునకు. అవును. అయిన నాకు ఆలా చెప్పారు.

ఇంటర్వ్యూయర్: మీరు వచ్చి మొదలు పెట్టినప్పుడు, 15, 16 సంవత్సరాల క్రితం ఈ దేశంలో.

ప్రభుపాద: లేదు, లేదు, 15, 16 సంవత్సరాల క్రితముకాదు.

ఇంటర్వ్యూయర్: ఐదు, ఆరు సంవత్సరాల క్రితము. మీరు నన్ను క్షమించాలి. ప్రపంచంలోని ఈ భాగమునకు, మీరు ఇక్కడ మతము పాటించటము లేదు . అందువలన ఈ ప్రదేశమునకు వెళ్ళుతాను అని మీరు రాలేదు. అమెరికాలో అనేక మతాలు ఉన్నాయి, మరియు ఈ దేశం యొక్క ప్రజలు మతమును నమ్ముతారు అని అనుకుంటున్నాను, ఎక్కువ శాతము మంది, వారు మతపరమైన ప్రజలు, దేవుణ్ణి నమ్ముతున్న ప్రజలు, ఏదో ఒక మతమునకు అంకితమై ఉన్నారు మరియు మీ ఆలోచన ఏమిటి అని నేను ఆశ్చర్య పోతున్నాను మతమునకు ఇప్పటికే అంకితమైన వీరికి మీరు అదనముగా ఏమి మేలు చేస్తారు ఈ దేశంలో, ఇక్కడకు వచ్చి మీ తత్వమును ఇక్కడ చేర్చటము వలన

ప్రభుపాద: అవును. నేను మీ దేశంలో మొదట వచ్చినప్పుడు బట్లర్ అను ఊరిలో ఒక భారతీయ స్నేహితుడికి అతిథిగా విచ్చేశాను.

ఇంటర్వ్యూయర్: పెన్సిల్వేనియాలో.

ప్రభుపాద పెన్సిల్వేనియా. అవును. ఆది ఒక చిన్న పల్లేటూరు. అయినప్పటికీ, నాకు చాల ఆనందముగా వుండేది. ఆక్కడ చాల చర్చులు వున్నాయి.

ఇంటర్వ్యూయర్: చాలా చర్చులు. అవును. అవును. ప్రభుపాద: అవును. చాలా చర్చులు మరియు నేను అక్కడ ఎన్నో చర్చులలో మాట్లాడాను. నా అతిధి ఆ ఏర్పాటు చేసాడు. ఇక్కడ వున్నా మత సంప్రదాయలను ఓడించటానికి నేను రాలేదు.అది నా ఉద్దేశ్యం కాదు. మా లక్ష్యం చైతన్య మహా ప్రభువు యొక్క లక్ష్యము. ప్రతిఒక్కరికి దేవుడిని ఎలా ప్రేమిoచాలి అని నేర్ఫించటము.

ఇంటర్వ్యూయర్: కానీ ఏ విధంగా సార్, నేను మిమ్మల్ని, అడగవచ్చా, ఎ విధముగా అని అనుకుంటున్నారు మరియు మీరు అనుకుంటున్నారా ప్రస్తుతం మీరు దేవుని ప్రేమించటము అని నేర్పిస్తున్న పద్ధతి, ఇది ఎ విధముగా భిన్నమైనది మరియు బహుశా ఉత్తమమైనది. దేవుని ప్రేమించటమను ఈ దేశములో ఇప్పటికే బోధిస్తున్నారు మరియు శతాబ్దాలుగా పాశ్చాత్య ప్రపంచంలో నేర్పిస్తున్నారు?

ప్రభుపాద: ఇది వాస్తవం. మేముచైతన్య మహాప్రభు అడుగుజాడలను అనుసరిస్తున్నాము. ఇది పరిగణించబడుతుంది . - వేద సాహిత్యం యొక్క అధికారం ద్వారా మేము దీనిని అంగీకరిస్తాము- అతను కృష్ణుడు అని.

ఇంటర్వ్యూయర్: ఎ దేవుడు?

ప్రభుపాద: చైతన్య మహాప్రభు.

ఇంటర్వ్యూయర్: ఓహ్ అవును. అతను భారతదేశంలో ఐదు వందల సంవత్సరాల క్రితము వచ్చారు?

ప్రభుపాద: అవును. అతను కృష్ణుడే, మరియు అతను కృష్ణునిని ఎలా ప్రేమించాలో బోధిస్తున్నారు అందువలన అయిన పద్ధతి ప్రామనికమైనది ఎట్లాగైతే మీరు ఈ సంస్థలో నిపుణులో. ఎవరైనా ఏదో చేస్తూవుంటే ఉంటే, మీరు వ్యక్తిగతంగా అతనికి బోధిస్తారు "ఇలా చేయండి" మీకు అధికారము వున్నది. కావునా దేవుని చైతన్యమును, దేవుడే ఆయినే బోధిస్తున్నారు. భగవద్గీతలో వలె, కృష్ణుడు దేవుడు. ఆయన తన గురించి తానే మాట్లాడుతున్నాడు. మరియు చివరికి అయిన, " నాకు శరణాగతి పొందండి., నేను మిమల్ని చూసుకుంటాను" కానీ ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు. కావున కృష్ణుడు చైతన్య మహా ప్రభువుగా వచ్చి ప్రజలకు శరణాగతి ఎలా పొందాలో నేర్పిస్తున్నాడు. మరియు మేము చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడలను అనుసరిస్తున్నందున, ఈ పద్ధతి చాలా శ్రేష్ఠమైనది విదేశీయులు కూడా, కృష్ణుడు అంటే ఇప్పటివరకు వినని వారు కుడా శరణాగతి పొందుతున్నారు. పద్ధతి చాలా శక్తివంతమైనది. కాబట్టి అది నా ఉద్దేశము. "ఈ మతం ఆ మతం కంటే మెరుగైనది," లేదా "నా పద్ధతి మంచిది" అని చెప్పను. మేము ఫలితాలను బట్టి చూడాలనుకుంటున్నాము. సంస్కృతంలో ఒక పదం ఉంది, phalena paricīyate. ఏదైనా ఒక విషయము ఫలితం ద్వార నిర్ణయించబడుతుంది.

ఇంటర్వ్యూయర్: ఏదైనా విషయమును నిర్ణయిస్తారా ?

ప్రభుపాద: ఫలితమును బట్టి.

ఇంటర్వ్యూయర్: అవును

ప్రభుపాద: మీరు చెప్పవచ్చు, నా పద్ధతి చాలా బాగుంది అని నేను చెప్పవచ్చు. మీ పద్ధతి చాలా బాగుంది అని మీరు చెప్పవచ్చు, కానీ ఫలితం ద్వార మనము నిర్ణయించాల్సి ఉంటుంది. భాగవతము చెప్పుతుంది, ఎ మతము ద్వార ఒకరు భగవంతుని ప్రేమించటము మొదలు పెడతారో, అ మతము యొక్క పద్ధతి చాల శ్రేష్టమైనది.