TE/Prabhupada 0114 - కృష్ణుడు అనే పేరుగల పెద్దాయన అందరిని నియంత్రిస్తున్నాడు
Lecture -- Laguna Beach, September 30, 1972
భగవద్గీతలో చెప్పబడింది
- dehino 'smin yathā dehe
- kaumāraṁ yauvanaṁ jarā
- tathā dehāntaraṁ-prāptir
- dhīras tatra na muhyati
- (BG 2.13)
మీరు, నేను - ప్రతి ఒక్కరము - ఈ శరీరంలో చిక్కుకొని ఉన్నాము. నేను ఒక ఆత్మ, మీరు ఒక ఆత్మ. ఇది వేదములో చెప్పబడినది, అహం బ్రహ్మసి. "నేను బ్రాహ్మణ్" అంటే ఆత్మ . పరబ్రహ్మణ్ కాదు, పొరపాటు పడవద్దు, పరబ్రహ్మణ్ అంటే దేవుడు. మనము ఆత్మ, దేవుడిలో అంతర్భాగము. దేవదిదేవుడము కాదు. దేవాదిదేవుడు భిన్నంగా ఉన్నాడు. మీరు అమెరికన్లు. కానీ ఉన్నతమైన అమెరికన్ మీ అధ్యక్షుడు, మిస్టర్ నిక్సన్ కానీ మీరు చెప్పలేరు "నేను అమెరికన్గా ఉన్నాను, అందుకే నేను మిస్టర్ నిక్సన్ని" మీరు చెప్పలేరు. అదేవిధంగా, మీరు, నేను ప్రతి ఒక్కరము అత్మలము కానీ మనము పరబ్రహ్మాన్ అని కాదు పరబ్రహ్మాన్ కృష్ణుడు. Īśvarah paramah krsna (Bs 5.1). Īśvaraḥ paramaḥ. ఈశ్వర అంటే నియంత్ర్హించేవాడు మనలో ప్రతి ఒక్కరము కొంత వరకు నియంత్రిoచగలము. కొంతమంది తన కుటుంబాన్ని నియంత్రిస్తున్నారు, తన కార్యాలయాన్ని, వ్యాపారాన్ని నియంత్రిస్తూ, తన శిష్యులను నియంత్రిస్తున్నారు. చివరికి అతను కుక్కను నియంత్రిస్తాడు. అతను దేనిని నియంత్రించలేకపోతే, అతను ఒక కుక్క, ఒక పెంపుడు పిల్లిని పెట్టుకొని దానిని నియంత్రిస్తాడు.. ప్రతి ఒక్కరూ నియంత్రి౦చాలనుకుంటున్నారు. అది నిజం. కానీ అత్యున్నత నియంత్రికుడు కృష్ణుడు. ఇక్కడ నియంత్రికుడు అని పిలవబడేవాడు మరొకరిచే నియంత్రించబడుతున్నాడు. నేను నా శిష్యులను నియంత్రిస్తాను, కానీ నేను వేరోక్కరి చేత నియంత్రించ బడుచున్నాను. నా ఆధ్యాత్మిక గురువు ద్వారా. నేను సంపూర్ణ నియంత్రికుడను అని ఎవరూ చెప్పలేరు. విలుకాదు ఇక్కడ మీరు నియంత్రికుడు అని పిలవబడే వారు , కచ్చితంగా కొంత వరకు నియంత్రిస్తుంటారు, కానీ అతను కూడా నియంత్రించబడుతున్నాడు. కానీ ఎవరైనా అతను నియంత్రికడు కానీ నియంత్రించబడటములేదు అంటే అది కృష్ణుడు మాత్రమే కృష్ణుడిని అర్థం చేసుకోవటము చాలా కష్టం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరూ నియంత్రిస్తున్నరు. ప్రతి ఒక్కరు, కానీ అదే సమయంలో మరొకరిచే నియంత్రించబడుచున్నాము. కానీ కృష్ణుడు అనే పేరు గల పెద్దమనిషిని మనము కనుగొంటాము. అయిన ప్రతి ఒక్కరిని నియంత్రిస్తున్నాడు, కానీ అతను ఎవరిచేత నియంత్రించబడుటలేదు. అది దేవుడు
- īśvaraḥ paramaḥ kṛṣṇaḥ
- sac-cid-ānanda-vigrahaḥ
- anādir ādir govindaḥ
- sarva-kāraṇa-kāraṇam
- (Bs. 5.1)
ఈ కృష్ణ చైతన్య ఉద్యమం చాలా శాస్త్రీయమైనది, ప్రామనికమైనది. ఆలోచన వున్నా వారు అర్ధము చేసుకుంటారు మీరు కృష్ణ చైతన్య ఉద్యమంలో ఆసక్తిని కనబరిస్తే, మీరు ప్రయోజనం పొందుతారు. మీ జీవితం విజయవంతమవుతుంది. జీవితం యొక్క మీ లక్ష్యం సాధించవచ్చు. అది నిజం. మీరు మా సాహిత్యాన్ని చదవడానికి ప్రయత్నించవచ్చు. మాకు చాలా పుస్తకాలు ఉన్నయి. మీరు వచ్చి ఆచరణాత్మకంగా మా విద్యార్థలు కృష్ణ చైతన్య ఉద్యమములో ముందుకు ఎలా వెళ్ళుతున్నారో చూడండి. మీరు సాంగత్యము ద్వారా వారి నుండి తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఒకరు యాంత్రిక మనిషి కావాలని కోరుకుంటే, అతడు కర్మాగారంలో ప్రవేశిస్తాడు కార్మికుడు, మెకానిక్స్ తో సహచర్యము పొంది క్రమంగా అతను కూడా ఒక మెకానిక్, సాంకేతిక నిపుణుడు అవ్వుతాడు. అదేవిధంగా, మనము ప్రతి ఒక్కరికీ అవకాశాన్ని ఇవ్వడానికి ఈ కేంద్రాలను తెరుస్తున్నాం ఎలా ఇంటికి వెళ్ళాలో తెలుసుకునేందుకు, ఎలా ఇంటికి వెళ్లాలి, తిరిగి ..., ఇంటికి వెళ్లి, దేవుడి దగ్గరకు తిరిగి ఎలా వెళ్ళాలి. ఇది మా లక్ష్యం. చాలా వైజ్ఞానికము, ప్రామాణికము వేదము. మనము కృష్ణుడి నుండి ఈ జ్ఞానాన్ని నేరుగా పొందుతున్నాము, భగవంతుడు దేవాది దేవుడు. ఇది భగవద్గీత. మనము అర్ధం లేని వ్యాఖ్యలు లేకుండా, భగవద్గీతను ప్రచారము చేస్తున్నాము కృష్ణుడు భగవద్గీతలో తాను భగవంతుడిని దేవదిదేవుడిని అని చెప్పాడు. మనము అదే ప్రతిపాదనను చేస్తున్నాము, దేవాదిదేవుడు కృష్ణుడి అని. మనము దానిని మార్చడం లేడు. కృష్ణుడు, భగవద్గీత లో చెప్పుతున్నారు "నా భక్తుడు అవ్వండి. ఎల్లప్పుడూ నా గురించి ఆలోచించండి. నన్ను ఆరాధించండి. నాకు ప్రణామము చేయండి మనము ప్రజలకు అదే బోధిస్తున్నాము "మీరు కృష్ణుని గురించి ఎల్లప్పుడూ ఆలోచిoచండి" హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే. హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే ". హరే కృష్ణ మంత్రం జపము చేయడము ద్వారా, మీరు ఎల్లప్పుడూ కృష్ణడి గురించి ఆలోచించoడి