TE/Prabhupada 0115 - కృష్ణుడి సందేశాన్ని తెలియజేయడమే నా కర్తవ్యము



Lecture -- Los Angeles, July 11, 1971

ఈ అబ్బాయిలు నాకు బాగా సహాయం చేస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును ముందుకు తీసుకువెళ్ళుతునందుకు, కృష్ణడు వారిని ఆశీర్వదిస్తాడు. నేను చాలా అల్పుడిని. నేను సామర్థ్యాము కలిగిలేను. కృష్ణుడి సందేశాన్ని తెలియజేయడము మాత్రమే నా కర్తవ్యము. కేవలం ఒక తపాలా గుమాస్తాను వంటి వాడను: తన పని లేఖలను ఇవ్వడము మాత్రమే లేఖలో ఏం రాస్తారు అన్నది, అతనికి బాధ్యత లేదు ప్రతిస్పందన ... లేఖ చదివిన తర్వాత , లేఖ తీసుకున్నవారు ఏమైనా అనుభూతి చెందవచ్చును కానీ ఆ బాధ్యత గుమాస్తాది కాదు. అదేవిధంగా, నా బాధ్యత, నా ఆధ్యాత్మిక గురువు నుండి, నేను గురు శిష్య పరంపర నుండి పొందినది నా బాద్యత. నేను అదే విషయమును ప్రచారము చేస్తున్నాను, కానీ ఏ కల్తీ లేకుండా ప్రచారము చేస్తున్నాను. ఇది నా కర్తవ్యము. ఇది నా బాధ్యత. కృష్ణడు ప్రచారము చేసిన విధముగానే నేను కుడా అదే విధంగా ప్రచారము చేస్తున్నాను అర్జునుడు లాగే ప్రచారము చేస్తున్నాను. మన ఆచార్యులు ప్రచారము చేసిన విధముగానే, చైతన్య మహాప్రభు వలె చివరకు నా ఆధ్యాత్మిక గురువు భక్తి సిద్ధాంత సరస్వతీ గోస్వామి మహారాజ వలె. , అదేవిధంగా, మీరు అదే స్పూర్తితో కృష్ణ చైతన్య ఉద్యమమును అంగీకరించాలి. మీరు మీ ఇతర దేశస్తులకు ఇవ్వండి తప్పనిసరిగా అది సమర్థవంతముగా ఉంటుంది, ఏ కల్తీ లేకుండా ఏటువంటి అబద్ధం లేదు. ఏటువంటి మోసం లేదు. ఇది స్వచ్ఛమైన ఆధ్యాత్మిక చైతన్యము. దీనిని సాధన చేసి, పంపిణీ చేయండి. మీ జీవితం అద్భుతముగా ఉంటుంది.