TE/Prabhupada 0139 - ఇది ఆధ్యాత్మిక సంబంధం
Lecture on SB 3.25.38 -- Bombay, December 7, 1974
మీరు కృష్ణుడిని ప్రేమిస్తే, బౌతిక వస్తువుల వలె విధ్వంసం ఉండదు. కృష్ణుడిని నీ యజమానిగా ప్రేమిoచు. యజమాని ఇక్కడ, మీరు పనిచేస్తున్నoత కాలము, యజమాని ఆనందముగా వుంటాడు. నీ సేవకుడు మీరు జీతము ఇస్తున్నoత కాలము అనందంముగా వుంటాడు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో అలాంటిదేమీ లేదు. నేను కొన్ని పరిస్థితుల్లో సేవ చేయలేకపోయిన, యజమాని ఆనందముగా వుంటాడు. సేవకుడు కూడా - యజమాని చెల్లించకుండా ఉన్న - సేవకుడు కుడా ఆనందముగా వుంటాడు. ఇది ఏకత్వం, సంపూర్ణము అని పిలువబడుతుంది. అంటే ... ఈ ఉదాహరణ ఇక్కడ ఉంది. ఈ సంస్థలో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. మేము ఏమీ చెల్లించడం లేదు, కానీ వారు నాకు ప్రతిదీ చేస్తారు. ఇది ఆధ్యాత్మిక సంబంధం. ఆ పండిత్ జవహర్లాల్ నెహ్రూ లండన్లో ఉన్నప్పుడు, అయిన తండ్రి మోతీలాల్ నెహ్రూ, సేవకుని పెట్టుకోవటానికి అయినకి మూడు వందల రూపాయలు ఇచ్చారు. అప్పుడు అయిన లండన్ వెళ్ళాడు, అక్కడ అయినకు సేవకుడు కనబడలేదు
మోతీలాల్ నెహ్రూ అడిగారు, "నీ సేవకుడు ఎక్కడ?" జవహర్లాల్ నెహ్రు చెప్పారు, "సేవకుని ఉపయోగం ఏమిటి? నా వద్ద చేయటానికి ఏమీ లేదు, నేను వ్యక్తిగతంగా చేసుకుంటాను." కాదు, కాదు. నేను ఒక ఆంగ్లేయుడు నీకు సేవకునిగా ఉండాలని కోరుకున్నాను. అందువలన అయిన చెల్లించాల్సి ఉంటుంది.
ఇది ఒక ఉదాహరణ. నేను చెల్లించాల్సిన అవసరం లేని వందల వేలమంది సేవకులను నేను పొందాను. ఇది ఆధ్యాత్మిక సంబంధం. ఇది ఆధ్యాత్మిక సంబంధం. వారు జీతము తీసుకోకుండా సేవ చేస్తున్నారు. నా దగ్గర ఏమి వుంది? నేను పేద భారతీయుడిని. నేను ఏమి చెల్లించగలను? కానీ సేవకుడు ప్రేమ, ఆధ్యాత్మిక ప్రేమ వలన. నేను కూడా ఏ జీతం తీసుకోకుండా ప్రచారము చేస్తున్నాను. ఇది ఆధ్యాత్మికం. Pūrṇasya pūrṇam ādāya (Īśo Invocation). అంత పరిపూర్ణముగా వుంది మీరు కృష్ణుడిని మీ కుమారుడిగా మీ స్నేహితుడిగా, మీ ప్రేయకుడిగా, అంగీకరించినట్లయితే మీరు ఎన్నటికీ మోసoచేయబడరు. కృష్ణుని అంగీకరించడానికి ప్రయత్నించండి. ఈ మాయ సేవకుడిని లేదా కొడుకుని లేదా తండ్రిని లేదా ప్రేమికుడిని వదలి వేయండి . మీరు మోసం చేయబడతారు.