TE/Prabhupada 0138 - భగవంతుడు చాల దయ కలిగిన వాడు. మీరు ఏమి కోరుకున్నా అతను నెరవేరుస్తాడుRatha-yatra -- Philadelphia, July 12, 1975

లేడీస్ అండ్ జెంటిల్మెన్, మొట్టమొదటిగా నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను, ఈ గొప్ప పట్టణపు నివాసులు, ఫిలడెల్ఫియా. మీరు ఈ ఉద్యమములో పాల్గొనటానికి చాలా ఉత్సాహముతో ఉన్నారు. నేను మీకు చాలా రుణపడి వున్నాను. నాకు చాలా సహాయం చేస్తున్న అమెరికన్ అబ్బాయిలకు బాలికలకు నేను ప్రత్యేకంగా రుణపడివున్నాను పాశ్చాత్య దేశాలలో ఈ కృష్ణ చైతన్య ఉద్యమంను వ్యాప్తి చేయడానికి. పాశ్చాత్య దేశాలలో ఈ కృష్ణ చైతన్యమును ప్రచారముడానికి నా ఆధ్యాత్మిక గురువుచే ఆదేశించబడితిని. 1965 లో నేను మొదట న్యూయార్క్లో వచ్చాను. అప్పుడు 1966 లో ఈ సంస్థ క్రమంగా న్యూయార్క్లోలో నమోదు చేయబడింది, 1967 నుండి ఈ ఉద్యమం అమెరికాలో, యూరోప్, కెనడాలలో క్రమముగా పెరిగింది, దక్షిణ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా.

ఈ ఉద్యమము, కృష్ణ చైతన్యమును గురించి కొంచెం నేను మీకు తెలియజేస్తాను. కృష్ణ, ఈ పదం, అందరికి ఆకర్షణీయమైన అని అర్థం. కృష్ణుడు ప్రతి జీవికి ఆకర్షణీయంగా ఉంటాడు, మానవులకు మాత్రమే కాదు, జంతువులకు, పక్షులకు, తేనెటీగలకు, చెట్లకు, పువ్వులకు, పండ్లకు, నీరుకు కూడా. అది వృందావనము యొక్క చిత్రం. ఇది భౌతిక ప్రపంచం. మనకు ఆధ్యాత్మిక ప్రపంచము యొక్క అనుభవం లేదు. కానీ మనం ఒక సంగ్రహావలోకనం ఆలోచన చేయవచ్చు, ఆత్మ అంటే ఏమిటి, బౌతిక పదార్ధము అంటే ఏమిటి.

జీవించి వున్నా మనిషికి ఒక మృతదేహం మధ్య వ్యత్యాసం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. శరీరంలోని జీవ శక్తి పోయిన వెంటనే, అ శరీరము చనిపోతుంది, నిష్ఫలమవుతుంది. జీవన శక్తి ఉన్నంత కాలం , శరీరం చాలా ముఖ్యమైనది. మనము ఈ శరీరంలో చనిపోయే పదార్ధమును, జీవ శక్తిని చూస్తున్నాము అదేవిధంగా, రెండు ప్రపంచాలు ఉన్నాయి: భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం. మనము జీవులము మనలో ప్రతి ఒక్కరము, మనము ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన వారము. మనము భౌతిక ప్రపంచమునకు చెందినవారము కాదు. ఎట్లగైతేనేమి మనము ఇప్పుడు ఈ బౌతికము ప్రపంచములో బౌతికము శరీరములో ఉన్నాము. మనము శాశ్వతమైన జీవ శక్తి అయినప్పటికీ, మన పని ఏమిటంటే ఈ బౌతికము శరీరముతో మన సంబంధాన్ని బట్టి, మనము నాలుగు కష్టాలు తీసుకోవాలి: జననం, మరణం, వ్యాధి వృద్ధాప్యము. తరువాత మనము తీసుకోవలసి ఉంటుంది ఈ భౌతిక ప్రపంచంలో మనం ఒకరకమైన శరీరాన్ని పొందుతున్నాము, అది ఒక నిర్దిష్ట దశలో ముగుస్తుంది ఏ బౌతికము విషయం అయిన. మీరు ఉదాహరణకు, మీ దుస్తులను తీసుకో౦డి. మీరు ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరించారు, కానీ అది చినిగిపోయినప్పుడు, అది ఉపయోగకరమయినది కాదు, అప్పుడు మీరు దానిని పడేస్తారు. మీరు మరొక దుస్తులును తీసుకుంటారు ఈ భౌతిక శరీరము ఆత్మ జివశక్తి యొక్క దుస్తులు. కానీ మనకు ఈ భౌతిక ప్రపంచాముతో అనుబంధము ఏర్పడినప్పుడు, మనము ఈ భౌతిక ప్రపంచంలో ఆనందించాలి అని అనుకు౦టాము, మనము వివిధ రకాల శరీరాలను పొందుతాము. ఇది ఒక యంత్రంగా భగవద్గీతలో వివరించబడింది. ఈ శరీరం వాస్తావమునకు ఒక్క యంత్రం. భగవద్గీతలో చెప్పబడింది,

īśvaraḥ sarva-bhūtānāṁ
hṛd-deśe 'rjuna tiṣṭhati
bhrāmāyān sarva-bhūtāni
yantrārūḍhāni māyayā
(BG 18.61)
మనము జీవులము మనము కోరుకుంటాము. "మనిషి ప్రతిపాదిస్తాడు; దేవుడు నిరాకరిస్తాడు." దేవుడు చాలా దయగలవాడు. మీరు కోరుకునేది ఏమైనా అతడు నెరవేరుస్తాడు. ఈ విధమైన భౌతిక కోరికలు ఎన్నటికీ సంతృప్తి చెందవు అని అయిన చెప్పినప్పటికీ, మనకు కావాలి. అందువల్ల దేవుడు కృష్ణుడు, మన వివిధ రకములైన కోరికలను నెరవేర్చడానికి వివిధ రకాలైన శరీరాలు ఇస్తాడు. దీనిని బౌతిక బద్ధ జీవితము అని పిలుస్తాము. ఈ శరీరం, శరీరం యొక్క మార్పులు కోరికల ప్రకారం జరుగుతున్నాయి, దీనిని పరిణామ పద్ధతి అని పిలుస్తారు. పరిణామ పద్ధతి ద్వారా మనం అనేక లక్షల శరీరాల తరువాత మానవ శరీరా రూపానికి వస్తాము. Jalajā nava-lakṣāṇi sthāvarā lakṣa-viṁśati. మనము నీటిలో 900,000 జాతులు గుండా వెళుతున్నాం. అదేవిధంగా, రెండు మిలియన్ రూపాల మొక్కలు, చెట్లు . ఈ విధంగా, ప్రకృతి యొక్క మార్గం ద్వారా, ప్రకృతి మానల్ని మానవ రూపానికి తెస్తుంది మన చైతన్యమును అభివృద్ధి లేదా మేలుకొల్పడానికి. ప్రకృతి మనకు అవకాశం ఇస్తుంది, "ఇప్పుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మీకు అభివృద్ధి గల చైతన్యము వచ్చింది. ఇప్పుడు మీరు మళ్ళీ పరిణామ పద్ధతికి వెళ్లాలని అనుకుంటున్నారా లేదా మీరు ఉన్నత లోకములకు వెళ్లాలని కోరుకుంటాన్నారా, లేదా మీరు దేవుడు, కృష్ణుడి దగ్గరకు వెళ్లాలని అనుకొంటున్నారా లేక మీరు ఇక్కడ ఉండాలని అనుకుంటున్నారా? " ఈ ఎంపికలు ఉన్నాయి. ఇది భగవద్గీతలో పేర్కొనబడింది


yānti deva-vratā devān
pitṛn yānti pitṛ-vratāḥ
bhūtejyā yānti bhūtāni
mad-yājīno 'pi yānti mām
(BG 9.25)

ఇప్పుడు మీరు ఎంపిక చేసుకోండి. మీరు ఉన్నత లోకములకు వెళ్లాలనుకుంటే, మీరు వెళ్ళవచ్చు. మీరు ఇక్కడ ఉండాలని కోరుకుంటే, మధ్య లోకములలో మీరు అలా చేయవచ్చు. మీరు పాతళ లోకములకు వెళ్లాలనుకుంటే, మీరు వెళ్ళవచ్చును. మీరు దేవుడు కృష్ణుడు, దగ్గరకి వెళ్లాలని అనుకుంటే, మీరు అది కూడా చేయగలరు. ఇ ఎంపిక మీకు ఉంది. , ఈ భౌతిక ప్రపంచమునకు మధ్య తేడా ఏమిటి, ఉన్నత లోకములలో లేదా పాతాళ లోకములో తేడా ఏమిటి, ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక ప్రపంచం అంటే భౌతిక వినియోగం లేదు. నేను చెప్పినట్లు, ప్రతిదీ ఆత్మ. చెట్లు, పువ్వులు, పండ్లు, నీరు, జంతువులు - ప్రతిదీ ఆధ్యాత్మికం. ఎటువంటి మరణము వినాశనము లేదు. ఆది శాశ్వతమైనది. మీరు ఆ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్లాలనుకుంటే, మీరు ఈ మానవ రూపంలో ఇప్పుడు ఆ అవకాశాన్ని కలిగి ఉన్నారు, మీరు ఈ భౌతిక ప్రపంచంలో ఉండాలనుకుంటే, మీరు అలా చేయవచ్చు.