TE/Prabhupada 0153 - సాహిత్యమును ప్రచురించడము ద్వారా, ఒక వ్యక్తి యొక్క మేధస్సు పరీక్షించబడుతుంది



Interview with Newsweek -- July 14, 1976, New York

విలేఖరి: మీరు ప్రస్తావించిన మూడు విషయములు గురించి తినడం, నిద్రపోవటం సెక్స్, చేయటము గురించి వివరించగలరా? ప్రత్యేకంగా ప్రజలకు ఇచ్చే నియమాలు లేదా సూచనలు గురించి వివరించండి ఈ విధానాల ద్వార తమ జీవితాల్లో ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోరుకునే వారికి.

ప్రభుపాద: అవును. అవును, అవి మన పుస్తకాలు. ఇవి మనపుస్తకాలు. మనము అర్థం చేసుకోవడానికి తగినంత విషయం వున్నది. మీరు ఒక నిమిషం లో అర్థం చేసుకునే విషయం కాదు. విలేఖరి: నేను మీరు చాలా తక్కువ సమయము నిద్ర పోతారని అర్థం చేసుకున్నాను. మీరు రాత్రికి మూడు నుండి నాలుగు గంటలు నిద్రపోతారు. ఆధ్యాత్మిక ఉన్నతి కలిగిన వ్యక్తి ఎవరైనా దీనిని గ్రహిస్తారని మీరు భావిస్తున్నారా?

ప్రభుపాద: అవును, మనము గోస్వాముల యొక్క ప్రవర్తన నుండి చూస్తాము. వారు ఆచరణాత్మకంగా భౌతిక అవసరాలు కలిగి లేరు. ఈ తినడం, నిద్రపోయే, సంభోగం రక్షించుకోవటము, ఆచరణాత్మకంగా వారికి అలాంటిది లేదు. వారు కేవలం కృష్ణుడి సేవలో నిమగ్నమై ఉన్నారు.

విలేఖరి: ఏం చేస్తున్నారు? రామేశ్వర: కృష్ణుని సేవలో లేదా దేవుడి సేవలో. బలి-మర్దనా: అయిన మునుపటి ఆధ్యాత్మిక గురువుల యొక్క ఉదాహరణను చెప్పుతున్నారు

విలేఖరి: నేను దేని గురించి ఆసక్తి కలిగి ఉన్నాను అంటే ఎందుకు ... మూడు నుండి నాలుగు గంటల నిద్ర సమయము సరిపోతుందని ఆయన తెలుసుకున్నారా?

బలి-మర్దనా: ఇంకొక మాటలో చెప్పాలంటే, ఎందుకు మీరు మూడు నుండి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారు అని ఆమె అడుగుతుంది. ఆ ప్రమాణాన్ని మీరు ఎలా చేరుకున్నారు?

ప్రభుపాద: ఇది కృత్రిమంగా కాదు. మీరు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ఎంత నిమగ్నమైతే అంత మీరు భౌతిక కార్యకలాపాలు నుండి విముక్తులు అవుతారు. అది పరీక్ష.

విలేఖరి: మీరు ఆ స్థితికి వచ్చారు ...

ప్రభుపాద: లేదు, నేను నా గురించి మాట్లాడను, కానీ అది పరీక్ష. Bhaktiḥ pareśānubhavo viraktir anyatra syāt (SB 11.2.42). మీరు ఆధ్యాత్మిక జీవితంలో భక్తిలో ముందంజ వేస్తే, అప్పుడు భౌతిక జీవితం మీద మీకు ఆసక్తి ఉండదు

విలేఖరి: ప్రపంచంలోని వివిధ ప్రజల మధ్య వ్యత్యాసం ఉందని మీరు అనుకుంటున్నారు? మరో మాటలో చెప్పాలంటే, భారతీయులు ఐరోపావాసుల మదిరికాకుండా ఉన్నారని మీరు అనుకుంటున్నారు కృష్ణ చైతన్యములో ఉండడానికి ఎక్కువ అవకాశము కలిగి వున్నారా?

ప్రభుపాద: లేదు, ఏ మేధావి అయినా కృష్ణ చేతన్యవంతుడు కావచ్చు. నేను ఇప్పటికే వివరించాను, ఒకవేళ వ్యక్తి తెలివైనవాడు కాకపోతే, అయిన కృష్ణ చైతన్యమును తీసుకోలేడు. ఇది ప్రతిఒక్కరికీ తెరిచి ఉన్నది. కానీ వివిధ రకాల మేధస్సులు ఉన్నాయి. ఐరోపాలో, అమెరికాలో, వారు తెలివైనవారు, కానీ వారి మేధస్సు భౌతిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. భారతదేశంలో వారు వారి మేధస్సును ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు అందువల్ల మీరు చాలా ఆధ్యాత్మిక జీవన ప్రమాణాలు, పుస్తకాలు, సాహిత్యం కనుగొంటారు. వ్యాసదేవుడు లాగానే. వ్యాసదేవుడు గృహస్థ జీవితంలో కూడా ఉన్నారు, కానీ అయిన అడవిలో నివసిoచారు, సాహిత్యమునకు అయిన యొక్క సహకారం చూడoడి. ఎవరూ కూడా కలగనలేరు. సాహిత్యమును ప్రచురించడము ద్వారా, ఒక వ్యక్తి యొక్క మేధస్సు పరీక్షించబడుతుంది. గోప్పవారందరూ, భౌతిక ప్రపంచం యొక్క గొప్ప గొప్ప వ్యక్తులు, శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, సాంకేతిక నిపుణులు, వారి రచనల ద్వారా వారు సాహిత్యమునకు చేసిన సేవ ద్వారా మాత్రమే గుర్తించబడ్డరు, అంతేకాని వారి అతిపెద్ద శరీరముచే కాదు.