TE/Prabhupada 0183 - గుడ్లగూబ దయచేసి కళ్ళు తెరిచి సూర్యుడిని చూడండి
(Redirected from TE/Prabhupada 0183 - గుడ్లగుభ దయచేసి కళ్ళు తెరిచి సూర్యుడిని చూడండి)
Lecture on SB 6.1.37 -- San Francisco, July 19, 1975
దేవుడు చెప్పుతున్నారు "నేను ఇక్కడ ఉన్నాను, నేను వచ్చాను." Paritranaya sadhunam vinasaya ca duskrtam (BG 4.8). "మీకు ఉపశమనం కలిగించటానికి నేను మీ ముందుకు వచ్చాను" Paritranaya sadhunam. "మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, నేను ఇక్కడ ఉన్నాను, నేను ఉన్నాను. నీవు దేవుడికి రూపము లేదని ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇక్కడ నేను ఉన్నాను కృష్ణుడి రూపములో. మీరు చూడండి, నేను చేతిలో వేణువును కలిగి ఉన్నాను. నాకు ఆవులoటే చాలా ఇష్టం. నాకు ఆవులు,ఋషులు బ్రహ్మ అంటే ఇష్టము. అందరు సమానంగా, ఎందుకంటే వారు వివిధ శరీరములలో ఉన్నా నా కుమారులు. " కృష్ణుడు ఆడుకుంటున్నడు. కృష్ణుడు మాట్లాడుతున్నాడు. అయినప్పటికీ, ఈ ముర్ఖులు కృష్ణుడిని అర్థం చేసుకోలేరు. కృష్ణుడియొక్క తప్పు ఏమిటి? ఇదిమనతప్పు. Andha. గుడ్లగూబలా లాగానే. గుడ్లగూబ సూర్యకాంతి ఉందని చూడటానికి కళ్ళను తెరువదు. మీకు ఇది తెలుసా, గుడ్లగూబ? అది కళ్ళు తెరవదు. అయితే మీరు అనవచ్చు "గుడ్లగుభ, మీ కళ్ళు తెరిచి, సూర్యుడుని చూడండి," అని అనవచ్చు "కాదు, ఎటువంటి సూర్యుడు లేదు, నేను చూడను." (నవ్వు) ఇది గుడ్లగూబ నాగరికత. మీరు ఈ గుడ్లగూబలతో పోరాడాలి. మీరు చాలా బలంగా ఉండాలి, ముఖ్యంగా సన్యాసులు. మనము గుడ్లగూబలతో పోరాడాలి. ఈ యంత్రంతో మనము బలము ద్వారా వారి కళ్ళను తెరవాలి. (నవ్వు) ఇది జరగబోతోంది. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అన్ని గుడ్లగూబలకు వ్యతిరేకంగా పోరాటం.
ఇక్కడ ఒక సవాలు ఉంది. yuyam vai dharma-rajasya yadi nirdesa-karinah (SB 6.1.38). Nirdesa-karinah. యజమాని యొక్క ఆదేశాలను నెరవేర్చడానికి కంటే సేవకునికి రెండవ పని లేదు. అందువలన nirdesa-karinah వారు వాదిoచరు. ఏది ఆదేశించబడిందో, అది ఇవ్వబడుతుంది. ఎవరైనా అవ్వాలనుకుంటే ... అతడు ఆశిస్తున్నాడు ... నేను అనుకుంటున్నాను ... విష్ణుదూతలను కూడా ఇక్కడ పేర్కొన్నారు, vasudevokta-karinah. వారు కూడా సేవకులు. ఉక్తా అంటే ఏ విధమైన ఉత్తర్వు ఇవ్వబడుతుందో వారు నిర్వహిస్తారు. అదేవిధంగా, యమదుతలు, వారు యమరాజుకు సేవకులు. వారిని కూడా nirdesa-karinah అని సంభోదించరు "మీరు వాస్తవానికి యమరాజకు సేవకులు అయితే, మీరు అయిన ఆదేశాల ప్రకారం పని చేస్తారు, అప్పుడు ధర్మా అంటే ఏమిటి, అధర్మ అంటే ఏమిటి ? మీరు తెలుసుకోవాలి. " వారు వాస్తవానికి యమరాజా యొక్క ప్రామాణిక సేవకులు. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు వారు ఈ విధంగా తమ గుర్తింపును ఇస్తున్నారు, yamaduta ucuh veda-pranihito dharmah,, తక్షణమే జవాబిచ్చారు. "ధర్మము అంటే ఏమిటి?" అది ప్రశ్న. వెంటనే సమాధానమిచ్చారు. వారికి ధర్మము అంటే ఏమిటో తెలుసు. Veda-pranihito dharmah: "ధర్మము అనగా వేదాలలో అదివివరించబడినది." మీరు ధర్మాన్ని సృష్టించలేరు. వేద, అసలు జ్ఞానం, వేదములు అంటే జ్ఞానం. వేద-శాస్త్రము. సృష్టి ప్రారంభము నుండి, వేదములు బ్రహ్మకు ఇవ్వబడినవి. వేద ... అందువల్ల ఇది అపౌరుసేయా అని పిలువబడుతుంది; అది తయారు చేయబడలేదు. ఇది శ్రీమద్-భగవతంలో వివరించబడింది tene brahma hrda adi-kavaye. బ్రహ్మ, బ్రహ్మ అంటే వేద. వేదాల మరొక పేరు బ్రహ్మ, ఆధ్యాత్మిక జ్ఞానం, లేదా జ్ఞానం అంతా, బ్రహ్మ. కావున tene brahma adi-kavaye hrda. వేదములను ఆధ్యాత్మిక గురువు నుండి అధ్యయనం చేయాలి.
వేదాలను అర్థం చేసుకున్న మొదటి జీవి బ్రహ్మ అని చెప్పబడింది. అయిన ఎలా అర్థం చేసుకున్నాడు? గురువు ఎక్కడ ఉన్నారు? ఏ ఇతర జీవి లేదు. అయిన వేదాలను ఎలా అర్థం చేసుకున్నాడు? బ్రహ్మకు బోదించినది కృష్ణుడు, ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. Isvarah sarva-bhutanam hrd-dese arjuna tisthati (BG 18.61). అందువలన అయిన హృదయము నుండి ఉపదేశము చేస్తున్నాడు కృష్ణుడు బోధిస్తున్నాడు - అయిన చాలా కరుణ కలిగి ఉన్నాడు. పరమాత్మగా హృదయము నుండి బోధిస్తున్నాడు, అయిన బయట నుండి తన ప్రతినిధిని పంపుతాడు. పరమాత్మగా మరియు గురువుగా, రెండు రకాలు, కృష్ణుడు ప్రయత్నిస్తున్నాడు. కృష్ణుడు చాలా దయ కలిగి ఉన్నాడు. వేదాలు, అవి మానవులు ప్రచురించిన పుస్తకాలు కాదు. వేద, అపౌరుసేయా. అపౌరుసేయా తయారు చేయబడినవి కాదు ... సాధారణ మానసిక కల్పన పుస్తకములుగా మనము వేదాలను తీసుకోకూడదు. వీలు కాదు ఇది పరిపూర్ణ జ్ఞానం. ఇది పరిపూర్ణ జ్ఞానం. కల్తి లేకుండా, వ్యాఖ్యానాలు లేకుండానే, అది తీసుకోవలసి ఉంటుంది. ఇది దేవుడుచే మాట్లాడబడింది. భగవద్-గీత కూడా వేదము. ఇది కృష్ణుడిచేత మాట్లాడబడింది. మీరు ఏ మార్పు చేయలేరు. మీరు దానిని యధాతధముగా తీసుకోవాలి. అప్పుడు మీరు సరైన జ్ఞానం పొందుతారు.