TE/Prabhupada 0186 - దేవుడు దేవుడు. ఉదాహరణకు బంగారము బంగారముLecture on BG 7.1 -- Fiji, May 24, 1975

అందువల్ల మనము ఫిజీలో లేదా ఇంగ్లండ్లో లేదా ఎక్కడున్నాను, కృష్ణుడు ప్రతి దాని యొక్క యజమాని, ప్రతిచోటా ..., Sarva-loka-maheśvaram (BG 5.29).. ఫిజి అనేది సర్వా-లోకాములలో చిన్న భాగం. అయిన అన్ని లోకాములకు యజమాని అయితే, అయిన ఫిజి యొక్క యజమాని కూడా. దాని గురించి ఎటువంటి సందేహం లేదు. ఫిజి నివాసులు, మీరు కృష్ణ చైతన్యమున్ని తీసుకుంటే, అది జీవిత పరిపూర్ణము. ఇది జీవిత పరిపూర్ణము. కృష్ణుడి ఉపదేశముల నుండి వైదొలగవద్దు. నేరుగా, భగవన్ ఉవాచా, నేరుగా భగవoతుడు మాట్లాడుతున్నాడు. మీరు దాని ప్రయోజనాన్ని తీసుకోండి మీరు భగవద్గీత చూడండి. ప్రపంచంలోని అన్ని సమస్యల పరిష్కారం దానిలో ఉంది. మీరు ఏదైనా సమస్యను తీసుకురండి, పరిష్కారం ఉంది, మీరు ఆ పరిష్కారమును తీసుకుంటే అందించబడుతుంది.


ఈ రోజుల్లో వారు ఆహారం కొరత ఎదుర్కొంటున్నారు. ఈ పరిష్కారం భగవద్గీతలో ఉంది. కృష్ణుడు చెప్తాడు, annād bhavanti bhūtāni: (BG 3.14) "భుతని, అన్ని ప్రాణులు జీవులు, జంతువులు మనిషులు అందరు చాలా చక్కగా జీవించగలరు, ఏ ఆందోళన లేకుండా, తగినంత ఆహార ధాన్యాలు కలిగివుంటే. " ఇప్పుడే మీ అభ్యంతరం ఏమిటి? ఇది పరిష్కారం. కృష్ణుడు చెప్తాడు, annād bhavanti bhūtāni. ఇది ఉహలోకము కాదు; అది ఆచరణాత్మకమైనది. మీరు మానవుడికి జంతువులకు తిండికి తగిన ఆహార ధాన్యాన్ని కలిగి ఉండాలి, ప్రతిదీ వెంటనే శాంతియుతంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ఆకలితో ఉంటే అతడు కలత చెందుతాడు. అందువల్ల అతనికి మొదట ఆహారం ఇవ్వండి. ఇది కృష్ణుని ఉత్తర్వు. చాలా అసాధ్యమా? అసాధ్యమా? కాదు మీరు ఎక్కువ ఆహారం పండించండి. అందరికి పంచండి. చాలా భూమి ఉంది, కానీ మనము ఆహారం పండించడము లేదు. మనము సాధనాలు మరియు మోటార్ టైర్ల తయారీలో బిజీగా ఉన్నాము. ఇప్పుడు మోటార్ టైర్లను తినండి. కానీ కృష్ణుడు అన్నాడు, "మీరు అన్నామును పండించండి." అప్పుడు కొరత సమస్య లేదు. Annād bhavanti bhūtāni parjanyād anna-sambhavaḥ. తగినంత వర్షం ఉన్నప్పుడు అన్నాము ఉత్పత్తి అవుతుంది. Parjanyād anna-sambhavaḥ. And yajñād bhavati parjanyaḥ (BG 3.14). మీరు యజ్ఞము చేస్తే, అప్పుడు తరుచు వర్షపాతం ఉంటుంది. ఇది, మార్గం. కానీ ఎవరూ యజ్ఞము మీద ఆసక్తి కలిగి లేరు, ఎవరూ ఆహార ధాన్యం మీద ఆసక్తి కలిగి లేరు, మీరు మీ సొంత కొరత సృష్టిస్తే, అది దేవుడు తప్పు కాదు; ఇది మీ తప్పు.


ఏదైనా, ఏదైనా సమస్యను తీసుకోండి - సామాజిక, రాజకీయ, తాత్విక, మతపరమైన, మీరు తీసుకున్న ఏదైనా - పరిష్కారం ఉంది. ఈ కుల పద్ధతి గురించి భారతదేశం ఎదుర్కొంటున్నట్లుగానే. చాలామంది కుల పద్ధతికి అనుకూలంగా ఉంటారు, చాలామంది అనుకూలంగా లేరు. కానీ కృష్ణుడు పరిష్కారం చేస్తాడు. అనుకూలంగా లేదా అనుకూలంగా లేకుండా అనే ప్రశ్న లేదు. కుల పద్ధతి లక్షణముల ప్రకారం ఉండాలి. Cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma (BG 4.13). Never says, "By birth." పుట్టిన ప్రకారము అని ఎప్పుడూ చెప్పలేదు. శ్రీమద్-భాగావతం లో ధృవీకరించబడింది,


yasya yal lakṣaṇaṁ proktaṁ
puṁso varṇābhivyañjakam
yad anyatrāpi dṛśyeta
tat tenaiva vinirdiśet
(SB 7.11.35)


నరాదా ముని యొక్క స్పష్టమైన సూచన. అందుచే వేదముల సాహిత్యంలో సంపూర్ణంగా ప్రతిదీ ఉన్నది, మనము అనుసరిస్తే ... ఈ సూత్రంపై ప్రజలకు బోదిoచేoదుకు కృష్ణ చైతన్య ఉద్యమం ప్రయత్నిస్తోంది. మనము ఏది తయారు చేయడములేదు. అది మా పని కాదు. మేము అసంపూర్ణంగా ఉన్నామని మాకు తెలుసు. మనము ఏదైన తయారు చేస్తే, ఆది అసంపూర్ణముగా వుంటుంది. మా బద్ధ జీవితంలో నాలుగు తప్పులు ఉన్నాయి: మనము పొరపాటు చేస్తాము, మనము భ్రమలు కలిగి ఉంటాము, ఇతరులను మోసం చేస్తాము, మన ఇంద్రియాలను అసంపూర్ణమైనవి. మనము ఒక వ్యక్తి నుండి పరిపూర్ణ జ్ఞానాన్ని ఎలా పొందగలము, అతడు ఈ తప్పులను కలిగి ఉంటే? అందువల్ల దేవాదిదేవుడు నుండి జ్ఞానం పొందాలి, ఈ లోపాల వలన ప్రభావితము కానీ ముక్తా-పరుషునితో. అది పరిపూర్ణ జ్ఞానం.


అందువల్ల మా అభ్యర్థన మీరు భగవద్గీత నుండి జ్ఞానం తీసుకొని దాని ప్రకారం నడుచుకోండి మీరు ఏమిటి అని మీరు పటించుకోవలసిన అవసరము లేదు. భగవoతుడు ప్రతి ఒక్కరికీ ఉన్నాడు. దేవుడు దేవుడు. బంగారం బంగారంగా ఉంటుంది. బంగారం హిందూ చేత నిర్వహించబడితే అది హిందూ బంగారం కాదు. లేదా బంగారు క్రిస్టియన్ ద్వారా నిర్వహించబడితే, ఆది క్రిస్టియన్ బంగారం కాదు. బంగారం బంగారం. అదేవిధంగా, ధర్మాము ఒకటి. ధర్మము ఒకటి. హిందూ ధర్మము, ముస్లిం ధర్మము, క్రైస్తవ ధర్మము ఉండవు. అది కృత్రిమమైనది. కేవలం "హిందూ బంగారం", "ముస్లిం బంగారం" వలె. అది సాధ్యం కాదు. బంగారం బంగారమే. అదేవిధంగా ధర్మము. ధర్మము అంటే దేవుడు ఇచ్చిన ధర్మము . అది ధర్మము. Dharmaṁ tu sākṣād bhagavat-praṇītaṁ na vai vidur devatah manuṣyāḥ (SB 6.3.19), అలాంటిది - నేను మర్చిపోయాను - "ధర్మా, ధర్మము యొక్క ఈ సూత్రం, ధర్మ సంబంధమైన పద్ధతి, దేవుడిచ్చినది" అని. దేవుడు ఒకడు; అందువలన ధర్మా, లేదా ధర్మ పద్ధతి, ఒకటే అయి ఉండాలి. రెండూ కాదు.