TE/Prabhupada 0201 - మీ మరణాన్ని ఎలా ఆపుతారు
Lecture on CC Madhya-lila 20.102 -- Baltimore, July 7, 1976
కనుక మనమందరము జ్ఞానము కావాలి అని ఆశిస్తాము. అయితే మనకు చాలా విషయాలు తెలియవు. అందువలన సనాతన గోస్వామి తనకి ఆధ్యాత్మిక గురువు అవసరం అనే విషయాన్ని తను ఆచరించే ప్రవర్తన ద్వారా మనకు బోధిస్తున్నారు. మరియు "నేను ఈ విధంగా బాధపడుతున్నాను" అని తన సొంత విషయాన్ని చెబుతున్నారు. అతను మంత్రి, కనుక తను బాధ పడవలసివ ప్రశ్నే లేదు. అతను వున్న పరిస్థితి చాల ఉన్నతమైనది. అతను ఇప్పటికే ఈ విధముగా వివరించాడు, grāmya-vyavahāre paṇḍita, tāi satya kari māni. చాలా ప్రశ్నలకు నేను జవాబు ఇవ్వలేను. పరిష్కారం లేదు ఇప్పటికీ, ప్రజలు నేను మంచి పండితుడు అని అంటారు - నేను అంగీకరిస్తాను. కాని అది మూర్ఖత్వం... గురువుని ఆశ్రయించకుండా ఎవరు పండితులు కాలేరు. Tad-vijñānārthaṁ sa gurum evābhigacchet (MU 1.2.12). అందువల్ల వేదములు చెప్పేదేమిటంటే నీవు పండితుడివి కావాలంటే గురువుని ఆశ్రయించ వలసి వుంటుంది. అది కూడా ప్రామాణికమైన గురువుని, ఏదో ఒక గురువుని కాదు.
- paripraśnena sevayā
- upadekṣyanti te jñānaṁ
- jñāninas tattva-darśinaḥ
- (BG 4.34)
పరమ సత్యమును సందర్శించిన వారే గురువు. వారే నిజమైన గురువు. Tattva-darśinaḥ, తత్వమనగా పరమ సత్యం, మరియు darśinaḥ, అనగా తత్వమును లేదా ఆ పరమ సత్యమును చూసినవారు. కాబట్టి ఈ ఉద్యమం, మన కృష్ణ చైతన్య ఉద్యమం పరమ సత్యమును చుడగలగటమే దాని ప్రయోజనము. పరమ సత్యము తెలుసుకొనటం, జీవిత సమస్యలు అర్ధమవాటం మరియు వాటిని ఎలా పరిష్కరించుకోవాలి ఈ విషయాలు మనకి ముఖ్యాంశములు మన ఈ ముఖ్యాంశములు భౌతికమయినవి కావు ఏదో విధముగా నీకు వొక కారు, చక్కని ఇల్లు మరియు చక్కని భార్య ఉన్నంత మాత్రాన సమస్యలన్నీ తీరిపోతవి అని అనుకోవటము తప్పు. ఇది సమస్య యొక్క పరిష్కారం కాదు. నిజమైన సమస్య మీ మరణాన్ని ఎలా ఆపాలి అనే విషయం. అది నిజమైన సమస్య. కానీ ఈ సమస్య కష్టతరమైన విషయం కనుక, ఎవ్వరూ దాని జోలికి పోరు. "ఓ మరణం - మేము శాంతియుతంగా చనిపోతాము", కానీ ఎవరూ శాంతియుతంగా చనిపోలేరు. నేను ఒక కత్తి తీసుకొని , "ఇప్పుడు శాంతియుతంగా చనిపో" (నవ్వు) అంటే శాంతియుత పరిస్థితి అంత వెంటనే ముగిసిపోతుంది. ఆతను బిగ్గరగా అరుస్తాడు. "నేను శాంతియుతంగా చనిపోతాను." అని ఎవరైనా అంటే అది అర్ధము లేనిది. ఎవరు కూడా శాంతియుతంగా మరణిన్చలేరు , అది సాధ్యం కాదు. కాబట్టి మరణం ఒక సమస్య. పుట్టుక కూడా ఒక సమస్య. ఎవరు కూడా తల్లి గర్భములో సుఖముగా ఉండలేరు. గర్భ సంచి నిండుగా వుంటుంది. గాలి చొరవని ప్రదేశము. ఈ రోజుల్లో అయితే చంపబడటము అనే ప్రమాదము కూడా వుంది. అందువల్ల జననము మరియు మరణము అనే విషయాలు ఎప్పుడు సుఖవంతమైనవి కావు. మరియు ముసలితనము. నాలాగ. నేను వృద్ధుడనవుతున్నాను. నాకు చాలా బాధలు వున్నవి. అందువలన వృద్ధాప్యం మరియు వ్యాధులు. ప్రతి ఒక్కరికి వ్యాధి గురించి అనుభవము వుంది. ఒట్టి తలనొప్పి చాలు. మీరు బాధ పడటానికి. నిజమైన సమస్య ఇది: జననం, మరణం, వృద్ధాప్యం మరియు వ్యాధి. ఇది కృష్ణునిచేత చెప్పబడినది. janma-mṛtyu-jarā-vyādhi duḥkha-doṣānudarśanam (BG 13.9).మీకు తెలివి అంటూ ఉంటే, జీవితంలోని ఈ నాలుగు సమస్యలను చాలా ప్రమాదకరమైనవిగా తీసుకోవాలి.
కనుక చాలా మందికి దీని విషయములో జ్ఞానము లేదు. ఈ ప్రశ్నలని దూరముగా పెడతారు. కాని మనము ఈ ప్రశ్నల్ని చాలా తీవ్రమయినవిగా తీసుకుంటాము.. ఇతర ఉద్యమములకు మరియు కృష్ణ చైతన్య వుద్యమునకు మధ్య వున్న తేడా ఇదే.. ఈ సమస్యలను పరిష్కరించటమనేదే మన వుద్యమము.