TE/Prabhupada 0202 - ఆధ్యాత్మిక ప్రచారకుని కంటే ఎవరు ఎక్కువగా ప్రేమించగలరు



Morning Walk -- May 17, 1975, Perth

అమోఘ:: ఆస్ట్రిచెస్ వాటి తలల్ని భూమి రంధ్రాలలో వున్చుకుంటవి.

ప్రభుపాద: అవును

పరమహంస: హరే కృష్ణ ఉద్యమంలో చాలా మంది పాల్గొంటున్నందున కొంత పురోగతి ఉండితీరాలి.

ప్రభుపాద: వారు నిజమైన పురోగతిని సాధిస్తున్నారు. Bhava-mahā-dāvāgni-nirvāpaṇam. వారి భౌతిక మైన ఆందోళనలు ముగుస్తాయి. వారు అభివృద్ది పధములో వున్నారు. Ceto-darpaṇa-mārjanaṁ bhava-mahā-dāvāgni-nirvāpaṇam (CC Antya 20.12). హరే కృష్ణ మహా మంత్రం జపించటం ద్వారా వారి మురికి హృదయం పరిశుద్ధం అవుతుంది, మరియు అది పూర్తిగా పరిశుద్ధమైన వెంటనే, భౌతిక ఉనికి యొక్క సమస్యలు ముగుస్తాయి. ఇక భౌతిక ఆందోళనలు వుండవు.

పరమహంస: వారు సంతోషంగానే ఉన్నారు, కానీ ... కృష్ణుని భక్తులు సంతోషంగానే ఉన్నారు, కానీ వారు పనులు ఆచరిన్చటములేదు. వారు ఎల్లప్పుడూ పాడుతారు, నృత్యం చేస్తారు మరియు అందరి నుండి డబ్బు కోరుతుంటారు. కానీ వారు ఏ ఆచరణాత్మక పనులు చేయరు. మేము చాలా ఆచరణాత్మక పనులను చేస్తున్నాము.

ప్రభుపాద: డ్యాన్స్ చేయటము పని కాదా? మరియు పుస్తక రచన పని కాదా? పుస్తకాలు అమ్మటము పని కాదా? అటుమంటప్పుడు పని అంటే ఏమిటి? Hm? పని అంటే కోతిలాగ దుమకటమా? అవును. పని అంటే అదే

అమోఘ: కానీ మేము ఆచరణాత్మకంగా ఆసుపత్రిలోని వారికి లేదా మద్యము సేవించేవారికి సహాయం చేస్తున్నాము .

ప్రభుపాద: కాదు, ఏమి ... మీరు ఏవిధముగా సహాయం చేస్తున్నారు? ఆసుపత్రికి వెళ్ళిన వారు చనిపోరా? మరియు మీరు ఎలా సహాయం చేస్తున్నారు? మీరు సహాయం చేస్తున్నామని అనుకొంటున్నారు.

అమోఘ: కానీ ఆ మనిషి ఎక్కువ కాలం జీవిస్తాడు

ప్రభుపాద: ఇది ఇంకొక మూర్ఖత్వం. ఎంతకాలం నీవు జీవిస్తావు? మరణ సమయం వచ్చినప్పుడు, మీరు క్షణ మాత్రం కూడా ఎక్కువ జీవించరు. ఒక మనిషి చనిపోతున్నాడంటే, అతని జీవితం పూర్తయిందని మీ ఇంజెక్షన్, ఔషధం, ఒక నిమిషం జీవితాన్ని ఎక్కువ ఇవ్వగలదా? అలాంటి ఔషధం ఏదయినా ఉందా?

అమోఘ: బాగానేవుంది. అల్లాంటిది వుండి ఉండవచ్చు..

ప్రభుపాద: లేదు ...

అమోఘ: ఒక్కొక్కసారి ఔషధం ఇచ్చినప్పుడు వారు ఎక్కువ కాలం జీవిస్తారు.

పరమహంస: వారు చెప్పినదాని ప్రకారం సంపూర్నమైన గుండె మార్పిడిని చేయగలిగితే, ప్రజలు ఎక్కువకాలం నివసించేలా చేస్తారు ...

ప్రభుపాద: వారు చెప్తారు, వారు ... ఎందుకంటే మేము వారిని జులాయి వాళ్ళ క్రింద పరిగనణిస్తాము , నేను ఎందుకు వారి మాటలు తీసుకోవాలి? మేము వారిని జులాయిల క్రింద పరిగణిస్తాము, అంతే. (ఎవరో జనములో వెనుక నుంచి గట్టిగ అరిచారు; ప్రభుపాద వారిని చూచి హుంకరించారు) (నవ్వు). మరొక జులాయి. అతను జీవితాన్ని బాగా అనుభవిస్తున్నాడు కాబట్టి ప్రపంచమంతా జులాయిలతో నిండి ఉంది. మనము ఈవిషయాల్లో చాల నిరాశాజనకముగా వుండాలి. ఈ ప్రపంచ విషయాల్లో ఆశజనకముగా అసలు ఉండవద్దు. (భౌతిక ప్రపంచమువైపు) నిరాశావాదిగా మారకపోతే, మీరు ఇంటికి (భగవంతుని సన్నిధికి) తిరిగి వెళ్ళలేరు. మీకు ఈ ప్రపంచం మీద కొంచెం మాత్రమె ఆకర్షణ కలిగి ఉంటే - "అది మంచిది" - కాని మీరు ఇక్కడే ఉండవలసి వస్తుంది అవును. కృష్ణుడు చాలా కఠినంగా ఉంటాడు.

పరమహంస: "నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా నీ సహోదరుని కూడా ప్రేమించు" అని యేసు అన్నాడు. మన సోదరుణ్ణి ప్రేమిస్తే ...

ప్రభుపాద: మనము ప్రేమించుచున్నాము. మనము కృష్ణ చైతన్యాన్ని ఇస్తున్నాం. అది ప్రేమ, నిజమైన ప్రేమ. మనము వారికి శాశ్విత జీవితము మరియు శాశ్విత ఆనందం ఇస్తాము మనం వారిని ప్రేమించకపోతే, మనము వారి కొరకు అన్ని ఇబ్బందులు ఎందుకు తీసుకుంటున్నాము? బోధకుడు ప్రజలను తప్పకప్రేమిస్తాడు. లేకపోతే అతను ఎందుకు అన్ని ఇబ్బందులు తీసుకుంటున్నాడు? అతను ఇంటికి పరిమితమై తనకు తాను చేసుకొనగలడు. ఎందుకు అతను ఇంత ఇబ్బందులు తీసుకుంటున్నాడు? ప్రేమించకపోతే ఎనభై ఏళ్ళ వయసులో నేను ఇక్కడకు ఎందుకు వచ్చాను? కనుక బోధకుడు కన్నా ఎవరు ఎక్కువగా ప్రేమిన్చగలరు? అతను జంతువులను కూడా ప్రేమిస్తాడు. కాబట్టి వారు భోదిస్తున్నారు. "మాంసం తీసుకోవద్దు." వారు జంతువులను ప్రేమిస్తున్నారా, జులాయిలు? వారు తింటున్నారు, మరియు వారు వారి దేశాన్ని ప్రేమిస్తున్నారు. ఎవరూ ప్రేమించటములేదు. ఇది కేవలం ఇంద్రియాలను తృప్తి పరచటము మాత్రమే ఎవరైనా నిజముగా ప్రేమిస్తున్నారంటే, వారు కృష్ణ చైతన్యము కలవారు. అది అంతే. మిగిలిన వారందరూ జులాయిలే. వారు వారి సొంత ఇంద్రియ తృప్తి కొరకు ప్రయత్నిస్తుంటారు, మరియు వారు ఒక సైన్బోర్డును పెడతారు, "నేను ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నాను" ఇది వారి వ్యాపారము మరియు ఫూల్స్ అంగీకరించడం, "ఓహ్, ఇతను చాలా దాతృత్వము కలవాడు." అతను ఏ మనిషిని నిజముగా ప్రేమించడు. అతను తన సొంత ఇంద్రియాలను మాత్రమే ప్రేమిస్తాడు. అంతే. ఇంద్రియములకు సేవకుడు, అంతే.