TE/Prabhupada 0209 - మన స్వగృహమైన భగవంతుని వద్దకు ఎలా తిరిగి వెళ్ళాలి
Lecture on SB 6.1.16 -- Denver, June 29, 1975
మానవ జీవితం ఈ పవిత్రీకరణను ఉద్దేశించబడింది. మనము రోజువారీ భోజనము పొందడానికి మనము ఎంతో కష్టపడుతున్నాము. ప్రజలు వారి భోజనము సోమరిగా కూర్చొని పొందడం లేదు. అది సాధ్యం కాదు. వారు చాలా కష్టపడాలి. డెన్వర్ ఒక మంచి నగరంగా ఉంది. అది అడవి లేదా ఎడారి నుండి పుట్టుకొచ్చింది కాదు. ఈ నగరం చక్కగా, ఉత్తమంగా నిలబడి ఉండేలా చేయడానికి చాలా కష్టపడి పనిచేశారు. మనము పని చేయాలి. మనకు ఆనందం కావాలంటే, మనము పని చేయవలసి వుంది. దానిని గురించి ఎటువంటి సందేహం లేదు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు yānti deva-vratā devān (BG 9.25). ఈ భౌతిక వాతావరణంలో సంతోషంగా ఉండటానికి కొంతమంది పని చేస్తున్నారు, ఈ ప్రపంచంలో అతి గొప్ప వానిగా మారటానికి, లేదా, ఇంకా కొంచెం తెలివైన వారు, వారు కూడా ఈ జీవితంలో సంతోషంగా లేరు, కానీ వారు తరువాతి జీవితంలో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. ఒక్కొక్కసారి వారు ఉన్నత లోకములు గల గ్రహ మండలాలకు వెళతారు. కనుక yānti deva-vratā devān pitṛn yānti pitṛ-vratāḥ (BG 9.25). మీరు పని చేస్తున్నప్పుడు, మీరు ఆశించిన ఫలితం పొందుతారు. అయితే శ్లోకము లోని చివరి పంక్తిలో, కృష్ణుడు చెబుతున్నాడు, mad-yājino'pi yānti mām: మీరు పని చేస్తే లేదా మీరు నన్ను ఆరాధిస్తే, మీరు నా దగ్గరకు వస్తారు. అప్పుడు కృష్ణుని దగ్గరకు వెళ్ళటానికి మరియూ ఈ భౌతిక ప్రపంచం లోనే ఉండటానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? వ్యత్యాశము వుంది, ābrahma-bhuvanāl lokāḥ punar āvartino 'rjuna (BG 8.16). ఈ భౌతిక ప్రపంచం లో మీరు గొప్పదైన లోకము, బ్రహ్మలోకమునకు వెళ్ళగలిగినట్లయితే, ఐనప్పటికీ జననం, మరణం, వృద్ధాప్యం మరియూ వ్యాధి ఆనేవి వున్నవి. లేదా మీరు మళ్లీ తిరిగి రావలసివుంటుంది. ఏవిధముగా అంటే, ఈ వ్యక్తులు చంద్ర గ్రహమునకు వెళ్లి మళ్లీ తిరిగి ఇక్కడకు వస్తున్నట్లుగా. కనుక, ఈవిధముగా వెళ్ళటము మరియు తిరిగి రావటము మంచిది కాదు. Yad gatvā na nivartante (BG 15.6). మీరు ఏ లోకమునకు గనుక వెళితే మరల ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రానక్కరలేదో అటువంటి లోకమునకు వెళ్లినట్లయితే, అది అత్యధిక పరిపూర్ణత. అదియే, కృష్ణ లోకం.
కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు "ఈ భౌతిక ప్రపంచంలో సంతోషంగా ఉండటానికి నీవు చాలా కృషి చేస్తే, అదే శ్రమతో, నీవు నన్ను పూజిస్తే, అనగా కృష్ణుని, అప్పుడు నీవు నా దగ్గరకు వస్తావు. Mad-yājino 'pi yānti mām. ముఖ్యంగా ప్రయోజనం ఏమిటి? Mām upetya kaunteya duḥkhālayam aśāśvatam nāpnuvanti: (BG 8.15) నా దగ్గరకు ఎవరైతే వస్తారో, వారు ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రానవసరము లేదు. మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజలకు భోదిస్తుంది, ఎలా మన గృహానికి వెళ్ళాలో, తిరిగి భగవంతుని దగ్గరకు , కృష్ణుని దగ్గరకు. అది వ్యక్తులను నిరంతర సంతోషముగా ఉంచుతుంది. ఇప్పుడు జరుగుతున్న జీవితంలో కూడా, కృష్ణ చైతన్యములో వున్న వారు అసంతృప్తిగా లేరు. మీరు ఆచరణాత్మకంగా చూడగలరు. మనము మంచి సుందరమైన గదిలో కూర్చొని హరే కృష్ణ మంత్రాన్ని చేస్తున్నాము మరియూ ప్రసాదం తీసుకుంటున్నాము. అసంతృప్తి ఎక్కడ ఉంది? అసంతృప్తి లేదు. మరియూ ఇతర పద్ధతులు ఆచరించేవారు అనేక విధములయన అసంతృప్తి మార్గముల ద్వారా వెళ్ళవలసి వుంటుంది. ఇక్కడ, కృష్ణ చైతన్యమునందు, అసంతృప్తి ఏమీ లేదు. ఇది భగవద్గీతలో చెప్పబడింది: susukham kartum avyayam (BG 9.2). Susukham. మీరు భక్తియుక్త సేవలను నిర్వహించినప్పుడు, అది సుఖమొక్కటి మాత్రమే కాదు - సుఖం అంటే ఆనందం - కానీ ఇంకొక పదం జోడించబడింది ,సుసుఖం, "చాలా సౌకర్యం, చాలా ఆనందం." Kartum, భక్తియుక్త సేవలను నిర్వహించటమనేది గొప్ప సుఖం, గొప్ప ఆనందం. మరియూ అవ్యయం. అవ్యయం అనగా మీరు ఏ ఏ పనులను చేస్తారో, అవి మీ శాశ్వత ఆస్తి. ఇతర విషయాలు, అవి అన్త్యమయేవి. ఉదాహరణకు, మీరు చాలా ఉన్నత విద్యావంతులైన వ్యక్తి అని అనుకుందాం. మీరు M A., Ph.D మరియూ ఏదో ఏదో వానిలో ఉత్తీర్నులయారు. కానీ అవి అవ్యయం కాదు; అవి వ్యయమే. వ్యయమ్ అంటే అన్త్యమయేది అని అర్ధం. మీ శరీరం అంతమవగానే, వెంటనే పిలవబడే మీ డిగ్రీలు అన్ని అంతమైనట్లే. తరువాత మరల వచ్చే జన్మలో మీరు ఒక మానవుడిగా ఉన్నట్లయితే ... మళ్ళీ M.A., Ph.D., లు పొందే అవకాశం వుంది. కానీ ఈ జీవితం లోని మొదటి M.A., Ph.D., అవి ముగుస్తవి.
కనుక మనము ఇక్కడ ఏమైతే పొందుతున్నామో, అవి అవ్యయం కాదు. వ్యయం అంటే ఖర్చు, మరియూ అ అంటే కాదు, అనగా ఖర్చు కానిది. మీ దగ్గర కొంత ధనం ఉంటే, దాన్నిమీరు ఖర్చు పెట్టినట్లయితే , అది వ్యయం, కొంత సమయం తర్వాత అంతమవుతుంది. అవ్యయం అనగా మీరు కావలసినంత ఖర్చు పెట్టండి, ఐనను అది అంతమవ్వదు. అది అవ్యయం. కృష్ణునికి భక్తిపూర్వక సేవ susukhaṁ kartum avyayam గా వివరించబడింది. మీరు ఏది చేసినా, మీరు అందులో పది శాతం విజయవంతము చేసుకోగాలిగినా, ఆ పది శాతం శాశ్వతంగా ఉంటుంది. అందువల్ల భగవద్గీత యందు ఇలా చెప్పబడింది, śucīnāṁ śrīmatāṁ gehe yoga-bhraṣṭo sanjāyate (BG 6.41). ఈ జీవితంలో భక్తి-యోగాను ఎవరైతే పూర్తి చేయలేకపోతారో , వారు మానవ జీవితపు మరొక అవకాశం పొందుతారు. మానవ జీవితం మాత్రమే కాదు, వారు స్వర్గ లోకమునకు వెళ్లి, వారు అక్కడ ఆనందింస్తారు అని చెప్పబడింది. తిరిగి ఈ లోకమునకు మరల వస్తారు. అది కూడా సాధారణ వ్యక్తిగా కాదు. Śucīnāṁ śrīmatāṁ gehe: అతను మంచి పవిత్ర కుటుంబంలో పుడతాడు, brāhmaṇa-Vaiṣṇava, śucīnām, and śrīmatām లాంటి చాలా గొప్ప కుటుంబములో పుడతాడు. అప్పుడు అది తన కర్తవ్యం. కనుక ఎవరైతే గొప్ప వానిగా జన్మిస్తారో ..... మీరు అమెరికన్లు, మీరు గొప్పగా జన్మించ వలసి వుంది. ఇది నిజము మీరు ఈ పంధాలో ఆలోచించవలెను, "మా మునుపటి భక్తియుక్త సేవ కారణంగా, కృష్ణుని యొక్క కృప ద్వారా మనము ఈ దేశంలో జన్మించాము. పేదరికం లేదు, "śrīmatām. మీరు కృష్ణ చైతన్యాన్ని చాలా ముఖ్యమైనదిగా తీసుకోవాలి. మీకు అవకాశం వచ్చింది. మీరు పేదరికానికి అంటుకొని యుండలేదు. మీరు "ఆహారం ఎక్కడ ఉంది? ఆహారం ఎక్కడ ఉంది? ఆహారం ఎక్కడ ఉంది?" అని మీ సమయాన్ని వృద్ధా చేయనవసరము లేదు. పేదరికం బారిన పడిన ఇతర దేశాలలోని వారు ఆహారాన్ని సంపాదిన్చుకొనటానికి ఇబ్బందిపడుతున్నారు. కానీ మీరు చాలా అదృష్టవంతులై యున్నారు, హిప్పీలుగా మారి మీ అవకాశాన్ని వృధా చేసుకోవద్దు. వృధా చేయవద్దు. భక్తునిగా అవ్వండి, కృష్ణ భక్తునిగా అవ్వండి. కృష్ణ చైతన్య ఉద్యమము ఉంది, మరియు మనకు చాలా కేంద్రాలు వున్నాయి. ఈ కృష్ణ చైతన్య విజ్ఞాన శాస్త్రాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నించండి, మరియూ మీ జీవితాన్ని పరిపూర్ణమైనదిగా చేసుకోండి. ఇది మా అభ్యర్థన.
చాలా ధన్యవాదాలు.