TE/Prabhupada 0211 - శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కోరికను స్థాపించటమే మన లక్ష్యం



Lecture on CC Adi-lila 1.4 -- Mayapur, March 28, 1975


శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కనికరం లేకుండా మీరు కృష్ణచైతన్య మార్గములో ముందుకు వెళ్ళలేరు. శ్రీ చైతన్య మహాప్రభు ద్వారా వెళ్ళటం అంటే ఆరు గోస్వామిల గుండా వెళ్ళటము. ఇది పరంపర పద్ధతి. అందువల్ల నరోత్తమ దాస ఠాకురా అంటారు,

ei chay gosāi jār-tār mui dās
tā-sabāra pada-reṇu mora pañca-grās

ఇది పరంపర పద్ధతి. మీరు జంప్ చేయలేరు. మీరు పరంపర పద్ధతి ద్వారా వెళ్ళాలి. మీరు మీ ఆధ్యాత్మిక గురువు ద్వారా గోస్వామిలకు చేరుకోవాలి, గోస్వామిల ద్వారా మీరు శ్రీ చైతన్య మహాప్రభువును చేరవలసి ఉంటుంది, శ్రీ చైతన్య మహాప్రభు ద్వారా మీరు కృష్ణుడిని చేరుకోవాలి. ఇది మార్గం. అందువల్ల నరోత్తమ దాస ఠాకురా అంటారు, ei chay gosāi jār-tār mui dās. మనము సేవకుని సేవకులము ఇది చైతన్య మహాప్రభు యొక్క ఆదేశం, gopī-bhartuḥ pada-kamalayor dāsa-dāsānudāsaḥ ( CC Madhya 13.80) నీవు మరింత సేవకుని సేవకుడుగా అయిన కొలది, అంతగా నీవు పవిత్రుడవౌతావు. అకస్మాత్తుగా మీరు గురువు అవ్వాలని కోరుకుంటే, అప్పుడు మీరు నరకానికి వెళతారు. అంతే. అలా చేయవద్దు. ఇది శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశము. సేవకుని, సేవకుని, సేవకుని ద్వారా మీరు వెళ్ళినట్లయితే, అప్పుడు మీరు ఉన్నతముగా ఎదిగినట్లు. మీరు ఇప్పుడు గురువు అయ్యారని అనుకుంటే, మీరు నరకమునకు వెళ్తున్నారు. ఇది పద్ధతి. Dāsa-dāsānudāsaḥ అని చైతన్య మహాప్రభు అన్నారు. కనుక సేవకుడు, సేవకుడు, సేవకుడు, ఇప్పుడు వందసార్లు సేవకుడు, అంటే అతను ఉన్నత స్థానమునకు ఎదిగినట్లు. అతడు ఉన్నత స్థానమునకు వచ్చాడు అని. ఎవరైతే నేరుగా గురువు అవుతారో, అప్పుడు వారు నరకం లో ఉన్నట్లే.

కాబట్టి anarpita-carīṁ cirāt. కనుక మనము శ్రీల రూప గోస్వామి ఉపదేశమును ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అందువల్ల మనం ప్రార్దిస్తాము, ṣrī-caitanya-mano-'bhīṣṭaṁ sthāpitaṁ yena bhū-tale. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క కోరికను స్థాపించటమే మనలక్ష్యం. ఇది మన కర్తవ్యము. Śrī-caitanya-mano-'bhīṣṭaṁ sthāpitaṁ yena bhū-tale. శ్రీల రూపా గోస్వామి దీనిని చేశారు. ఆయన మనకు చాలా పుస్తకాలు ఇచ్చారు, ముఖ్యంగా భక్తి-రసామృత-సింధు, ఇది మనము ఆంగ్లంలోకి Nectar of Devotion గా అనువదించాము. భక్తియుక్త సేవ యొక్క విజ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు. ఒక భక్తుడుగా కావాలంటే ఇది శ్రీల రూప గోస్వామి చేసిన గొప్ప సహకారం. ఒక భక్తుడుగా ఎలా అవ్వాలి. ఇది మనోభావం కాదు; ఇది విజ్ఞాన శాస్త్రము. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం గొప్ప విజ్ఞాన శాస్త్రం. Yad vijñāna-samanvitam. Jñānaṁ me paramaṁ guhyaṁ yad vijñāna-samanvitam. ఇది మనోభావం కాదు. మీరు దీనిని మనోభావంగా తీసుకుంటే, మీరు కలత కలిగిస్తారు. ఇది రూప గోస్వామి యొక్క సూచన. ఆయన అన్నారు,

śruti-smṛti-purāṇādi-
pañcarātriki-vidhiṁ vinā
aikāntikī harer bhaktir
utpātāyaiva kalpate
[Brs. 1.2.101]