TE/Prabhupada 0221 - మాయావాదులు, వారు భగవంతునితో ఒకటి అయ్యాము అని వారు భావిస్తారు. అది విద్య కాదు



Janmastami Lord Sri Krsna's Appearance Day -- Bhagavad-gita 7.5 Lecture -- Vrndavana, August 11, 1974


కృష్ణుడు, ఆయన అర్జునుడిని అడిగినప్పుడు - భగవద్గీత యొక్క ఈ తత్వము నీవు సూర్య-దేవుడికి బోధించావని నీవు చెప్తున్నావు. నేను ఎలా నమ్మాలి? సమాధానం ఏమిటంటే "ఈ విషయము చర్చించినప్పుడు మనము ఇద్దరమూ ఉన్నాము, కానీ నీవు మర్చిపోయావు నేను మర్చిపోలేదు."

ఇది కృష్ణుడు మరియు సాధారణ జీవి మధ్య ఉన్న వ్యత్యాసం... ఆయన సంపూర్ణము; మనము సంపూర్ణము కాదు. మనము కృష్ణునిలో చిన్న భాగం. అసంపూర్ణము అందువల్ల మనము కృష్ణుడిచే నియంత్రించబడాలి. మనము కృష్ణుడిచే నియంత్రించబడటానికి అంగీకరించకపోతే, అప్పుడు మనల్ని భౌతిక శక్తి నియంత్రిస్తుంది, ఈ bhūmir āpo 'nalo vāyuḥ ( BG 7.4) వాస్తవమునకు, మనము ఆధ్యాత్మిక శక్తి. కృష్ణుడిచే నియంత్రించబడటానికి స్వచ్ఛంధంగా అంగీకరించాలి. అది భక్తియుక్త సేవ. అది భక్తియుక్త సేవ. మనము ఆధ్యాత్మిక శక్తి, కృష్ణుడు మహోన్నతమైన ఆత్మ. అందుచేత కృష్ణుడిచే మనము నియంత్రించబడటానికి అంగీకరిస్తే, అప్పుడు మనము ఆధ్యాత్మిక ప్రపంచానికి ఉద్ధరించబడతాము మనము అంగీకరిస్తే. మీ చిన్న స్వతంత్రములో కృష్ణుడు జోక్యం చేసుకోడు. Yathecchasi tathā kuru ( BG 18.63) కృష్ణుడు అర్జునుడితో, "మీకు ఇష్టము వచ్చినది మీరు చేయవచ్చు." ఆ స్వాతంత్ర్యం మనకు ఉంది.

కాబట్టి ఆ స్వతంత్రము వలన మనం ఈ భౌతిక ప్రపంచమునకు వచ్చాము, స్వేచ్ఛగా ఆస్వాదించడానికి. కాబట్టి కృష్ణుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, "మీరు స్వేచ్ఛగా ఆనందించవచ్చు." మనము అలా చేయడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఫలితము మనం చిక్కుకుపోతున్నాం. ఈ భౌతిక ప్రపంచంలో పనిచేయడానికి మనకు స్వేచ్ఛ ఇవ్వబడినది. అందరూ భౌతిక ప్రపంచం యొక్క యజమాని కావాలని ప్రయత్నిస్తున్నారు. ఎవరూ సేవకుడు కావాలని ప్రయత్నించడము లేదు. కేవలము మనము మాత్రమే, వైష్ణవులము, మనము సేవకులు అవ్వటానికి ప్రయత్నిస్తున్నాం. కర్మీలు, జ్ఞానులు, వారు సేవకులు అవ్వటానికి ఇష్టపడరు. వారు విమర్శిస్తారు. "మీరు వైష్ణవులు, మీరు బానిస మనస్తత్వం కలిగి ఉన్నారు" అవును, మేము కలిగి ఉన్నాము బానిస... చైతన్య మహా ప్రభు భోదించారు, gopī-bhartuḥ pada-kamalayor dāsa-dāsānudāsaḥ ( CC Madhya 13.80) అది మన పరిస్థితి. కృత్రిమంగా చెప్పడము వలన ఉపయోగము ఏమిటి, "నేను యజమానిని"? నేను యజమాని అయితే, ఫ్యాన్ అవసరం ఏముంది? నేను వేసవి కాలం యొక్క ఈ ప్రభావానికి సేవకునిగా ఉన్నాను. అదేవిధముగా, నేను చలి కాలంలో సేవకునిగా ఉంటాను, చాలా చల్లగా ఉంటుంది.

మనం ఎల్లప్పుడూ సేవకులము. అందువల్ల చైతన్య మహా ప్రభు చెప్తారు, jīvera svarūpa haya nitya-kṛṣṇa-dāsa ( Cc. Madhya 20.108-109) వాస్తవానికి, మన స్వరూప పరిస్థితి కృష్ణుని యొక్క శాశ్వత సేవకులము. కృష్ణుడు మహోన్నతమైన నియంత్రికుడు. ఈ కృష్ణ చైతన్యము ఉద్యమము ఈ ప్రయోజనము కోసం ఉద్దేశించబడింది, ఈ పిచ్చి వారు లేదా మూర్ఖులైన వ్యక్తులు మూఢాః ... నేను "మూఢ" "మూర్ఖపు." అనే పదాలను తయారు చేయడము లేదు. ఇది కృష్ణుడిచే చెప్పబడింది. Na māṁ duṣkṛtino mūḍhāḥ prapadyante narādhamāḥ ( BG 7.15) ఆయన అలా చెప్పాడు. మీరు చూస్తారు. దుష్క్రుతినః, ఎల్లప్పుడూ పాపములు చేస్తూ, మూఢాః మరియు దుష్టులు, గాడిద. నరాధమ, మానవాళిలో అత్యంత అల్పులు. ఓ, మీరు...? కృష్ణా, మీరు ఈ భౌతిక శాస్త్రవేత్తల గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నారు? చాలా మంది తత్వవేత్తలు ఉన్నారు. వారు అందరూ నరాధమా? " అవును, వారు నరాధమా. "కానీ వారు చదువుకున్నారు." "అవును, అది కూడా..." కానీ ఏ రకమైన విద్య? Māyayā apahṛta-jñānāḥ: వారి విద్య యొక్క ఫలితం - జ్ఞానం మాయ ద్వారా తీసివేయబడింది. ఒకరు ఎంత ఎక్కువ విద్యావంతులు అయితే, అతడు అంత ఎక్కువ నాస్తికుడు.

ప్రస్తుతానికి... అంటే, విద్య అంటే అర్థం కాదు... విద్య అంటే అర్థం చేసుకోవడము . జ్ఞాని. విద్యను నేర్చుకొనుట, విద్యను నేర్చుకున్నారు అంటే తెలివైన వ్యక్తి, విద్యావంతుడు, జ్ఞాని. వాస్తవమైన జ్ఞాని అంటే మా ప్రపద్యతే. Bahūnāṁ janmanām ante jñānavān māṁ prapadyate ( BG 7.19) అది విద్య. విద్య అంటే నాస్తికుడు అవ్వాలని కాదు, "దేవుడు లేడు, నేను భగవంతుడను నీవు భగవంతుడవు, అందరు భగవంతుడే." ఇది విద్య కాదు. ఇది అజ్ఞానము మాయావాదులు, వారు భగవంతునితో ఒకటి అయ్యాము అని వారు భావిస్తారు. అది విద్య కాదు