TE/Prabhupada 0222 - ఈ ఉద్యమమును ముందుకు తీసుకు వెళ్ళే ప్రయత్నమును విడిచి పెట్టవద్దు



His Divine Grace Srila Bhaktisiddhanta Sarasvati Gosvami Prabhupada's Disappearance Day, Lecture -- Los Angeles, December 9, 1968


కాబట్టి ఇది ఒక మంచి ఉద్యమం. Ahaṁ tvaṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi mā śucaḥ ( BG 18.66) భగవద్గీత ఇలా చెబుతున్నది, ప్రజల బాధలు వారి పాపముల వలన వస్తాయి అజ్ఞానం. అజ్ఞానం అనేది పాపములు చేయడానికి కారణం. ఉదాహరణకు ఒక మనిషికి తెలియదు. ఉదాహరణకు నా లాంటి విదేశీయుడు అమెరికాకు వస్తాడు ఆయనకు తెలియదు... ఎందుకంటే భారతదేశంలో... మీ దేశంలో వలె, కారు కుడివైపు నుండి నడపబడుతుంది, భారతదేశంలో, నేను లండన్లో కూడా చూశాను, కారు ఎడమవైపు నుండి నడపబడుతుంది. ఉదాహరణకు ఆయనకు తెలియదు అనుకుందాం, ఆయన ఎడమ వైపున కారు డ్రైవింగ్ చేసి ఏదైనా ప్రమాదము చేశాడు అని అనుకుందాము ఆయనను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన ఇలాగా చెప్తే, "అయ్యా, నాకు ఇక్కడ కారు కుడి వైపున నడపబడుతుందని తెలియదు," అది ఆయనని క్షమించడానికి సహాయము చేయదు. చట్టం ఆయనని శిక్షిస్తుంది. కాబట్టి అజ్ఞానం చట్టం విచ్ఛిన్నం చేయడానికి లేదా పాపములు చేయడానికి కారణం. మీరు ఏదైనా పాపము చేసిన వెంటనే, మీరు ఫలితాన్ని అనుభవించాలి. కాబట్టి ప్రపంచం మొత్తం అజ్ఞానంతో ఉంది, అజ్ఞానం కారణంగా ఆయన చాలా క్రియ మరియు ప్రతిక్రియల యొక్క, అది మంచిది లేదా చెడ్డది అవ్వవచ్చు, క్లిష్టమైన దానిలో నిమగ్నమైనాడు ఈ భౌతిక ప్రపంచం లోపల మంచిది ఏదీ లేదు; ప్రతిదీ చెడ్డదే. కాబట్టి మనం కొంత మంచిది మరియు కొంత చెడ్డది తయారు చేశాము. ఇక్కడ... భగవద్ గీతలో మనము ఈ ధామము duḥkhālayam aśāśvatam ( BG 8.15) అని అర్థము చేసుకున్నాము. ఈ ప్రదేశం దుర్భరమైనది. కాబట్టి ఎలా చెప్పగలరు, దుర్భరమైన స్థితిలో మీరు ఎలా చెప్పగలరు, అది "ఇది మంచిది" లేదా "ఇది చెడ్డది" అని. అంతా చెడ్డది. కాబట్టి ఏ వ్యక్తులకు - భౌతిక, బద్ధ జీవితం గురించి తెలియదో - వారు ఏదో ఉత్పత్తి చేస్తారు ఇది మంచిది, ఇది చెడ్డది, ఎందుకనగా వారికి తెలియదు ఇక్కడ ప్రతిదీ చెడ్డది అని, ఏది మంచిది కాదు. ఈ భౌతిక ప్రపంచం గురించి ప్రతిఒక్కరు చాలా నిరాశాజనకంగా ఉండాలి. ఆ తర్వాత అతడు ఆధ్యాత్మిక జీవితంలో ముందడుగు వేయవచ్చు. Duḥkhālayam aśāśvatam ( BG 8.15) ఈ ప్రదేశం దుఃఖంతో నిండి ఉంది, మీరు విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేస్తే, మీరు కేవలం దుర్భర పరిస్థితిని చూస్తారు. అందువల్ల మొత్తం సమస్య ఏమిటంటే మన భౌతిక బద్ధ జీవితాన్ని మనం విడిచిపెట్టాలి, కృష్ణ చైతన్యము లో మనల్ని మనము ఆధ్యాత్మిక స్థితికి మనము ఎదగడానికి ప్రయత్నించాలి తద్వారా భగవంతుని రాజ్యానికి ఉద్దరించబడాలి, yad gatvā na nivartante tad dhāmaṁ paramaṁ mama ( BG 15.6) ఎక్కడికి వెళుతున్నారో, ఎవరు ఈ బాధాకరమైన ప్రపంచానికి తిరిగి వస్తారు. అది భగవంతుని యొక్క మహోన్నతమైన నివాసం.

అందువల్ల ఇవి భగవద్గీతలో వివరణ కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రామాణికం, చాలా ముఖ్యమైనది. ఇప్పుడు, మీరు ఈ ఉద్యమాన్ని తీసుకున్న అమెరికన్ అబ్బాయిలు బాలికలు,దయచేసి దీనిని మరింత తీవ్రంగా తీసుకోండి ... ఇది చైతన్య మహాప్రభు మరియు నా గురు మహారాజ యొక్క లక్ష్యం, మనము కూడా ఈ సంకల్పమును గురు శిష్య పరంపర ద్వారా అమలు చేయటానికి ప్రయత్నిస్తున్నాము. నాకు సహాయం చేయడానికి మీరు ముందుకు వచ్చారు. నేను మీ అందరకి అభ్యర్ధన చేస్తున్నాను నేను వెళ్లిపోతాను, మీరు నివసిస్తారు ఈ ఉద్యమమును ముందుకు తీసుకు వెళ్ళే ప్రయత్నమును విడిచి పెట్టవద్దు, మీరు చైతన్య మహాప్రభువుచే ఆశీర్వదించబడతారు మరియు పూజ్యులు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారిచే. చాలా ధన్యవాదాలు.