TE/Prabhupada 0224 - మీ పెద్ద భవనాన్ని నిర్మిస్తున్నారు,ఒక లోపభూయిష్ట పునాది మీద



Arrival Address -- Mauritius, October 1, 1975


తత్వము అనేది మానసిక కల్పన కాదు. వేదాంతం అనేది ప్రధాన విజ్ఞాన శాస్త్రము ఇతర విజ్ఞాన శాస్త్రములు అన్నీ దీని నుండి తీసుకురాబడినవి. అది తత్వము. కాబట్టి మన కృష్ణ చైతన్య ఉద్యమం ప్రజలకు భోదించడానికి ప్రయత్నిస్తుంది విజ్ఞాన శాస్త్రములలో ఈ విజ్ఞానము గురించి మొదట అర్థం చేసుకోవటానికి "మీరు ఏమిటి? మీరు ఈ శరీరమా లేదా ఈ శరీరం నుండి భిన్నంగా ఉన్నారా? "ఇది చాలా అవసరం. మీరు మీ పెద్ద భవనాన్ని నిర్మిస్తున్నట్లయితే, ఒక లోపభూయిష్ట పునాది మీద, అప్పుడు అది నిలబడి ఉండదు. ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆధునిక నాగరికత ఈ లోపభూయిష్ట ఆలోచనపై ఆధారపడి ఉంది, "నేను ఈ శరీరమును." నేను ఇండియన్, "నేను అమెరికన్," "నేను హిందూ," "నేను ముస్లిం," "నేను క్రైస్తవుడిని". ఇవి అన్నీ జీవితం యొక్క శారీరక భావనలు. నేను ఒక క్రైస్తవ తండ్రి మరియు తల్లి నుండి ఈ శరీరాన్ని కలిగి వున్నాను కాబట్టి, నేను ఒక క్రైస్తవుడను. కానీ నేను ఈ శరీరం కాదు. నేను హిందూ తండ్రి మరియు తల్లి నుండి ఈ శరీరాన్ని కలిగి వున్నాను, అందుచే నేను హిందువును. కానీ నేను ఈ శరీరం కాదు. కావున ఆధ్యాత్మిక అవగాహన కోసం, ఇది అర్థం చేసుకోవడానికి ప్రాథమిక సూత్రం, నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మను, అహం బ్రహ్మాస్మి. ఇది వేదముల సూచన: "మీరు ఆత్మ అని అర్థం చేసుకోండి, మీరు ఈ శరీరము కాదు." కేవలము దీనిని అర్థం చేసుకోవడానికి యోగ పద్ధతి సాధన చేయబడుతుంది. Yoga indriya saṁyamaḥ. ఇంద్రియాలను నియంత్రించడం ద్వారా, ముఖ్యంగా మనస్సును... మనస్సు ఇంద్రియాల యజమాని లేదా గురువు. Manaḥ-ṣaṣṭhānīndriyāṇi prakṛti-sthāni karṣati ( BG 15.7) ఈ మనస్సు మరియు ఇంద్రియాలతో మనుగడ కోసం పోరాడుతున్నాం, ఆత్మను ఈ శరీరముగా గుర్తించే తప్పుడు భావనలో. మనము మన మనసును కేంద్రికరించినట్లతే ఇంద్రియాలను నియంత్రించటం ద్వారా, అప్పుడు మనము క్రమంగా అర్థం చేసుకోవచ్చు. Dhyānāvasthita-tad-gatena manasā paśyanti yaṁ yoginaḥ ( SB 12.13.1) యోగులు, వారు మహోన్నతమైన వ్యక్తి, విష్ణువుపై ధ్యానం చేస్తారు, ఆ పద్ధతి ద్వారా వారు ఆత్మను అర్థము చేసుకుంటారు. ఆత్మ-సాక్షాత్కారము మానవ జీవితం యొక్క ప్రధాన అంశం. కాబట్టి ఆత్మ-సాక్షాత్కార ప్రారంభం అనేది "నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మ." అహం బ్రహ్మాస్మి అని అర్థము చేసుకోవడము

అందువల్ల ఈ విషయాలు భగవద్గీతలో బాగా వివరించబడ్డాయి. సరైన మార్గదర్శకంలో, భగవద్గీతను జాగ్రత్తగా చదివితే అప్పుడు ప్రతీది స్పష్టముగా ఉంటుంది. ఎటువంటి కష్టము లేకుండా, "నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను. నా కర్తవ్యము ఈ శరీర భావన కంటే భిన్నంగా ఉంటుంది. ఈ శరీరాన్ని నన్నుగా స్వీకరించడము ద్వారా నాకు సంతోషము ఉండదు. ఇది జ్ఞానం యొక్క తప్పుడు పునాది. " ఈ విధముగా, మనము ప్రగతి సాధిస్తే, అప్పుడు మనము అర్థం చేసుకుంటాము, అహం బ్రహ్మాస్మి : "నేను ఆత్మను." అప్పుడు నేను ఎక్కడ నుండి వచ్చాను? అంతా భగవద్గీతలో వివరించబడింది, ఆత్మ గురించి, కృష్ణుడు ఇలా చెబుతున్నాడు, భగవంతుడు చెప్పారు, mamaivāṁśo jīva-bhūtaḥ: ( BG 15.7) ఈ జీవులు, వీరు నాలో భాగము మరియు అంశలు లేదా అతి సూక్ష్మమైన కణములు. పెద్ద అగ్ని మరియు చిన్న అగ్ని వలె, అవి రెండు అగ్నులు కానీ పెద్ద అగ్ని మరియు చిన్న అగ్ని... ఇప్పటి వరకూ అగ్ని లక్షణమును తీసుకుంటే, భగవంతుడు మరియు మనం ఒకటే. కాబట్టి మనం అర్థం చేసుకోగలము, మనము మనల్ని అధ్యయనము చేయడము ద్వారా భగవంతుణ్ణి అధ్యయనము చేయగలము. ఇది కూడా మరొక ధ్యానం. కానీ మనము దానిని అర్థం చేసుకున్నప్పుడు అది పరిపూర్ణంగా ఉంటుంది గుణాత్మకంగా అయినప్పటికీ నేను భగవంతుని యొక్క నమూనా లేదా అదే లక్షణములతో ఉన్నాను, అయినప్పటికీ, ఆయన గొప్పవాడు, నేను చిన్నవాడిని. " అది ఖచ్చితమైన అవగాహన. Anu, vibhu; Brahman, Para-brahman; īśvara, parameśvara - ఇది పరిపూర్ణ అవగాహన. నేను గుణాత్మకంగా ఒకే రకముగా ఉన్నందున, నేను మహోన్నతమైన వాడిని అని అర్థం కాదు. వేదాలలో ఇది చెప్పబడింది, nityo nityānā cetanaś cetanānā (Kaṭha Upaniṣad 2.2.13). మనము నిత్య, శాశ్వతమైన వారము; భగవంతుడు కూడా శాశ్వతమైనవాడు. మనము జీవులము; భగవంతుడు కూడా జీవి. కానీ ఆయన జీవులలో ప్రధానమైన వారు. ఆయన శాశ్వతమైన వారిలో ప్రధానమైన వారు. మనము కూడా శాశ్వతమైన వారము, కానీ మనము ప్రధానమైన వారిమి కాదు. ఎందుకు? Eko yo bahūnāṁ vidadhāti kāmān. ఉదాహరణకు మనకు నాయకుడు కావాలి అదేవిధముగా ఆయన మహోన్నతమైన నాయకుడు. ఆయన సంరక్షకుడు. ఆయన భగవంతుడు ఆయన ప్రతి ఒక్కరి అవసరాలను అందజేస్తున్నాడు. ఆఫ్రికాలో ఏనుగులు ఉన్నాయని మనము చూడవచ్చు. వాటికి ఆహారాన్ని ఎవరు అందిస్తున్నారు ? మీ గది రంధ్రం లోపల లక్షల చీమలు ఉన్నాయి. వాటికి ఎవరు ఆహారమును ఇస్తున్నారు? Eko yo bahūnāṁ vidadhāti kaman. ఈ విధముగా, మనకు మనము అర్థము చేసుకున్నట్లయితే, అది ఆత్మ-సాక్షాత్కారము.