TE/Prabhupada 0223 - మొత్తం మానవ సమాజానికి భోదించడానికి ఈ సంస్థ తప్పనిసరిగా ఉండవలసి వుంటుంది



Room Conversation with Ratan Singh Rajda M.P. "Nationalism and Cheating" -- April 15, 1977, Bombay


ప్రభుపాద: అభ్యంతరం ఏమిటి? మిస్టర్ రాజదా: ఎటువంటి అభ్యంతరమూ ఉండకూడదు.

ప్రభుపాద: భగవద్గీత అంగీకరించబడింది, నేను అర్థం చేసుకున్నంత వరకు నేను మోరార్జీని అరెస్టు చేయబోతున్నప్పుడు, ఆయన "నన్ను నా భగవద్గీత చదవడమును పూర్తి చేయనివ్వండి" అని చెప్పారు. నేను దినపత్రికలో చదివాను.

మిస్టర్ రాజదా: అవును, ఆయన అన్నాడు. ప్రభుపాద: అందువల్ల అతడు భగవద్గీత భక్తుడు, అనేక మంది ఉన్నారు. ఎందుకు ఈ ఉపదేశమును మొత్తం ప్రపంచానికి ఇవ్వకూడదు?

మిస్టర్ రాజదా: ఇప్పుడు, నేను చూశాను, సాధారణంగా ఆయన 3.30 గంటలకు నిద్ర లేస్తారు, మొదట తన మతపరమైన ఆచారములను ఆచరిస్తారు, భగవద్గీత చదవటము మరియు ఇవన్నీ. అది రెండు, మూడు గంటలు కొనసాగుతుంది. అప్పుడు, ఏడు గంటలకు, ఆయన స్నానం చేసిన తరువాత తన గది నుండి బయటకు వస్తాడు. అప్పుడు ఆయన కలుస్తాడు (అస్పష్టంగా ఉంది).

ప్రభుపాద: ఈ విదేశీ బాలురు, వారు ప్రారంభిస్తారు ఈ భగవద్గీత అభ్యాసం 3.30 నుండి 9.30 వరకు. వారికి ఏ ఇతర కర్తవ్యము లేదు. మీరు చూడండి. మీరు మన ఈ గిరిరాజాను చూసారా. మొత్తం రోజంతా ఆయన చేస్తున్నాడు. వారు అందరూ చేస్తున్నారు. ఉదయం నుండి, 3.30, వారు అలసిపోయే వరకు, 9.30, కేవలం భగవద్గీత.

మిస్టర్ రాజదా: అద్భుతము. ప్రభుపాద: మా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. మనము ఈ ఒక వరుస గురించి చర్చించినట్లయితే, tathā dehāntara-prāptiḥ ( BG 2.13) అర్థం చేసుకోవడానికి రోజులు పడుతుంది.

మిస్టర్ రాజదా : నిశ్యబ్ధము.

ప్రభుపాద: ఇప్పుడు ఇది నిజమైతే, tathā dehāntara-prāptiḥ and na hanyate hanyamāne śarīre ( BG 2.20) మనం ఏమి చేస్తున్నాం దాని కొరకు? ఇది భగవద్గీత. Na jāyate na mriyate vā kadācin na hanyate hanyamāne śarīre ( BG 2.20) నా శరీరం నాశనం అయినప్పుడు, నేను వెళ్తున్నాను... (విరామం) ... వ్యక్తిగతంగా ప్రతి ఇంటికి వెళ్లి, పుస్తకాలను అమ్ముతూ డబ్బును పంపిస్తున్నాను. మనము ఈ విధముగా మన ఉద్యమమును ముందుకు తీసుకు వెళ్ళుతున్నాము. ప్రజల నుండి, లేదా ప్రభుత్వము నుండి నాకు ఎలాంటి సహాయం రావడము లేదు. అమెరికా బ్యాంక్ లో రికార్డు ఉంది, ఎంత విదేశీ మార్పిడి నేను తీసుకు వస్తున్నాను . ఈ బలహీనమైన ఆరోగ్యముతో కూడా, నేను, కనీసం నాలుగు గంటల పని చేస్తున్నాను, రాత్రి పూట వారు కూడా నాకు సహాయం చేస్తున్నారు. కాబట్టి ఇది మన వ్యక్తిగత ప్రయత్నం. ఎందుకు ఇక్కడ రాకూడదు? మీరు వాస్తవమునకు భగవద్గీత యొక్క చాలా తీవ్రమైన విద్యార్ధి అయితే, మీరు ఎందుకు రాకూడదు, ఎందుకు మీరు సహకరించ కూడదు? harāv abhaktasya kuto mahad-guṇā manorathenāsati dhāvato... ( SB 5.18.12) మీరు కేవలం చట్టం ద్వారా కేవలం ప్రజలను నిజాయితీగా చేయలేరు. అది సాధ్యం కాదు. దాన్ని మర్చిపొండి. అది సాధ్యం కాదు. Harāv abhaktasya kuto.... Yasyāsti bhaktir bhagavaty akiñcanā sarvaiḥ... మీరు ఒకవేళ భగవంతుని భక్తునిగా మారితే, అన్ని మంచి లక్షణాలు అక్కడ ఉంటాయి. And harāv abhaktasya kuto mahad... ఆయన ఒక భక్తుడు కాకపోతే... ఇప్పుడు చాలా విషయాలు, ఖండిస్తున్నారు, గొప్ప, గొప్ప నాయకులు. నేటి దినపత్రిక నేను చూశాను. "ఈ మనిషి, ఆ మనిషిని కూడా తిరస్కరించారు." ఎందుకు? Harāv abhaktasya kuto. ఆయన ఒక భక్తుడు కాకపోతే ఒక గొప్ప నాయకునిగా ఉండటం వల్ల ప్రయోజనము ఏమిటి? (హిందీ) మీరు చాలా తెలివైన వారు, యువకులు, నేను మీకు కొంత ఆలోచన ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను, మీరు ఈ ఆలోచనలకు కొంత ఆకారం ఇవ్వగలిగితే ... ఇది ఇప్పటికే ఉంది. ఇది రహస్యం కాదు. కేవలము మనము తీవ్రముగా ఉంటే మొత్తం మానవ సమాజానికి భోదించడానికి ఈ సంస్థ తప్పనిసరిగా ఉండవలసి వుంటుంది. ఎన్నడూ పట్టించుకోకండి, అతి తక్కువ సంఖ్య అయినా. ఇది పట్టింపు లేదు. కానీ ఆదర్శము తప్పకుండా ఉండాలి