TE/Prabhupada 0227 - నేను ఎందుకు చావాలి. నాకు చావటము ఇష్టము లేదు



Lecture -- Los Angeles, May 18, 1972

కృష్ణ చైతన్యమున్ని అర్థం చేసుకోవడం కొంచము కష్టం. వాస్తవమునకు, దేవుడుని అర్థం చేసుకోనే విషయము చాలా కష్టం. కానీ భగవద్గీతలో దేవుడు తనకు తాను వివరిస్తున్నాడు. నేను ఈ విధంగా ఉన్నాను, నేను ఈ విధంగా ఉన్నాను, ఈ భౌతిక ప్రకృతి ఇలా ఉంటుంది, ఈ ఆధ్యాత్మిక ప్రకృతి ఈ విధంగా ఉంటుంది, జీవులు ఈ విధముగా ఉంటారు ... ప్రతిదీ పూర్తిగా భగవద్గీతలో వర్ణించబడింది. దేవుడు స్వయంగా, తన సొంత జ్ఞానం ఇస్తున్నాడు, ఇది ఒక్కటే దేవుడిని అర్థం చేసుకొనే పద్ధతి. లేకపోతే, కల్పన ద్వారా మనము దేవుణ్ణి అర్థం చేసుకోలేము. ఇది సాధ్యం కాదు. అయిన అపరిమితమైనవాడు మనము పరిమితం. మన జ్ఞానం, మన ఆలోచన, ప్రతిదీ చాలా పరిమితముగా ఉన్నది. ఎలా మనము అపరిమితమును అర్థం చేసుకోవచ్చు? కానీ మనము అపరిమితము చెప్పినది అంగీకరించాలి. అయిన ఇలాగా , ఆలాగా , అప్పుడు మనము అర్థం చేసుకోవచ్చు. అది పరిపూర్ణ జ్ఞానం. దేవుడు గురిoచిన కల్పన పరిజ్ఞానమునకు విలువలేదు. వాస్తవ జ్ఞానం, లాగానే ... నేను ఈ ఉదాహరణను ఇస్తాను. ఒక పిల్లవాడు అయిన తండ్రి ఎవరో తెలుసుకోవాలని పుత్రుడు కోరుకుంటే, సరళమైన విషయము తల్లిని అడుగుట. లేదా తల్లి చెప్పుతుంది, "ఇతడు మీ తండ్రి." ఇది పరిపూర్ణ జ్ఞానము. మీరు కల్పన చేస్తే, "నా తండ్రి ఎవరు?" మొత్తం పట్టణాన్ని అడగండి "నీవు నా తండ్రివా? నీవు నా తండ్రివా? నీవు నా తండ్రివా?" జ్ఞానం ఎల్లప్పుడూ అపరిపూర్ణంగా ఉంటుంది. తన తండ్రి ఎవరో అయిన ఎన్నడూ కనుగోనలేడు. కానీ ఈ సరళమైన పద్ధతి, అయిన తన తండ్రి ఎవరు అనే జ్ఞానం తీసుకోవటానికి, ప్రామాణికం, తల్లి, నా ప్రియమైన పుత్రుడా ఇతడు మీ తండ్రి, అప్పుడు మీ జ్ఞానం ఖచ్చితంగా ఉంటుoది.


అదేవిధంగా, ఆధ్యాత్మిక జ్ఞానం ... ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఉందని నేను మాట్లాడుతున్నాను. ఇది మన ఊహాగానాల విషయాన్ని కాదు. కానీ దేవుడు చెప్పినప్పుడు, "అవును, ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఉంది, ఇది నా ప్రధాన కార్యాలయం," అది సరైనది. అవును. అందుచేత కృష్ణుడిని నుండి మనకు జ్ఞానం లభిస్తుంది. ఉత్తమమైన ప్రామాణికము . అందువలనమనజ్ఞానం ఖచ్చితమైనది. మనము పరిపూర్ణము కాదు, కానీ మన జ్ఞానం పరిపూర్ణము. ఎందుకంటే పరిపూర్ణము నుండి మనకు జ్ఞానం లభిస్తుంది. ఆదే ఉదాహరణ, నా తండ్రి ఎవరు అర్థం చేసుకోవడానికి నేను సంపూర్ణంగా లేను, కానీ నా తల్లి సంపూర్ణంగా ఉంది, నేను నా తల్లి పరిపూర్ణ జ్ఞానమును నేను అంగీకరిస్తాను , అందువలన నాతండ్రి ఎవరు అనే జ్ఞానం ఖచ్చితంగా ఉంది. మానవ సమాజానికి పరిపూర్ణ జ్ఞానాన్ని ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ఇస్తూoది అయిన ఏమిటి, దేవుడు ఏమిటి, ఈ భౌతిక ప్రపంచం ఏమిటి, మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు, ఎందుకు మీరు చాలా భాదాకరమైన దుఖమైన, జీవితాన్ని అనుభవించాలి, ఎందుకు నేను చనిపోవాలి. నాకు చనిపోవటము ఇష్టం లేదు, కానీ మరణం తప్పనిసరి. నాకు ముసలివాడు కావాలని లేదు, కానీ ఇప్పటికీ, ఇది తప్పనిసరి. నాకు వ్యాధి బారిన పడటం ఇష్టము లేదు, కానీ అది తప్పనిసరి. ఇవి పరిష్కారించాలి. ఇవి వాస్తవానికి మానవ జీవితం యొక్క సమస్యలు.


తినడం, నిద్రపోవటం, సంభోగము చేయడము, రక్షించుకోవటము పద్ధతిని మెరుగుపరచడం కాదు. ఇది మానవ జీవితం కాదు. ఒక కుక్క నిద్రిస్తుంది మనిషి నిద్రిస్తాడు. మనిషి చాలా మంచి అపార్ట్మెంట్లో నిద్రిస్తున్నందున, అయిన కుక్క కంటే మరింత ఆధునికమైన వాడు కాదు. పని నిద్రపోవడము. అంతే. మనిషి రక్షించుకోవటము కోసం అణు ఆయుధం కనుగోన్నాడు , కుక్క తన గోర్లు పళ్ళు కలిగి ... అది కూడా రక్షించుకోగలదు. రక్షించుకోవటము ఉంది. నేను ఈ అణు బాంబును కలిగి వున్నాను , నేను మొత్తం ప్రపంచాన్ని లేదా మొత్తం విశ్వాన్ని జయించగలను అని మీరు చెప్పలేరు. అది సాధ్యం కాదు. మీరు మీ స్వంత మార్గంలో రక్షించుకోవచ్చు కుక్క కూడా తన సొంత మార్గంలో రక్షించుకోగలదు. ఒక అందమైన పద్ధతి ద్వార రక్షించుకోవటము , ఒక అందమైన పద్ధతి ద్వార తినడం ఒక అందమైన పద్ధతి ద్వార నిద్ర పోవడము , ఒక అందమైన పద్ధతి ద్వార సెక్స్ జీవితం కలిగి ఉండడము ఒక దేశం లేదా ఒక వ్యక్తిని ఉన్నత స్థానమునకు తీసుకు పోలేదు. అది పురోగతి కాదు. అదే విషయము. ఒకే విధముగా, ఐదు మీద రెండు వేలు, లేదా , అయిదు వందల మీద రెండు వేలు, ఐదు మీద ఇరవై , దానిని నిష్పత్తి అంటారు. అందువలన, మెరుగు పట్టిన విధంగా, శాస్త్రీయ విధంగా, జంతు లక్షణాలు, మానవ సమాజం ఉన్నత స్థానమున ఉన్నది అని కాదు. అది మెరుగుపెట్టిన జంతువు అని పిలువబడుతుంది. అంతే. వాస్తవమైన అభివృద్ధి దేవుడు గురిoచి తెలుసుకోవడమే. అది పురోగతి.