TE/Prabhupada 0239 - కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి, వ్యక్తులు ప్రత్యేక ఇంద్రియాలను కలిగి ఉండాలి
Lecture on BG 2.3 -- London, August 4, 1973
ఈ సానుభూతి అర్జునుడి సానుభూతిలా ఉంది. సానుభూతి, ఇప్పుడు ప్రభుత్వము హంతకుడుని చంప కూడదు అని సానుభూతితో ఉంది. ఇది అర్జునుడు. ఇది హృదయ-దౌర్బల్యము. ఇది విధి కాదు. ప్రతి ఒక్కరు తన పై అధికారి తనకు నిర్దేశించిన బాధ్యతను చాలా కఠినంగా, ఎలాంటి పరిశీలన లేకుండా నిర్వర్తించాలి. ఇవి హృదయము యొక్క బలహీనతలు, ఈ రకమైన సానుభూతి. కానీ సాధారణ వ్యక్తికి అర్థం కాదు. అందుచేత కృష్ణుడిని అర్ధం చేసుకోవడానికి, వ్యక్తులకు ప్రత్యేక ఇంద్రియాలను, ప్రత్యేక ఇంద్రియాలను కలిగి ఉండాలి సాధారణ ఇంద్రియాలను ఉపయోగపడవు ప్రత్యేక ఇంద్రియాలు మీరు మీ కళ్ళు ధైర్యంగా తీసివేసి మీరు మరొక కళ్ళను పెట్టుకోవాలా? కాదు మీరు పవిత్రము అవ్వాలి.Tat-paratvena nirmalam ( CC Madhya 19.170) మీర కళ్ళకు ఏదైనా వ్యాధి వస్తే, మీరు ఔషధం తీసుకుంటారు, వ్యాధి తగ్గిపోయినప్పుడు, మీరు స్పష్టంగా ప్రతిదీ చూడగలరు; అదేవిధంగా, ఈ మొద్దుబారిన ఇంద్రియాలతో, మనము కృష్ణుడిని అర్థం చేసుకోలేము. Sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ (Brs. 1.2.234). శ్రీ కృష్ణుడి నామాలు, కృష్ణుడి పేరు, రూపం, లక్షణము మొదలైనవి, ఈ మొద్దుబారిన ఇంద్రియాలతో అర్థం చేసుకోలేము, మరి ఏమి చేయాలి? ఇప్పుడు,sevonmukhe hi jihvādau. మళ్ళీ jihvādau, నాలుక నుండి మొదలు పెట్టి, నాలుకను నియంత్రిoచుకుంటే చూడండి, ఇది విచిత్రమైన విషయము, "నీవు నాలుకను నియంత్రించటం ద్వారా కృష్ణుడుని అర్థం చేసుకుంటవా?" ఇది అద్భుతమైన విషయము. ఎలా ఉంది? కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి నా నాలుకను నియంత్రించవలసి ఉందా? కానీ ఇది, శాస్త్రము యొక్క సూచన: sevonmukhe hi jihvādau. జిహ్వ అంటే నాలుక. కృష్ణుడిని అర్ధం చేసుకోవడానికి, కృష్ణుడిని చూడడానికి, మొదటి సేవ నీ నాలుకను నియంత్రిoచుకోవటము మేము మాంసం తీసుకోవద్దు, మద్యం తీసుకోవద్దు అని చెప్పుతాము ఎందుకంటే ఇది నాలుకను నియంత్రిoచుకోవటము. నాలుక ఇంద్రియాలలో అతి శక్తీవంతమైన శత్రువు, తప్పుదారి పట్టించే ఇంద్రియము వారు ఈ దుష్టులు చెప్తారు, "లేదు, మీరు ఇష్టపడేది ఏదైనా తినవచ్చు, మీ మతముతో సంబంధము ఏమీ లేదు." కానీ వేద శాస్త్రములు ఇలా చెప్పుతాయి, "నీవు దుష్టుడివి, మొదట నీ నాలుకను నియంత్రిoచు, తరువాత నీవు దేవుడుని అర్థం చేసుకోగలవు."
ఇది వేదముల ఉత్తర్వు. పరిపూర్ణమైనది. మీరు మీ నాలుకను నియంత్రిస్తే, మీరు మీ కడుపుని నియంత్రిస్తారు, అప్పుడు మీరు మీ జననేంద్రియాలను నియంత్రిస్తారు. రుప గోస్వామి ఉపదేశమును ఇస్తున్నారు
- vāco-vegaṁ manaso krodha-vegam
- jihvāvegam udaropastha-vegam
- etān vegān yo viṣaheta dhīraḥ
- sarvām apīmāṁ sa pṛthiviṁ sa śiṣyāt.
- ( NOI 1 )
ఇది ఉపదేశము, నాలుకను నియంత్రించగల సమర్థుడు ఎవరైనా, మనస్సు నియంత్రించగలవాడు, కోపం నియంత్రించుకోగలవాడు, కడుపును నియంత్రించుకోగలవాడు జననేంద్రియములను నియంత్రించుకోగలవాడు - ఆరు రకాల నియంత్రణ ఉన్నట్లయితే, అతడు ఆధ్యాత్మిక గురువుగా మారడానికి అర్హుడు; అయిన ప్రపంచవ్యాప్తంగా శిష్యులను స్వికరించవచ్చు. మీ నాలుకను మీరు నియంత్రించలేకపోతే, మీ కోపాన్ని నియంత్రించుకోకపోతే, మీ మానసిక ఆలోచనలను నియంత్రిన్చుకోక పోతే మీరు ఆధ్యాత్మిక గురువు ఎలా అవ్వుతారు? అది సాధ్యం కాదు. Pṛthiviṁ sa śiṣyāt.. ఎవరైతేచేస్తారో ... అతడు గోస్వామి, గోస్వామి లేదా స్వామి అని ఇంద్రియాల నియంత్రికుడు ఈ ఆరు రకాలను నియంత్రింకుడు గురువు. ప్రారంభంలో జిహావా ఉంది. Sevonmukhe hi jihvādau svayam eva sphuraty adaḥ [Brs . 1.2.234]. సేవా. నాలుక భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటుంది. ఎలా? మీరు హారే కృష్ణ మంత్రమును జపము చేయండి, ఎల్లప్పుడూ కిర్తించండి. Vācāṁsi vaikuṇṭha-guṇānuvarṇane. Vācāṁsi, మాట్లాడటం రుచి చూడటము నాలుక సేవ నీవు కీర్తించడము ద్వారా భగవంతుని సేవలో నాలుకను వినియోగించు. ఎప్పుడైనా మీరు ప్రమాణము చేయండి "నేను మాట్లాడితే ఎప్పుడైనా మాట్లాడితే, కృష్ణుడిని కీర్తిస్తాను. అంతకు మించి మాట్లాడను ఇది నాలుక నియంత్రణ. మీరు మీ నాలుకను ఏదైనా అర్ధం లేనిదానిని మాట్లాడుటకు అనుమతించకపోతే grāmya-kathā... మనము కొన్నిసార్లు కలిసి కూర్చుoటాము. మనము చాలా అర్ధము లేనివి మాట్లాడుతాము. అది నియంత్రించాలి. ఇప్పుడు నేను భగవంతుని సేవలో నా నాలుకను వినియోగిస్తాను, అందుచేత మనం ఇంద్రియ తృప్తికి సంభంధించినవి మాట్లాడము. ఇది నాలుకను నియంత్రిస్తుంది. నేను కృష్ణుడికి అర్పించకుండా వున్నది ఏమీ తినను. ఇది నాలుకను నియంత్రిస్తుంది. ఇవి చిన్న పద్ధతులు, కానీ దీనికి గొప్ప గొప్ప విలువ వున్నది అందుచేత కృష్ణుడు మీ తప్పస్సు వలన సంతృప్తి చెందితే, అయిన తెలియజేస్తాడు. మీరు అర్థం చేసుకోలేరు. మీరు కృష్ణుడిని చూడలేరు. మీరు కృష్ణుడిని ఆజ్ఞాపించలేరు, "కృష్ణ, దయచేసి వచ్చి, వేణువుతో నృత్యం చేయి నేను నిన్ను చూస్తాను." ఇది ఆజ్ఞ. కృష్ణుడు మీ ఆజ్ఞకు లోబడి లేడు. అందువల్ల చైతన్య మహాప్రభు మనకు ఉపదేశమును ఇచ్చారు, aśliṣya vā pāda-ratāṁ pinastu māṁ marma-hatāṁ karotu vā adarśanam ( CC Antya 20.47)