TE/Prabhupada 0240 - గోపికలు చేసిన ఆరాధన కంటే ఉన్నతమైన ఆరాధన ఇంకొకటి లేదు
Lecture on BG 2.3 -- London, August 4, 1973
Adarśanam. అందరూ కృష్ణుడిని చూడాలనుకుంటున్నారు, కానీ పవిత్రమైన భక్తుడు ఇలా చెప్పాడు "లేదు, కృష్ణుడు నన్ను చూడకూడదనుకుంటే, అది సరియైనదే. కృష్ణుడు నా హృదయాన్ని బాధ పెట్ట వచ్చు. నేను కృష్ణుడు రావడము కోసము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాను. కానీ కృష్ణుడు రారు, నా హృదయాన్ని బాధపెడతారు, అది కూడా అంగీకరిస్తాను. అయినా, నేను నిన్ను పూజిస్తాను. " ఇది పవిత్రమైన భక్తి. కాదు, "నా ముందు నృత్యము చేయటానికి కృష్ణుడిని నేను అడిగాను, అయిన రాలేదు, నేను ఈ అర్ధంలేనిది వదిలేస్తాను కృష్ణ చైతన్యమునకు విలువ లేదు. "అలా కాదు. ఇది రాధారాణి వైఖరి. కృష్ణుడు వృందావనాన్ని విడిచిపెట్టాడు. గోపీకలు అందరు, వారు వారి రోజులు కేవలం కృష్ణుడి కోసం ఏడుస్తూ గడిపినారు, కానీ ఎప్పుడూ కృష్ణుడిని ఖండించలేదు ఎవరైనా వచ్చినప్పుడల్లా ... కృష్ణుడు వారిని గురించి ఆలోచిస్తాడు ఎందుకంటే గోపీకలు గొప్ప భక్తులు, అతి పెద్ద భక్తులు. గోపీకల భక్తితో పోలిక లేదు. అందుచేత కృష్ణుడు వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉన్నాడు కృష్ణుడు గోపీకలకు ఇలా చెప్పాడు, "మీరు మీ స్వంత సేవతో సంతృప్తి చెందoడి. మీ ప్రేమకి నేను నీకు తిరిగి ఏమి ఇవ్వలేను. " కృష్ణుడు, మహోన్నతమైన, సర్వశక్తిమంతుడు, అయిన గోపీకల రుణాలు చెల్లించలేడు. గోపీకలు ... చైతన్య మహాప్రభు, అన్నారు.ramyā kācid upāsanā vraja-vadhu-vargeṇa yā kalpitā. గోపీకలు చేసిన ఆరాధన కంటే ఉన్నతమైన ఆరాధన ఇంకొకటి లేదు. గోపీకలు అత్యున్నతమైన భక్తులు. గోపీకల అందరికంటే, శ్రీమతి రాధారాణి అగ్ర స్థానములో ఉంది. అందువలన శ్రీమతీ రాధారాణి కృష్ణుడి కంటే ఉన్నతమైనది.
ఇది Gauḍīya-Vaiṣṇava తత్వము. దినిని అర్ధము చేసుకోవటానికి సమయం పడుతుంది. కృష్ణుడి లీలలాను చూస్తున్నట్లయితే, దుష్టులు వారు కేవలము చూస్తారు కృష్ణుడు అర్జునుడిని పోరాడటానికి ప్రోత్సహిస్తాడు; అందువలన కృష్ణుడు అనైతికమైనవాడు, దీని అర్ధము తప్పుడు దృష్టి మీరు ప్రత్యేక కన్నులతో కృష్ణుడిని చూడాలి. అందువల్ల కృష్ణుడు భగవద్గీతలో చెప్పుతాడు, janma karma me divyaṁ ca. Divyam ( BG 4.9) కృష్ణుడి యొక్క ఈ ఆద్యాత్మిక లీలలు, ఎవరైనా అర్థం చేసుకుంటే, ఎవరైనా అర్ధం చేసుకోగలిగినట్లయితే, వెంటనే అయిన విముక్తి పొందుతాడు. ముక్తి. సాధారణ ముక్తి కాదు, కానీ భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటము, దేవుడు దగ్గరకు తిరిగి వెళ్ళటము. Tyaktvā dehaṁ punar janma naiti mām eti kaunteya ( BG 4.9) గొప్ప విముక్తి. వివిధ రకాల ముక్తులు ఉన్నాయి. Sāyujya sārūpya sārṣṭi sālokya sāyujya... ( CC Madhya 6.266) ఐదు రకాల ముక్తి ఉన్నాయి శ్యాయుజ్య అంటే బ్రహ్మణ్లో కలవటము, ఇది కూడా ముక్తి. మాయావాదులు లేదా జ్ఞాని సంప్రాదాయము, వారు బ్రాహ్మణ్ లో విలీనం అవ్వాలని కోరుకుంటున్నారు. అది కూడా ముక్తి. ఆది సాయుజ్య-ముక్తి అంటారు. కానీ ఒక భక్తుడికి, ఈ సాయుజ్య ముక్తి నరాకము లాంటిది. Kaivalyaṁ narakāyate. వైష్ణవుడికి, కైవల్యం, ... మోనిజం, భగవంతునిలోకి విలీనం అవ్వటము, నరాకముతో పోలి ఉంటుంది. Kaivalyaṁ narakāyate tri-daśa-pūr ākāśa-puṣpāyate (Caitanya-candrāmṛta 5). కర్మిలు ... జ్ఞానిలు బ్రాహ్మణ్ ప్రకాశములో విలీనం కావడంపై ఆత్రుతగా ఉoటారు, కర్మిలు, వారి అత్యధిక లక్ష్యం ఉన్నత లోకములకు ఎలా చేరుకోవాలి, స్వర్గ లోక, ఆక్కడ ఇంద్రుడు, మరియు బ్రహ్మా ఉంటారు ఇది కర్మిల యొక్క ఆశయం, స్వర్గానికి వెళ్ళటానికి. వారు అందరు ఇతర సాహిత్యంలో, వైష్ణవ తత్వములో తప్ప, అన్ని ఇతర గ్రంథాలలో, అంటే క్రిస్టియన్ మొహమ్మదియన్ , వారి లక్ష్యం స్వర్గమునకు వెళ్ళడము ఎలా అని