TE/Prabhupada 0245 - ప్రతి ఒక్కరూ తన ఇంద్రియాలను సంతృప్తిపరుచుకొనే ప్రయత్నం చేస్తున్నారు



Lecture on BG 2.9 -- London, August 15, 1973


కృష్ణుడు ఇంద్రియాల యొక్క యజమాని. ప్రపంచం మొత్తం ఇంద్రియ తృప్తి కోసం పోరాడుతోంది. ఇక్కడ సరళమైన తత్వము ఉన్నది, నిజం, అది మొదట ఆనందిoచనివ్వండి, కృష్ణుడిని ఆస్వాదించనివ్వండి. అయిన యజమాని. తరువాత మనము ఆనందిద్దాము. Tena tyaktena bhuñjīthā. కృష్ణుడికి ప్రతిది చెందుతుంది అని ఇశోపనిషద్ చెప్పుతుంది. Īśāvāsyam idaṁ sarvam: ( ISO 1) "అంతా కృష్ణుడికి చెందుతుంది." అంతా కృష్ణుడికి చెందుతుంది, కానీ మనము ఆలోచిస్తున్నాం, "అంతా మనకు చెందుతుంది." ఇది పొరపాటు ఇది భ్రమ. Ahaṁ mameti ( SB 5.5.8) Ahaṁ mameti. Janasya moho 'yam ahaṁ mameti. ఇది భ్రమ. అందరూ ఆలోచిస్తున్నారు, "నేను ఈ శరీరం, ప్రతిది మనము ఈ లోకములో ఉన్నదంతా, అది నేను ఆనందించాలి. " ఇది నాగరికత పొరపాటు. జ్ఞానం: "అంతా దేవుడికి చెందినది, అయిన నాకు దయాతో అనుమతిoచినదే నేను తీసుకుంటాను." Tena tyaktena bhuñjīthā. ఇది వైష్ణవ తత్వము కాదు; ఇది వాస్తవం. ఎవరూ యజమాని కాదు. Īśāvāsyam idaṁ sarvam. కృష్ణుడు చెప్పుతాడు ... "నేను ఆనందించే వాడిని, నేను యజమానిని." Sarva-loka-maheśvaram ( BG 5.29) Mahā-īśvaram. మహా అంటే గొప్పది. మనము īśvaram, నియంత్రికులము, కానీ కృష్ణుడు mahā-īśvaram గా వర్ణించబడ్డాడు "నియంత్రికుల యొక్క నియంత్రికుడు." ఇది కృష్ణుడు. ఎవరూ స్వతంత్రంగా నియంత్రికుడు కాదు.

కృష్ణుడిని హృషికేశగా వర్ణించారు. Hṛṣīkeṇa hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate ( CC Madhya 19.170) హృషిక ద్వారా హృషికేశుని సేవ చేయటాన్ని భక్తి అoటారు. హృషిక అంటే ఇంద్రియాలు. కృష్ణుడు ఇంద్రియాల యొక్క యజమాని, అందువల్ల, నేను ఏవైనా ఇంద్రియాలను కలిగివుంటే, యజమాని కృష్ణుడు. మన ఇంద్రియాలను ఇంద్రియాల యజమాని యొక్క సంతృప్తికి వినియోగించిన్నప్పుడు, అది భక్తి అవ్వుతుంది. ఇది భక్తి, భక్తియుక్త సేవ యొక్క నిర్వచనం. ఇంద్రియాలను ఇంద్రియ తృప్తి కోసం వినియోగించినప్పుడు , యజమాని కోసం కాదు అది కమా అని పిలువబడుతుంది . కామా మరియు ప్రేమ. ప్రేమ అంటే కృష్ణుడిని ప్రేమిoచడము కృష్ణుడి సంతృప్తి కోసం ప్రతిదీ చేయుట. అది ప్రేమ. కామా అంటే నా ఇంద్రియాలను సంతృప్తి పరచడానికి చేసేది అని అర్ధం. ఈ తేడా ఉంది. ఇంద్రియల ద్వార. మీరు గాని చేస్తే, మీ ఇంద్రియాలను సంతృప్తి పరచుకోండి, లేదా మీరు కృష్ణుడి ఇంద్రియాలను సంతృప్తి పరచండి. కానీ మీరు కృష్ణుడిని ఇంద్రియాలను సంతృప్తి చేసినప్పుడు, మీరు పరిపూర్ణత్వము పొందుతారు, మీరు మీ ఇంద్రియాలను సంతృప్తిపరిచినప్పుడు, మీరు అసంపూర్ణము, భ్రమించ బడతారు ఎందుకంటే మీరు మీ ఇంద్రియాలను సంతృప్తిపరుచుకోలేరు. ఆది కృష్ణుడు లేకుండా సాధ్యం కాదు. Hṛṣīkeṇa hṛṣīkeśa-sevanaṁ bhaktir ucyate ( CC Madhya 19.170)

అందువలన ప్రతిఒక్కరు ఇంద్రియాలను పవిత్రము చేయాలి. ప్రస్తుత సమయంలో, ప్రతి ఒక్కరూ తన ఇంద్రియాలను సంతృప్తిపరిచే ప్రయత్నం చేస్తున్నారు. Ahaṁ mameti. Janasya moho 'yam ( SB 5.5.8) Puṁsaḥ striyā maithunī-bhāvam etat. మొత్తం బౌతిక ప్రపంచం ... ఇద్దరు జీవులు, పురుషులు స్త్రీలు ఉన్నారు. మగవాడు తన ఇంద్రియాలను సంతృప్తి పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు, స్త్రీ తన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ పిలవబడే ప్రేమ అంటే ... ప్రేమ లేదు. ఇది కాదు ... ఎందుకంటే పురుషుడు స్త్రీ, ఎవరూ ఇతర పక్షము యొక్క ఇంద్రియాలను సంతృప్తి పరిచే ప్రయత్నము చేయరు. అందరూ తన ఇంద్రియాలను సంతృప్తి పరుచుకోనేదానికి ప్రయత్నము చేస్తున్నారు. ఒక మహిళ ఆమె ఇంద్రియాల సంతృప్తి కోసం ఒక పురుషుడిని ప్రేమిస్తుంది, పురుషుడు తన సంతృప్తి కోసం ఒక మహిళను ప్రేమిస్తాడు ... అందువల్ల, ఇంద్రియ తృప్తిలో కొంచెం భంగం ఏర్పడితే వెంటనే విడాకులు తీసుకుoటారు నాకు ఆది ఇష్టం లేదు. ఎందుకంటే ప్రధాన విషయము వ్యక్తిగత ఇంద్రియ తృప్తి. కానీ మనము మాయ చేయవచ్చు, ", నేను నిన్నుచాలా ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను." ప్రేమ లేదు. ఇది కామా, కామము. భౌతిక ప్రపంచంలో, ప్రేమకు అవకాశం లేదు. ఇది సాధ్యం కాదు. ప్రేమ అని చెప్ప బడేది మోసం, , మోసం మాత్రమే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మీరు అందమైన వారు కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది నా ఇంద్రియాలను సంతృప్తి పరుచుతుంది. నీవు చిన్నవాడైనందున అది నా ఇంద్రియాలను సంతృప్తి పరచుతుంది. " ఇది ప్రపంచం. బౌతిక ప్రపంచము అంటే ఇది Puṁsaḥ striyā maithunī-bhāvam etat. ఈ భౌతిక ప్రపంచం యొక్క ప్రాథమిక సూత్రం ఇంద్రియ తృప్తి. Yan maithunādi-gṛhamedhi-sukhaṁ hi tucchaṁ kaṇḍūyanena karayor iva duḥkha-duḥkham ( SB 7.9.45)