TE/Prabhupada 0264 - మాయ కూడా కృష్ణుడికి సేవ అందిస్తున్నది, కానీ కృతజ్ఞతలు లేదు



Lecture -- Seattle, September 27, 1968

తమలా కృష్ణ: మాయ పవిత్రమైన భక్తుడా? మాయా

ప్రభుపాద: స్వచ్చమైన భక్తులు, లేదు, అతను మాయలో లేడు.

తమలా కృష్ణ: కాదు కాదు. మాయా, మాయాదేవి, పవిత్రమైన భక్తుడా?

ప్రభుపాద: అవును, పరిపూర్ణ౦గా. పోలీసులు, వారు ప్రభుత్వము యొక్క నిజాయితీ గల సేవకులు కాదా? పోలీసు బలగాములుమిమల్ని ఇబ్బంది పెడుతుoడటామువలన వారిని ప్రభుత్వ సేవ నుండి తిరస్కరిస్తారా? వారి పని కృతజ్ఞత లేని పని, అంతే. అదేవిధంగా, మాయా కూడా కృష్ణుడికి సేవ అందిస్తున్నాది, కానీ కృతజ్ఞతలు లేదు. ఇది తేడా. దుష్టులను శిక్షించటానికి ఆమె కృతజ్ఞత లేని పనిని తీసుకుంది, అంతే. మాయా యధాతదముగా, ఆమె కృష్ణుడితో సంబంధం లేదని కాదు. వైష్ణవి. Caṇḍī అనే, పుస్తకంలో, మాయ "వైష్ణవి" అని చెప్పబడింది. మాయాను వైష్ణవిగా వర్ణిస్తారు. శుద్ధ భక్తుడిని వైష్ణవ అని పిలుస్తారు, ఆమె కూడా వైష్ణవ అని వర్ణించబడింది.

విష్ణుజన: మీరు చెప్పేది ప్రతిది చాలా సరళముగా అర్థం చేసుకోవడానికి మీరు ఎలా చేస్తారు?

ప్రభుపాద: మొత్తం తత్వము చాలా సరళంగా ఉన్నది దేవుడు గొప్పవాడు; మీరు గొప్ప వారు కాదు. నీవు దేవుడివి ఆని చెప్పుకోవద్దు. దేవుడు లేడని చెప్పకండి. దేవుడు ఉన్నాడు, అతను గొప్పవాడు, నీవు చిన్నవాడవు. మీ పరిస్థితి ఏమిటి? మీరు కృష్ణుడిని సేవించాలి. ఇది సరళమైన నిజం. తిరుగుబాటు వైఖరిని మాయ అని పిలుస్తారు. దేవుడే లేదు, దేవుడు చనిపోయాడు, నేను దేవుడను, నీవు దేవుడవు అని ప్రకటించే వారు ఎవరైనా వారు అoదరు మయ యొక్క ప్రభావములో ఉన్నారు.Piśācī pāile yena mati-cchanna haya. ఒక వ్యక్తి దెయ్యము చేత-పీడించబడినప్పుడు అయిన అన్ని రకాల అర్ధంలేనివి మాట్లాడతాడు. ఈ వ్యక్తులు అందరూ మాయ ద్వారా పీడించబడుతున్నారు, అందువలన వారు "దేవుడు చనిపోయాడు, నేను దేవుణ్ణి అని చెప్పుతున్నారు మీరు ఎందుకు దేవున్ని ప్రతి చోట శోధిస్తున్నారు? వీధిలో చాలా మంది దేవళ్ళు తీరుగుతు ఉన్నారు. " వారు అందరు దెయ్యము చేత పీడించ బడుతున్నారు, మతి భ్రమించిన వారు. అందువల్ల ఈ ఆద్యాత్మిక ప్రకంపనల ద్వార, హరే కృష్ణ మంత్రము ద్వారా మనము వారిని నయం చేయాలి. ఇది మాత్రమే. నయము చేసే పద్ధతి కేవలం వారిటిని శ్రవణము చేయనివ్వండి వారు క్రమంగా నయమఅవ్వుతారు. చాలా బాగా నిద్రిస్తున్న వ్యక్తి వలె, మీరు అయిన చెవి దగ్గర కేకలు వేస్తే అయిన నిద్ర లేస్తాడు నిద్రపోవుచున్న మానవ సమాజమును నీద్ర లేపటానికి ఇది మంత్రం. Uttiṣṭha uttiṣṭata jāgrata prāpya varān nibodhata. వేదాలు ఇలా చెబుతున్నాయి, "ఓ మానవ జాతి, దయచేసి నిద్ర లేవండి. ఇంకా నిద్ర పోవద్దు. మీరు ఈ అవకాశాన్ని మానవ శరీరమును పొందారు. దానిని ఉపయోగించుకొండి. మయ బారి నుండి బయటపడండి. " ఇది వేదాల ప్రకటన.ఘోషణ మీరు ఆ పని చేస్తున్నారు. హరే కృష్ణ, కీర్తన చేయండి హరే కృష్ణ అప్పుడు ...

భక్తులు: హరే కృష్ణ!

ప్రభుపాద: అవును?

జయ-గోపాల: గతము, వర్తమానము భవిష్యత్తులో, భౌతిక అర్థంలో, ఒకే దానియొక్క వికృత ప్రతిబింబమా ...

ప్రభుపాద: అవును, గతము, భవిష్యత్, వర్తమానము వివిధ రకాల సాపేక్షత ప్రకారం. అది శాస్త్రీయ సాక్ష్యం. ప్రొఫెసర్ ఐంస్టీన్ నిరూపించాడు. ఉదాహరణకు మీ గతం బ్రహ్మ గతము కాదు. మీ వర్తమానము చీమ యొక్క వర్తమానము కాదు. గతము, వర్తమానము, భవిష్యత్తు - సమయం శాశ్వతమై ఉంది. ఇది వివిధ పరిమాణాల శరీర సాపేక్షత ప్రకారం. సమయం శాశ్వతమైనది. ఉదాహరణకు ఒక చిన్న చీమ వలె . ఇరవై-నాలుగు గంటలలో దానికి ఇరవై నాలుగు సార్లు గతము, వర్తమానము భవిష్యత్ కలిగి ఉoటుంది. స్పుట్నిక్ లో, రష్యన్ స్పుట్నిక్ , ఒక గంట ఇరవై ఐదు నిమిషాలలో లేదా అలాంటిదే ఈ భూమి చుట్టు ఒక సారి వెళ్ళి వచ్చినది , . వారు, నేను చెప్పేది ఏమిటంటే, ఇరవై ఐదు సార్లు భూమిని చుట్టూ వెళ్ళి వచ్చింది. అంటే ఒక గంట, ఇరవై ఐదు నిమిషాల లోపు, స్పుట్నిక్లో ఉన్న మనిషి పగలు రాత్రి ఇరవై ఐదు సార్లు చూశాడు. ఉన్నత వాతావరణంలో గతము వర్తమానము భిన్నంగా ఉంటుంది. ఈ గతము, వర్తమానం, భవిష్యత్తు, మీ శరీరం ప్రకారం, పరిస్థితులు ప్రకారం. వాస్తవానికి, గతము, వర్తమానము, భవిష్యత్తు లేదు. అంతా శాశ్వతమైనది. నీవు శాశ్వతమైనవాడవు, nityo śāśvato 'yaṁ na hanyate hanyamāne śarīre ( BG 2.20) మీరు చనిపోరు. అందువలన ... నేను శాశ్వతమైనవాడిని అని ప్రజలకు తెలియదు. నా శాశ్వతమైన పని ఏమిటి? నా శాశ్వత జీవితం ఏమిటి? నేను అమెరికన్, "నేను భారతీయుడిని," "ఇది నేను," "ఇది నేను." వారు కేవలము ప్రస్తుత జీవితము పై నిమగ్నము అయి ఉన్నారు. అంతే. ఇది అజ్ఞానం. అందువల్ల కృష్ణుడితో ఈ శాశ్వత సంబదాన్ని ప్రతి ఒక్కరు వెతకాలి. అప్పుడు అయిన సంతోషంగా ఉంటాడు. ధన్యవాదాలు.