TE/Prabhupada 0280 - భక్తియుక్త సేవ అంటే ఇంద్రియాలను పవిత్రము చేసుకోనుట



Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968


కృష్ణ చైతన్యము, లేదా భక్తియుక్త సేవ, అంటే ఇంద్రియాలను పవిత్రము చేసుకోనుట. అంతే. మనము నిర్మూలించడానికి కాదు, ఇంద్రియాలకు సంబంధించిన కర్మల నుండి బయిట పడవలెను. మనకు కేవలము ఇంద్రియాలను పవిత్రము చేసుకోవాలి ఎలా మీరు ఇంద్రియాల ప్రభావము నుండి ఎలా బయిటకు వస్తారు? మీరు జీవులు కనుక , ఇంద్రియాలు ఉన్నాయి. కానీ విషయము ఏమిటంటే ప్రస్తుత సమయంలో, మనము బౌతికముగా కలుషితమైనాము. మన ఇంద్రియాలు పూర్తి ఆనందాన్ని పొందడం లేదు. ఇది చాలా శాస్త్రీయమైనది. భక్తియుక్త సేవ అంటే ఇంద్రియాలను పవిత్రము చేసుకోనుట. Sarvopādhi-vinirmuktaṁ tat-paratvena nirmalam ( CC Madhya 19.170) నిర్మలము అనగా పవిత్రము అవ్వుట. మీరు మీ ఇంద్రియాలను ఎలా పవిత్రము చేసుకోవచ్చు? ఇది నారాద-భక్తి-సూత్రాములలో నిర్వచించబడింది.sarvopādhi-vinirmuktam అని చెప్పబడింది. ఇంద్రియాలు పవిత్రము అవ్వుట అంటే మీరు అన్ని రకాల హోదాల నుండి స్వేచ్ఛను పొందారని అని అర్థం. మన జీవితం పూర్తిగా హోదాలతో నిండి ఉంది. నేను "నేను భారతీయుడు" అని నేను అనుకుంటాను, "నేను సన్యాసని" అని ఆలోచిస్తున్నాను మీరు అమెరికన్ అని ఆలోచిస్తున్నారు, "మనిషి" అని మీరు ఆలోచిస్తున్నారు "మహిళ" అని మీరు ఆలోచిస్తున్నారు "తెలుపు" అని మీరు ఆలోచిస్తున్నారు "నలుపు" అని మీరు ఆలోచిస్తున్నారు చాలా హోదాలు ఉన్నాయి. ఇవి అన్ని హోదాలు. ఇంద్రియాలను పవిత్రము చేయడం అంటే హోదాలను పవిత్రము చేయడమే. కృష్ణ చైతన్యము అంటే "నేను భారతీయుడిని కాదు లేదా యూరోపియన్ కాదు, అమెరికన్ కాదు, లేదా అది కాదు. నేను ఎప్పుడూ కృష్ణుడితో సంబంధం కలిగి ఉన్నాను. నేను కృష్ణుడిలో భాగము " నేను కృష్ణుడిలో భాగము , అని పూర్తిగా నమ్మితేనే అది కృష్ణ చైతన్యము అప్పుడు మీ ఇంద్రియాలు పవిత్రము చేయబడుతాయి.

కృష్ణుడిలో భాగముగా , మీరు కృష్ణుడికి సేవ చేయాలి. అది మీ ఆనందం. ఇప్పుడు మనము మన ఇంద్రియాలను,మన భౌతిక ఇంద్రియాలను సంతృప్తిపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాము. మీరు మారినప్పుడు ... మీరు కృష్ణుడి అంశ అని మీరే గ్రహించుకున్నప్పుడు, అప్పుడు మీరు కృష్ణుడిని, గోవింద యొక్క ఇంద్రియాలను సంతృప్తి చేస్తారు. అయిన ఇంద్రియాలను సంతృప్తిపరచడం ద్వారా, మీ ఇంద్రియాలు సంతృప్తిపరచబడుతాయి. కేవలము ముడి ఉదాహరణ వలె - ఇది ఆధ్యాత్మికము కాదు - భర్త ఆనందించేవాడు అని అర్ధము చేసుకున్నట్లుగా , భార్య ఆనందిoచబడేదిగా భావిస్తారు. భార్య భర్త యొక్క ఇంద్రియాలను సంతృప్తిపరచినట్లయితే, అయిన (ఆమె) ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి. అదేవిధంగా, శరీరంపై కొంత దురద ఉంటే మీ శరీరములో భాగం, వేళ్లు, ఆ శరీరం మీద దురద, వెళ్ళు కూడా సంతృప్తి చెందుతాయి. శరీరములో కేవలము ఒక్క ప్రత్యేక భాగం మాత్రమే సంతృప్తి చెందుతున్నది అని కాదు కానీ శరీరము మొత్తం ఈ ఇంద్రియ సంతృప్తిని అనుభూతి చెందుతుంది అదేవిధంగా, కృష్ణుడు సంపూర్ణము కనుక, మీరు కృష్ణుడినిని సంతృప్తిపరచినప్పుడు, కృష్ణుడి ఇంద్రియాలను, గోవిందా, అప్పుడు మొత్తం విశ్వం సంతృప్తి చెందుతుంది. ఇది శాస్త్రం. Tasmin tuṣṭe jagat tuṣṭa. ఇంకొక ఉదాహరణ ఈ విధముగా ఉంటుంది మీ శరీరంలో కడుపుని సంతృప్తిపర్చినట్లయితే, అప్పుడు మొత్తం శరీరం సంతృప్తి చెందుతుంది. కడుపు ఆహారాన్ని జీర్ణం చేయడం ద్వారా ఎంతో శక్తినిస్తుంది, ఇది రక్తం గా రూపాంతరం చెందుతుంది, అది గుండెలోకి వస్తుంది, గుండె నుండి అది శరీరంలోకి వ్యాప్తి చెందుతుంది, శరీరం అంతటా నిరాశ, అలసట గురైన, ఇది సంతృప్తి ఇస్తుంది.

ఇది కృష్ణ చైతన్యము యొక్క పద్ధతి. ఇది కృష్ణ చైతన్యము యొక్క శాస్త్రం, కృష్ణుడు వ్యక్తిగతంగా వివరిస్తున్నాడు. yaj jñātvā, కృష్ణ చైతన్యము యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే, అప్పుడు మీకు తెలియనిది ఏమీ ఉండదు. అంతా తెలుస్తుంది. ఇది ఒక మంచి విషయము.