TE/Prabhupada 0281 - మనిషి జంతువు, కానీ వివేకము గల జంతువు



Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968


Yaj jñātvā neha bhūyo 'nyaj jñātavyam avaśiṣyate. Bhūyo అంటే అర్థం చేసుకోవడానికి ఏమి లేదు. అంతా పూర్తిగా తెలుసు. ప్రజలు కృష్ణుడిని ఎందుకు అర్థం చేసుకోలేరనేదే ప్రశ్న . అయితే ఇది ఒక సంబంధిత ప్రశ్న, తరువాతి శ్లోకములో కృష్ణుడు సమాధానమిచ్చారు.

manuṣyāṇāṁ sahasreṣu
kaścid yatati siddhaye
yatatām api siddhānāṁ
kaścin māṁ vetti tattvataḥ
( BG 7.3)

Manuṣyāṇāṁ sahasreṣu వివిధ రకాలైన వ్యక్తులు ఉన్నారు. ఉదాహరణకు మనకు ఈ లోకము మీద ఉన్న అందరు తెలుసు, ఇతర లోకములలోనే కాకుండా, వ్యక్తులు వందలు వేల రకాలు ఉన్నారు. ఇక్కడ కూడా మనము కూర్చుని ఉన్నాము, చాలామంది స్త్రీలు పురుషులు , వివిధ రకాలు ఉన్నారు. మీరు బయటికి వెళ్తే, వివిధ రకాలు ఉన్నారు. మీరు మరొక దేశానికి వెళ్లితే- భారతదేశం, జపాన్, చైనా - మీరు వేరొకరిని కనుగొంటారు. అందువల్ల చెప్పబడినది. manuṣyāṇāṁ sahasreṣu ( BG 7.3) చాలామంది వ్యక్తులలో, వివిధరకములైన వ్యక్తులలో, Kascid yatati siddhaye, ఉదాహరణకు కొoదరు వ్యక్తులు మాత్రమే జీవిత తత్వమును అర్థం చేసుకుంటారు.

ఎందుకంటే మనిషి వివేకము గల జంతువు. మానవుడు వివేకము గలవాడు. మనిషి జంతువు, కానీ వివేకము గల జంతువు. మనుషులకు ప్రత్యేకమైన బహుమానం ఏమిటంటే అయిన మంచి, చెడులు ఏమిటో నిర్ణయించగలడు. అయినకు జంతువుల కంటే అదనపు జ్ఞానం ఉంది. ప్రస్తుత విద్య పద్ధతి ఎంత చెడ్డదిగా ఉంది అంటే, అది ఆచరణాత్మకంగా జంతు విద్య. జంతు విద్య అంటే మనం తినడం, నిద్రపోవటం, సంభోగము చేయడము రక్షించుకోవటము చేస్తుంటే, అది జంతు విద్య. తినడం, నిద్రపోవటం, సంభోగము చేయడము రక్షించుకోవటము, మీరు జంతువులలో చూస్తారు. ఏ వ్యత్యాసం లేదు. వాటికి తమ సొంత రక్షణ పద్ధతులు ఉన్నాయి, తమ స్వంత నిద్ర పోయే పద్దతులు ఉన్నాయి , తమ సొంత సంభోగము పద్దతులు ఉన్నాయి. మీరు మీ భార్యతో ఏకాంత ప్రదేశంలో, ఒక చక్కని గదిలో, అలంకరించిన గదిలో సంభోగము చేస్తున్నారు, కానీ ఒక కుక్క వీధిలో సంభోగము చేస్తున్నది. కానీ ఫలితం ఒక్కటే. సంభోగము చేయు పద్ధతిని మెరుగుపరచడం నాగరికత అభివృద్ది కాదు. అది జంతు నాగరికత మెరుగు పట్టినది అంతే. జంతువు కూడా, కుక్క కూడ ఇతర కుక్కల నుండి కూడా రక్షించుకోగలదు. మీరు మిమ్మల్ని రక్షించుకోవడానికి అణు శక్తిని కనుగోన్నామని మీరు అనుకుంటే, ఇది మానవ నాగరికత అభివృద్ది కాదు. రక్షించుకోవటము కొలత, అంతే. అదేవిధంగా, మీరు విశ్లేషిస్తు ఉండండి.

మనిషి యొక్క విశ్లేషణ సంపూర్ణంగా ఉంటుంది ఎప్పుడైతే అతడు తన స్వరూప స్థానాన్ని వెదుకుతాడో . నేను ఏవరు? నేను ఏవరు? నేను ఈ శరీరాన్నా? ఎందుకు నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను? "ఈ విచారణ అవసరం. ఇది మానవుడికి ప్రత్యేకమైన వరము. ఒకరు విచారిస్తున్నప్పుడు "నేను ఎవరిని?" అతడు ఈ విధముగా వెదకుతు పోతే అతడు దేవుడు దగ్గరకు వస్తాడు. ఎందుకంటే అయిన దేవుడిలో భాగం . అయిన దేవుడు మాదిరిగా ఉంటాడు. అందువలన manuṣyāṇāṁ sahasreṣu ( BG 7.3) అనేకమంది వేల మంది వ్యక్తులలో, ఒకటి, లేదా కొందరు వ్యక్తులలో చెప్పాలంటే, దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండవచ్చు. తెలుసుకోవడము మాత్రమే కాదు ... దేవుడు తెలుసుకోవటాము మాత్రమే కాదు, కేవలము తనను తాను తెలుసుకోవడము. నిజానికి అయిన తనకు తాను తెలుసుకోవాలని కోరుకుంటే, క్రమముగా అయిన దేవుడు వద్దకు వస్తాడు.