TE/Prabhupada 0288 - మీరు దేవుడు గురించి మాట్లాడేటప్పుడు, దేవుడు నిర్వచనమేమిటో మీకు తెలుసా



Lecture -- Seattle, September 30, 1968

అతిథి: బహుశా మీరు ఇప్పటికే దీనికి సమాధానమిచ్చారు. నాకు పరిపూర్ణ౦గా తెలియదు. నేను వినలేదు. కానీ నేను ఎప్పుడూ నేర్చుకున్నాను, నేను చిన్నపిల్ల వాడిగా ఉన్నాప్పటినుండి, దేవుణ్ణి ప్రేమి౦చాలని నేను ప్రతిదీ ప్రేమిస్తున్నాను. దేవుడు కృష్ణుడా?

ప్రభుపాద: అవును. మీకు ఇతర దేవుడు ఉన్నాడా ? కృష్ణుడు కాకుండ ఇతర దేవుడు

అతిథి: , ప్రశ్న ఏమిటో మళ్ళి చెప్పండి? , లేదు, లేదు ...

ప్రభుపాద: దేవుడు అంటే ఏమిటి అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి.

అతిధి: దేవుడు కృష్ణుడని నాకు తెలియదు.

ప్రభుపాద: లేదు, ప్రతి ఒక్కదానికి నిర్వచనం ఉన్నది. ఉదాహరణకు నేను చెప్పుతాను "ఇది వాచ్" అని. ఒక నిర్వచనం ఉంది. వాచ్ అoటే ఇది రౌండ్గా ఉంటుంది. తెలుపు డయల్ ఉంది. రెండు చేతులు ఉన్నాయి , సమయం సూచించడానికి చాలా సంఖ్యలు ఉన్నాయి. ఆ విధంగా, నేను మీకు కొంత వివరణ ఇస్తాను. ఏదైనా, మీరు చూడండి లేదా అనుభవం అనుభూతి చెందండి లేదా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, నిర్వచనం ఉండాలి. మీరు దేవుడు గురించి మాట్లాడేటప్పుడు, దేవుడు నిర్వచనమేమిటో మీకు తెలుసా?

అతిథి: అవును. నేను అయిన ప్రేమ అని అనుకున్నాను.

ప్రభుపాద: ప్రేమ నిర్వచనం కాదు; ప్రేమ అనేది కార్యము. అవును ప్రేమ. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను. ప్రేమ నా కార్యము. కానీ దేవుడు యొక్క నిర్వచనం ఉండాలి. మీకు కూడా తెలుసు. ఇప్పుడు మీరు మర్చిపోయారు. ఇప్పుడు, ఒక మాటలో, వారు "దేవుడు గొప్పవాడు" అని అంటారు. మీరు ఒకరి గొప్పతనాన్నిఎలా పరీక్షిస్తారు ? తదుపరి విషయము. "ఈ మనిషి చాలా గొప్పవాడు," అని మీరు చెప్పితే అప్పుడు అవగాహనా ఉండాలి. అతడు గొప్పవాడని మీరు ఎలా అంచనా వేసారు. ఈ అవగాహన వివిధ దశలల్లో ఉన్నది. దేవుడు గొప్పవాడు అని మీరు ఎలా అర్థం చేసుకుoటారు? మీ లెక్క ఏమిటి, అప్పటి నుండి, దేవుడు గొప్పవాడు కాదా? మీ బైబిల్లో ఉన్నట్టుగా , చెప్పబడింది, "దేవుడు అన్నాడు, 'సృష్టి ఉండు గాక' సృష్టి జరిగింది." అది కాదా? ఇది ప్రకటన కాదా? ఇక్కడ గొప్పతనాము ఉంది. అయిన కేవలము "సృష్టి ఉండు గాక" అని అన్నాడు, అక్కడ సృష్టి జరిగింది. నువ్వు అది చేయగలవా? మీరు మంచి వడ్రంగి అని అనుకుందాం. మీరు "కుర్చీ ఉoడు గాక" అని చెప్పితే, అప్పుడు కుర్చీ ఉoటుoదా? ఇది సాధ్యమేనా? మీరు ఈ వాచ్ యొక్క తయారీదారుడు అని అనుకుందాం. మీరు చెప్పితే "నేను చెప్పుతాను ఒక్క వాచీ ఉండు గాక" వెంటనే వాచి ఉంటుందా? అది సాధ్యం కాదు. అందువల్ల దేవుడి నామము satya-saṅkalpa. satya-saṅkalpa.satya-saṅkalpa అంటే అయిన భావించేది, అది వెంటనే ఉంటుoది. దేవుడు మాత్రమే కాదు, కానీ యోగ పరిపూర్ణము సాధించిన వారికి, వారు దేవుడు వలె కోరకోలేరు. కానీ దాదాపు. అద్భుతమైన విషయాలు ... ఒక యోగి, అయిన పరిపూర్ణము కలిగి ఉంటే, అయిన ఏదైన కోరుకుంటే, "నాకు ఇది కావలి," వెంటనే అది ఉంటుoది. దీనిని satya-saṅkalpa అని పిలుస్తారు. ఈ విధంగా, అనేక ఉదాహరణలు ఉన్నాయి. అది గొప్పతనం. ఏమిటి ... కేవలము ఆధునిక శాస్త్రవేత్తల వలె, వారు చంద్రుని లోకమునకు వెళ్లేందుకు మంచి వేగంతో, ఒక్క స్పేస్ యంత్రమును తయారు చేస్తున్నారు. అమెరికా, రష్యా ఇతర దేశాల శాస్త్రవేత్తలు చాలామంది ప్రయత్నిస్తున్నారు. కానీ వారు చేయలేరు. వారి స్పుట్నిక్ తిరిగి వస్తోంది. కాని దేవుడు శక్తిని చూడoడి. లక్షలాది లోకములు పత్తి వలె తేలుతున్నాయి. ఇది గొప్పతనం. ఏ అర్ధంలేనివి, అయిన చెప్పినట్లయితే "నేను దేవుడిని" , అయిన ఒక దుష్టుడు. దేవుడు గొప్పవాడు. నీవు దేవుడితో నిన్ను పోల్చుకోలేవు. పోలిక లేదు. కానీ రాస్కల్డమ్ జరుగుతోంది. అందరూ దేవుడే. నేను దేవుడను నీవు దేవుడివి - అతను కుక్క. నీవు దేవుడి శక్తిని చూపిoచు, అప్పుడు మీరు చెప్పoడి. మొదట అర్హత పొంది, అప్పుడు కోరుకొండి. మనకు ఏ శక్తి ఉంది? మనము ఎల్లప్పుడూ ఆధారపడి ఉన్నాము. దేవుడు గొప్పవాడు, మనము దేవుడు మీద ఆధారపడి ఉన్నాము. అoదుకే మనo దేవుణ్ణి సేవిoచాలనేదే సహజమైన సారాంశము. ఇది మొత్తం (అస్పష్టమైన).సేవ చేయడము అంటే ప్రేమతో. తప్ప ... ఇప్పుడు ఈ అబ్బాయిలాగనే, నా శిష్యులు, వారు నాకు సేవ చేస్తున్నారు. నేను చెప్పేది ఏమైన, వారు వెంటనే అమలు చేస్తున్నారు. ఎందుకు? నేను ఒక భారతీయుడిని, నేను ఒక విదేశీయుడిని. రెండు లేదా మూడు సంవత్సరాల క్రితం నేను వారికి తెలియలేదు, లేదా నాకు వారు తెలియదు. ఎందుకు వారు చేస్తున్నారు? ఎందుకంటే అది ప్రేమ. సేవ చేయడము అంటే ప్రేమను అభివృద్ధి చేసుకొనుట. మీరు దేవుడి పట్ల మీ ప్రేమను అభివృద్ధి చేసుకోలేకపోతే అయినును సేవించలేరు. ఎప్పుడైనా. మీరు ఏదైనా సేవను అందిస్తే అది ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. నిస్సహాయ శిశువుకు తల్లి సేవ చేయు విధముగానే. ఎందుకు? ప్రేమ. అదేవిధంగా, మన ప్రేమ పరిపూర్ణముగా ఉంటుంది. మన ప్రేమ దేవాదిదేవుని మీద పరిపూర్ణముగా ఉన్నప్పుడు. అప్పుడు అది సరైనది. మీరు దీనిని నేర్చుకోవాలి. ఇది కృష్ణ చైతన్యము - కృష్ణుడితో సంబంధంలో. నేను నా శిష్యులను ప్రేమిస్తాను. నా శిష్యులు నన్ను ప్రేమిస్తారు. ఎందుకు? సంబంధము ఏమిటి? కృష్ణడు .