TE/Prabhupada 0289 - ఎవరైనా దేవుడి రాజ్యం నుండి వచ్చినవారు, వారు ఒక్కటే



Lecture -- Seattle, September 30, 1968


ప్రభుపాద: చెప్పండి?

ఉమన్: రాముడు యేసు ఒక్కరేనా?

భక్తుడు: "రాముడు, యేసు ఒక్కరేనా?

ప్రభుపాద: ఒక్కరే కాదు ..., సరిగ్గా ఒక్కరే కాదు, కానీ ఒకేలా. పర్యాయపదంగా చెప్పలేము, ఒకేలా.

మహిళ: , ఒకట్టే.

ప్రభుపాద: అవును. సంపూర్ణ స్థితిలో ప్రతిదీ ఒకేలా ఉంటుంది. సాపేక్ష ప్రపంచంలో కూడా. మీరు తీసుకునేది ఎదైన, అది బౌతికము. భౌతిక గుర్తింపు. అదేవిధంగా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతిదీ ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుడు దేవుడి కుమారుడు లేదా దేవుడి స్నేహితుడు లేదా దేవుడి ప్రేమికుడు, ఎవరైనా, ఉంది ... వారు ఒక్కే స్థితిలో ఉన్నారు, ఆధ్యాత్మికంగా ఉన్నారు. అందువలన వారు ఒకేలా ఉన్నారు.

మహిళ: కానీ రాముడు జన్మించిన మనిషిని సూచించడములేదా ... నేను కాదు, భారతదేశంలో లేదా ఎక్కడైన, క్రీస్తు ఐరోపాలో జన్మించాడు? ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, కానీ ఇప్పటికీ అదే, అదే ...

ప్రభుపాద: అవును. సూర్యుడు ప్రతి రోజు అమెరికాలో ఉదయిస్తాడు ఐరోపాలో ఉదయిస్తాడు భారతదేశంలో ఉదయిస్తాడు. ఆతడు భారతీయుడా లేదా అమెరికనా లేదా చైనీశా అని అర్థమా?

ఉమెన్: లేదు, అది నా ఉద్దేశ్యం కాదు.

ప్రభుపాద: అప్పుడు? అందువల్లన ఆ విధంగా ఉంది. ఎప్పుడు... ఇది మన పరిమిత జ్ఞానం. దేవుడు గొప్పవాడు అని మనకు ఆ విధంగా నేర్పించారు. సూర్యుడు గొప్పవాడిగా ఉన్నాడు; అందువల్లన సూర్యుడు భారతదేశంలో లేదా అమెరికాలో లేదా చైనాలో ఎక్కడైనా చూస్తాము, ప్రపంచంలోని ఏ భాగమైన, విశ్వములో ఏ భాగమైన, సూర్యుడు ఒక్కడు. ఎవరూ చెప్పలేరు ఓ, ఇది అమెరికన్ సూర్యుడు లేదా "ఇది భారతీయ సూర్యుడు" అని. యేసుక్రీస్తు లేదా రాముడు లేదా కృష్ణుడు, ఎవరైనా దేవుడి రాజ్యం నుండి వచ్చినవారు, వారు ఒకేలా ఉన్నారు. తేడా లేదు. కానీ వ్యత్యాసం ఏమిటంటే, మీ దేశములో సూర్యుని ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది, ఉష్ణమండల దేశంలో సూర్యుని యొక్క ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సూర్యుని ఉష్ణోగ్రత మార్చబడిందా? ఇది తీసుకునే దాని ప్రకారం ఉంటుంది. ఈ దేశం యొక్క వాతావరణం సూర్యరశ్మిని సరిగ్గా పొందలేకుండా ఉంది, కానీ సూర్యరశ్మి ప్రతిచోటా దాని కాంతిని ఇస్తుంది. అదేవిధంగా, దేశం ప్రకారం, పరిస్థితుల ప్రకారం, గ్రహముల ప్రకారం, దేవుడు భిన్నంగా వ్యక్తం చేయబడ్డాడు, కానీ అయిన భిన్నంగా లేడు. మీరు మీ శరీరాన్ని కొన్ని శీతాకాలపు దుస్తులతో చుట్టుకున్నారు. అదే సమయంలో, భారతదేశం లో టెలిగ్రాఫ్, వారు ప్యాన్ ను నడిపిస్తున్నారు. ఎందుకు ఉష్ణోగ్రత భిన్నంగా ఉంటుంది? భగవంతుడు జీసస్ క్రైస్ట్ చెప్పిన విధముగా, లేదా కృష్ణుడు చెప్పిన విధముగా, లేదా రాముడు చెప్పిన విధముగా ప్రదేశము ప్రకారము, పరిస్థితుల ప్రకారం, వాతావరణం, వ్యక్తులు, వినేవారు. వేరుగా ఉంటుంది. ఒక పిల్లవానిని ఒప్పించటానికి నేను ప్రయత్నించిన ఒక విషయమును, తన తండ్రికి అదే విషయము నేర్పడం సాధ్యం కాదు. లేదా ఒక పిల్లవాడు సెక్స్ జీవితాన్ని అర్థం చేసుకోలేడు, కాని ఒక యువకుడు అర్థం చేసుకోగలడు. అదే పిల్లవాడు, వాడు పెరిగినప్పుడు, అయిన తెలుసుకుoటాడు. మీరు ప్రతి ఒక్కరూ ప్రతిది అర్థం చేసుకుంటారని అనుకోవద్దు. బైబిల్ కొన్ని పరిస్థితులలో మాట్లాడబడిoది; కొన్ని పరిస్థితులలో భగవద్గీత మాట్లాడబడిoది. ఇది పరిస్థితుల తేడా. కాకపోతే, సూత్రం అదే. బైబిల్లో కూడా "దేవుణ్ణి ప్రేమిoచండి" అని చెప్పబడింది భగవద్గీతలో కూడా "దేవుణ్ణి ప్రేమిoచండి" అని చెబుతుంది. తేడా లేదు.