TE/Prabhupada 0303 - ఆధ్యాత్మికము. మీరు అతీతముగా ఉన్నారు
(Redirected from TE/Prabhupada 0303 - ఆద్యాత్మికము. మీరు అతీతముగా ఉన్నారు)
Lecture -- Seattle, October 2, 1968
ప్రభుపాద: చదువుతు ఉండండి.
తమలా కృష్ణ: "'మీ స్థితి మీరు ఆద్యాత్మికంగా ఉంటారు. "
ప్రభుపాద: ఆద్యాత్మికము. "మీరు అతీతముగా ఉన్నారు." ఇది భగవద్గీతలో వివరించబడింది:
- indriyāṇi parāṇy āhur
- indriyebhyaḥ paraṁ manaḥ
- manasas tu parā buddhir
- yo buddheḥ paratas tu saḥ
- (BG 3.42)
ఇప్పుడు ... మొదట, మీరు ఈ శరీరమును అర్ధము చేసుకోండి. శరీరము అంటే ఇంద్రియాలు అని అర్థం. కానీ మీరు మరింత ముందుకు వెళ్ళినప్పుడు, మనం ఈ ఇంద్రియ కార్యక్రమములకు కేంద్రం మనము మనస్సు అని చూస్తాము. మనస్సు సరిగ్గా లేకపోతే తప్ప, మనము మన ఇంద్రియాలతో పని చేయలేము. కావునా indriyebhyaḥ paraṁ manaḥ. ఇంద్రియాలకoటే శ్రేష్టమైనది, మనస్సు, మనస్సుకoటే శ్రేష్టమైనది, బుద్ధి , బుద్ధి కoటే శ్రేష్టమైనది, ఆత్మ . మనము అర్థం చేసుకోవాలి. ముందుకు వెళ్ళండి.
తమలా కృష్ణ: "కృష్ణుడి యొక్క ఉన్నతమైన శక్తి ఆధ్యాత్మిక స్వరూపంలో ఉంది , బాహ్య శక్తి బౌతికము. మీరు భౌతిక శక్తి ఆధ్యాత్మిక శక్తి మధ్య ఉన్నారు, అందువలన మీ పరిస్థితి తటస్తాముగా ఉంది. మరో మాటలో చెప్పాలంటే, మీరు కృష్ణుడి యొక్క తటస్తా శక్తికి చేందిన వారు. మీరు ఏకకాలంలో, కృష్ణుడితో ఒక్కరిగా మరియు భిన్నంగా ఉంటారు. మీరు ఆత్మ కనుక , మీరు కృష్ణుడితో భిన్నంగా లేరు, కానీ మీరు కృష్ణుడిలో ఒక చిన్న కణాము అయిన్నందువల్లన, మీరు అయిన నుండి భిన్నంగా ఉంటారు. ' "
ప్రభుపాద: ఇప్పుడు ఇక్కడ ఒక పదాన్ని ఉపయోగిస్తారు, తటస్తా శక్తి. తటస్తా శక్తి, ఖచ్చితమైన సంస్కృత పదం తటస్తా. ఉదాహరణకు భూమి చివర , సముద్రం మొదలవుతుంది. అందువల్లన తటస్తా భూమి ఉంది. మీరు పసిఫిక్ సముద్ర తీరంలో వెళుతుంటే, మీరు కొంత భూమిని కనుగొంటారు. కొన్నిసార్లు ఇది నీటిని కలిగి ఉంటుంది, కొన్నిసార్లు ఇది కేవలము ఖాళి భూమి మాత్రమే. దినిని తటస్తాము అంటాము. అదేవిధంగా, మనము ఆత్మలము, మనము దేవుడితో స్వరూపబద్ధంగా ఒక్కటిగా ఉన్నప్పటికీ, కానీ కొన్నిసార్లు మనము మాయ ద్వారా కప్పబడి ఉంటాము కొన్నిసార్లు మనం స్వేచ్చగా ఉన్నాము. అందువలన మన పరిస్థితి తటస్తాముగా ఉంది. మనము మన వాస్తవమైన స్థానాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు ... అదే ... అదే ఉదాహరణ వలె. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆది ... బీచ్ లో కొంత భూమి యొక్క భాగాన్ని కొన్నిసార్లు నీటితో నిండి ఉన్నట్లు మీరు చూస్తారు, మళ్లీ అది ఖాళి భూమిగా చూస్తారు. అదేవిధంగా మనం కొన్నిసార్లు మాయా చేత కప్పబడి ఉన్నాము, న్యూన శక్తి , కొన్నిసార్లు మనము స్వేచ్చగా ఉన్నాము. మనము ఆ స్వేచ్ఛా స్థితిని కాపాడుకోవాలి. ఉదాహరణకు ఖాళీగా ఉన్న ప్రదేశంలో నీళ్ళు లేవు. సముద్రపు నీటి నుండి మీరు కొంచము దూరం వస్తే, అప్పుడు నీరు లేదు; ఆది అoతా భూమి. అదేవిధంగా, మీరు భౌతిక చైతన్యము నుండి మీరు దూరముగా ఉంటే, ఆధ్యాత్మిక చైతన్యం, లేదా కృష్ణ చైతన్యములోకి వస్తే, అప్పుడు మీరు మీ స్వేచ్ఛను కలిగి ఉంటారు కానీ మీరు తటస్తా స్థితిలో ఉంటే, అప్పుడు కొన్నిసార్లు మీరు మాయ చేత కప్ప బడి ఉంటారు కొన్నిసార్లు మీరు స్వేచ్చగా ఉంటారు. ఇది మనపరిస్థితి.