TE/Prabhupada 0310 - జీసస్ భగవంతుని ప్రతినిధి, మరియు హరి-నామము భగవంతుడు



Lecture -- Seattle, October 2, 1968

ప్రభుపాద: ప్రశ్నలు అడగండి?

మహాపురుష: ప్రభుపాద, అక్కడ ఏ వీరుధమైనది అయినా ఉందా, ఎందుకంటే భగవంతుడు జీసస్ క్రైస్ట్ చైతన్య మహాప్రభు ఇద్దరు కలి యుగములో వచ్చారు, ప్రభువైన యేసు క్రీస్తు చెప్పారు "దేవుడుకి ఏకైక మార్గం నా ద్వారా. నన్ను నమ్మoడి లేదా నాకు శరణాగతి పొందoడి " హరి-నామా ఈ యుగంలో ఆధ్యాత్మిక సాక్షాత్కారమునకు ఏకైక మార్గమని చైతన్య మహాప్రభు ప్రచారము చేశాడు?

ప్రభుపాద: మీరు ఎక్కడ తేడా కనుగొంటారు? భగవంతుడు జీసస్ క్రైస్ట్ చెప్పినట్లయితే, "నా ద్వారా", అంటే అయిన దేవుడు ప్రతినిధి, మరియు హరి-నామాము దేవుడు. దేవుడి ప్రతినిధి ద్వారా లేదా దేవుడి ద్వారా, అదే విషయము. దేవుడు దేవుడు ప్రతినిధి, ఏ తేడా లేదు. ఈ సాదారణమైన వ్యవహారాల్లో , నా ప్రతినిధిని నేను పంపినట్లయితే, నా తరఫున ఏదైనా సంతకం చేసినట్లయితే, నేను దానిని అంగీకరించాలి, ఎందుకంటే అయిన నా ప్రతినిధి. అదేవిధంగా, దేవుడుని, దేవుడు ద్వారా లేదా అయిన ప్రతినిధి ద్వారా సంప్రదించవలసి ఉంటుంది. అలాంటిదే. తేడా అర్థం చేసుకోవడము మాత్రమే కావచ్చు. ఎందుకంటే భగవంతుడు జీసస్ క్రైస్ట్ చాలా ఆధునికము కాని ఒక సమాజములో మాట్లాడారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం, దేవుడి చేతన్యము కలిగిన వ్యక్తికి, శిలువ వేయబడ్డాది అని మీరు అర్థం చేసుకోవచ్చు. సమాజం యొక్క పరిస్థితిని చూడoడి. మరో మాటలో చెప్పాలంటే, అది తక్కువ స్థాయి సమాజం. వారు మొత్తం దేవుడు తత్వాన్ని అర్థం చేసుకోలేక పోయారు. అది సరిపోతుంది. "దేవుడు సృష్టించాడు. దానిని తీసుకోండి సృష్టి ఎలా జరిగిందో అర్థం చేసుకోవటానికి, వారు తెలివైనవారు కాదు. వారు తెలివైనవారుగా ఉంటే, వారు గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగిన యేసుక్రీస్తుకు శిలువ వేసే వారు కాదు. అందువల్ల సమాజాము ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఖురాన్లో మాదిరి ఇది ముహమ్మద్ చేత చెప్పబడింది ఈ రోజు నుండి మీ తల్లితో మీరు సెక్స్ సంపర్కం చేయరాదు. సమాజం యొక్క పరిస్థితిని తెలుసుకోండి. మనo సమయo, పరిస్థితులు, సమాజమును పరిగణలోకి తీసుకొని, ఆపై ప్రచారము చేయాలి. అలాంటి సమాజానికి, అధిక తాత్విక విషయాలను అర్ధం చేసుకోవడం సాధ్యం కాదు, ఇది భగవద్గీతలో చెప్పబడినట్లుగా కానీ ప్రాధమిక సమాచారము, దేవుడు యొక్క అధికారమును , ఇది బైబిల్ మరియు భగవద్గీతలో రోoడిటిలో అంగీకరించబడింది. బైబిల్ ప్రారంభమవుతుంది, "దేవుడు సర్వోన్నతమైన అధికారి," భగవద్గీత ముగుస్తుంది, "మీరు శరణాగతి పొందండి." తేడా ఏమిటి? కేవలము సమయం, సమాజం, ప్రదేశము ప్రజల ప్రకారం వివరణ. అంతే. వారు అర్జునుడు కాదు. మీరు చూడoడి? అర్జునుడు అర్ధం చేసుకోవలసిన విషయాలు ప్రభువైన యేసు క్రీస్తుకు శిలువ వేసిన వారికి అర్ధము చేసుకొనుట సాధ్యం కాదు. మీరు ఆ విధoగా అధ్యయనo చేయాలి. అదే విషయము. ఒక నిఘంటువు, ఒక పాకెట్ నిఘంటువు, పిల్లల నిఘంటువు మరియు నిఘంటువు, అంతర్జాతీయ నిఘంటువు, అవి రెండు నిఘంటువులే, కానీ విలువ భిన్నంగా ఉంటుంది. ఆ డిక్షనరీ చిన్న తరగతి పిల్లలకి ఉద్దేశించబడింది, ఉన్నత విద్వాంసులకు ఆ నిఘంటువు ఉద్దేశించబడింది. కానీ వాటిలో దేనినీ మీరు నిఘంటువు కాదు అని చెప్పలేరు. మీరు చెప్పలేరు. అవి రెండు నిఘంటువులు. మనము సమయం, ప్రదేశము, వ్యక్తులు, ప్రతిదీ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు భగవంతుడు బుద్ధుడిలా, అయిన సరళముగా చెప్పాడు "ఈ జంతువులను చంపడం, పిచ్చి పని, ఆపoడి." ఇది అయిన ప్రచారం. వారు చాలా తక్కువ-స్థాయి ప్రజలు ,కేవలము జంతువుల హత్యలో ఆనందం పొందుతున్నారు. అందువల్ల వారిని ఉన్నత స్థానమునకు తీసుకు రావడానికి, బుద్ధుడు ఈ పిచ్చి పనులను ఆపoడి అని కోరుకున్నాడు: "దయచేసి చంపడం ఆపoడి." ప్రతి సారి దేవుడు లేదా దేవుడి వేరొక ప్రతినిధి వేర్వేరు పరిస్థితులలో ప్రజలకు ప్రచారము చేయటానికి వస్తారు. పరిస్థితుల ప్రకారం వివరణలో కొంత వ్యత్యాసం ఉండవచ్చు, కానీ ప్రాధమిక సమాచారము అదే ఉంటుoది. భగవంతుడు బుద్ధుడు ఇలా అన్నాడు, "సరే, దేవుడు లేడు, కానీ నీవు నాకు శరణాగతి పొందు." అప్పుడు తేడా ఏక్కడ ఉన్నాది? అంటే దేవుడు ప్రామాణికతను ఈ విధంగా లేదా ఆ విధంగా గాని అంగీకరించాలి.