TE/Prabhupada 0312 - మనిషి జ్ఞానము గల జంతువుMorning Walk -- April 1, 1975, Mayapur

ప్రభుపాద:కనీసం ఇప్పుడు నాకు ఈ కృష్ణ చైతన్య ఉద్యమము సిద్ధాంతం కాదు. ఇది ఆచరణాత్మకమైనది. నేను అన్ని సమస్యలను పరిష్కరించగలను.

పుష్ట కృష్ణ: ప్రజలు ఎలాంటి తపస్సు తీసుకోవాలనుకోవటము లేదు.

ప్రభుపాద: హమ్?

పుష్ట కృష్ణ: ప్రజలు ఎలాంటి తపస్సును అంగీకరించరు.

ప్రభుపాద: అప్పుడు మీరు వ్యాధి వలన బాధపడతారు. మీకు వ్యాధి ఉన్నాట్లయితే, మీరు తప్పనిసరిగా ఉండాలి ... ఈ తపస్సు ఏమిటి? తపస్సు ఎక్కడ ఉంది?

పుష్ట కృష్ణ: వారు ఔషధమును అంగీకరించకపోతే, అప్పుడు వారికి నయం కాదు.

ప్రభుపాద: అప్పుడు వారు బాధపడాలి. ఒక మనిషి, వ్యాధి కలిగి ఉంటే, అయిన ఔషధం తీసుకోవాలను కోకపోతే, అప్పుడు ఎక్కడ ఉంది ...? అయిన బాధపడాలి. నివారణ ఎక్కడ ఉంది?

పంచా ద్రవిడా: వారు మనము వ్యాధితో బాధపడుతున్నవారిమి అని చెప్తున్నారు.

ప్రభుపాద:హమ్?

పంచా ద్రవిడా: మనము వ్యాధిగ్రస్తులమని చెప్తారు. మనలో ప్రతి ఒక్కరు వ్యాధిగ్రస్తులమని, వారు కాదు అని చెప్పుతారు.

ప్రభుపాద: అవును. చెవిటి మనిషి ఇతరులు చెవిటి వారు ఆని భావిస్తాడు. (నవ్వు) అంటే వారు మానవులు కూడా కాదు. జంతువులు. వారు అర్ధము చేసుకోవటానికి రారు, "మనకు వ్యాధి ఉన్నదా లేదా వారికీ వ్యాధి ఉన్నదా. కూర్చొని మాట్లాడండి దానికి కూడా వారు సిద్ధంగా లేదు. అప్పుడు? మనము జంతువులతో ఏమి చెయ్యగలము?

పంచా ద్రవిడా: వారు మనము పాత ఫ్యాషన్ అని చెప్తారు. వారు ఇకపై మనతో కలవడానికి ఇష్టపడరు.

ప్రభుపాద: అప్పుడు ఎందుకు మీరు సమస్యలతో బాధపడతారు? మీరు సమాజపు సమస్యలతో ఎందుకు బాధపడతారు? మీరు బాధపడతారు, కానీ మీరు ఒక పరిష్కారం చేయలేరు. ప్రపంచ వ్యాప్తంగా, వార్తాపత్రికల నిండా కొట్లాటలు.

విష్ణుజన: శ్రీల ప్రభుపాద, మీరు వారిని సహేతుకము చేయగలరా? వారు అసహేతుకముగా ఉన్నప్పుడు, వారిని చేయడానికి ఏదైనా మార్గం ఉందా ...

ప్రభుపాద: వారు సహేతుకమైనవారు. మనిషి, ప్రతి మనిషి, సహేతుకమైన వాడు. మనిషి జ్ఞానము గల జంతువు అని చెప్పబడింది. హేతుబద్ధత లేనప్పుడు, వారు ఆప్పటికీ జంతువు అని అర్థం.

పంచా ద్రవిడా: సరే, జంతువులతో ఏమి చేయవచ్చు?

ప్రభుపాద: ఇది ... ఇది చాలా సరళమైన సత్యము. నేను ఈ శరీరం. నేను ఆనందాన్ని కోరుకుంటున్నాను. ఎందుకు నేను ఆనందాన్ని కోరుకుంటున్నాను? ... మీరు ఈ అంశంపై చర్చించినట్లయితే, అప్పుడు ఒక మనిషి సహేతుకమైన వాడిగా మీరు కనుగొంటారు. నేను ఎందుకు సంతోషాన్ని కోరుకుంటున్నాను? జవాబు ఏమిటి? అది సత్యము. అందరూ ఆనందాన్ని కోరుకుoటున్నారు. ఎందుకు మనము ఆనందాన్ని కోరుకుంటున్నాము? జవాబు ఏమిటి?

పంచా ద్రవిడా: ప్రతి ఒక్కరు దుఖముతో ఉన్నారు, వారు దానిని ఇష్టపడరు.

ప్రభుపాద: ఆది ఒక వ్యతిరేక పద్ధతి, వివరణ.

కీర్తనానంద: స్వభావం వలన నేను సంతోషంగా ఉన్నాను.

ప్రభుపాద: అవును. స్వభావము వలన నేను సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఎవరు ఉన్నారు, ఈ శరీరమా లేదా ఆత్మ?

పుష్ట కృష్ణ: లేదు, ఆత్మ.

ప్రభుపాద: ఎవరు సంతోషం కోరుకుంటున్నారు? నేను ఈ శరీరాన్ని కాపాడాలనుకుంటున్నాను - ఎందుకు? ఎందుకంటే నేను ఈ శరీరంలో ఉన్నాను. నేను ఈ శరీరాము నుండి దూరంగా వెళ్ళి పోతే, ఎవరు ఈ శరీరం యొక్క ఆనందం కోసం ప్రయత్నిస్తారు? ఈ సాధారణ కారణం, వారికి అర్థమే కాదు. నేను ఎందుకు ఆనందాన్ని కోరుకుంటున్నాను? శరీరం చలి ద్వారా ప్రభావితం కాకుండా ఉండుటకు నేను ఈ శరీరాన్ని కప్పి ఉంచుతాను. నేను ఎందుకు శరీరం యొక్క ఆనందాన్ని కోరుకుంటున్నాను చల్లదనము వేడి నుండి ? ఎందుకంటే నేను లోపల ఉన్నాను ... నేను శరీరం లోపల నుండి దూరంగా వెళ్ళి పోతే, అప్పుడు ఆనందం కోసము కోరుకోవటము ఉoడదు. మీరు వీధిలో పడి వేస్తారు. అది తీవ్రమైన చల్లదనము లేదా తీవ్రముగా వేడిగా ఉన్నా, అది పట్టింపు లేదు. అప్పుడు ఎవరు సంతోషం కోరుతున్నారు? అది వారికి తెలియదు. ఎవరి ఆనందం కోసం మీరు బిజీగా ఉన్నారు? అది వారికి తెలియదు. కేవలము పిల్లులు కుక్కల వలె .

పుష్ట కృష్ణ: కానీ పవిత్ర నామాన్ని కీర్తన చేయటానికి వారి దగ్గర ఎప్పుడు సమయము లేదని వారు భావిస్తారు.

ప్రభుపాద: హమ్?

పుష్ట కృష్ణ: వారి తత్వము, సంతోషంగా ఉండటానికి, వారు రోజంతా పనిచేయాలి.

ప్రభుపాద: ఇది మీ తత్వము. మీరు దుష్టులు, కానీ మనము పని చేయడము లేదు. మీరు మా ఉదాహరణను ఎందుకు చూడరు? మేము సంతోషంగా జీవిస్తున్నాము.