TE/Prabhupada 0320 - భాగ్యవాన్, అదృష్టవశాత్తూ, ఎలా అవ్వవచ్చో మనము బోధిస్తున్నాముLecture on BG 16.6 -- South Africa, October 18, 1975


బాలిక: శ్రీల ప్రభుపాద, అయినప్పటికీ ... అన్ని ప్రాణులు కృష్ణుడిలో భాగము. ఈ జీవితకాలంలో మనము కృష్ణుడినికి శరణాగతి పొందకపోయినా, చివరకు మనము ప్రతి ఒక్కరము అయినకు శరణాగతి పొందుతాము

పుష్టా కృష్ణ: ప్రతి ఒక్కరునా ... మనము ఈ జీవితంలో కృష్ణుడికి శరణాగతి పొందకపోయినా, అందరూ కృష్ణుడికి శరణాగతి పొందుతారా? ప్రతి ఒక్కరూ చివరికి దేవుడు దగ్గరకు తిరిగి వెళ్తారా?

ప్రభుపాద: హమ్? మీకు అనుమానం ఉన్నది? ప్రతి ఒక్కరూ అలా చేయరు అని హామీ ఇస్తున్నాను. మీకు చింత లేదు. ప్రతి ఒక్కరూ అలా చేస్తారు అని కాదు. అందువల్లన చైతన్య మహాప్రభు చెప్పుతారు, ei rūpe brahmāṇḍa bhramite kona bhāgyavān jīva ( CC Madhya 19.151) భాగ్యవాన్ అయితే తప్ప, చాలా అదృష్టంతుడైతే తప్ప, అయిన భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళలేడు, భగవంతుడి దగ్గరకు తిరిగి వెళ్ళలేడు. అయిన ఇక్కడ కుళ్ళిపోతాడు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే మనం ప్రజలను భాగ్యవoతులను చేయాలని ప్రయత్నిస్తున్నాం. అయిన కోరుకుంటే, అయిన భాగ్యవాన్ కావచ్చు. ఇది మన ప్రయత్నం. మనము చాలా కేంద్రాలను నిర్మిస్తూన్నాము. భాగ్యవాన్, అదృష్టవశాత్తూ, ఎలా భగవత్ ధామమునకు తిరిగి వెళ్లవచ్చో, అతను ఎలా సంతోషంగా ఉంటాడో మనము బోధిస్తున్నాము. ఇప్పుడు, అదృష్టవoతుడైతే , వారు ఈ ఆదేశాన్ని తీసుకొని వారి జీవితాన్ని మార్చుకుంటారు. అందువలన ఇది లక్ష్యము. కానీ భాగ్యవాన్ కాకుండా, ఎవరూ వెళ్ళలేరు. అదృష్టం. అదృష్టవంతలు అవ్వడానికి మనము వారికి అవకాశం ఇస్తున్నాము. ఇది మన లక్ష్యం. చాలా దురదృష్టకరమైన వారికి అవకాశం ఇస్తున్నాము అదృష్టవంతలు కావడానికి. దురదృష్టకరమైన జీవితంలో నుండి వారు అదృష్టానికి ఎలా వస్తున్నారన్నది మనలో ప్రతి ఒక్కరు పరిగణించవచ్చు. ఇది కృష్ణ చైతన్య ఉద్యమము, దురదృష్టవంతులకు మనం అవకాశం ఇస్తున్నాం. అందరూ దురదృష్టవంతులు, ప్రతి ఒక్కరూ దుష్టులు. బుద్ధిమంతులు మరియు అదృష్టవంతులు ఆవ్వడానికి మనము అవకాశం ఇస్తున్నాము. ఇది కృష్ణ చైతన్యము. ప్రజలు దురదృష్టవంతులు, దుష్టులు కాకపోతే, ప్రచారము చేయుటకు అర్ధం ఏమిటి? ప్రచారము అంటే, దుష్టులను దురదృష్టకరమైన వారిని, మీరు తెలివైనవారిగా అదృష్టవంతులుగా మారుస్తున్నారు. అది ప్రచారము అంటే. కానీ మీరు అదృష్టవoతులు తెలివైనవారు కాకపోతే తప్ప, మీరు కృష్ణ చైతన్యమున్ని తీసుకోలేరు. అది వాస్తవము.