TE/Prabhupada 0321 - పవర్ హౌస్ తో ఎల్లప్పుడూ కనెక్ట్ కలిగి ఉండాలి
Lecture on SB 1.15.28 -- Los Angeles, December 6, 1973
చైతన్య మహాప్రభు చెప్పుతారు మీరు ఆదేశిoచబడినట్లుగా పని చేయాలి, ఆదేశిoచబడినట్లుగా, āpani ācari అప్పుడు ఇతరులకు బోధిoచవచ్చు. మీకు మీరే అనుసరించకపోతే, మీ ఆదేశాలకు విలువ ఉండదు. Evaṁ paramparā prāptam ( BG 4.2) మీకు అసలైన పవర్హౌస్తో సంబoదము ఉంటే, అప్పుడు విద్యుత్ సరఫర ఉంటుoది. లేకపోతే అది కేవలము వైర్ మాత్రమే. విలువ ఏముoది? కేవలము వైరింగ్ మీకు సహాయం చేయదు. కనెక్షన్ తప్పకుండా ఉండాలి. మీరు సంబoదము కోల్పోతే, దానికి విలువ లేదు. అందువల్లన కృష్ణ చైతన్యము అంటే అసలైన పవర్హౌస్తో మీరు ఎల్లప్పుడూ కనెక్ట్ కలిగి ఉండాలి. ఆపై, మీరు ఎక్కడికి వెళ్లినా, అక్కడ కాంతి ఉంటుంది. అక్కడ కాంతి ఉంటుంది. మీరు కనెక్షన్ కోల్పోతే , కాంతి ఉండదు. బల్బ్ ఉంది; వైరింగ్ ఉంది; స్విచ్ ఉంది. అంతా ఉంది. అర్జునుడు ఆలా భావిస్తున్నాడు, "నేను అదే అర్జునుడిని. నేను కురుక్షేత్ర యుద్ధంలో పోరాడిన అదే అర్జునుడిని. నేను గొప్ప యోద్ధుడిని అని పిలువబడ్డాను, నా విల్లు అదే విల్లు, నా బాణం అదే బాణం. కానీ ఇప్పుడు అది నిరుపయోగమైనది. నేను నన్ను రక్షించుకోలేకపోయాను.ఎందుకంటే కృష్ణుడి నుంచి విడదీయబడినందున కృష్ణుడు ఇక లేడు. "అందువలన అయిన కృష్ణుడి ఉపదేశాలను గుర్తుతెచ్చుకోవడం మొదలుపెట్టాడు కురుక్షేత్ర యుద్ధంలో అయినకి భోధించినవి.
కృష్ణుడు అయిన ఉపదేశాల నుండి భిన్నమైన వాడు కాదు. అయిన సంపూర్ణముగా ఉన్నాడు. అయిదు వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు చెప్పినది, ఆ ఉపదేశాలను మీరు అర్ధముచేసుకుంటే, మీకు వెంటనే వెంటనే కృష్ణుడినితో సంభందము ఏర్పడుతుంది. ఇది పద్ధతి. అర్జునుడిని చూడoడి. అయిన చెప్తాడు, evaṁ cintayato jiṣṇoḥ kṛṣṇa-pāda-saroruham. అయిన కృష్ణుడిని , అయిన యుద్ధభూమిలో ఇచ్చినట్టి ఉపదేశమును గురించి ఆలోచించినప్పుడు, తక్షణమే అయిన శాంతిని పొందాడు.. వెంటనే శాంతిముగా. ఇది పద్ధతి. కృష్ణుడితో శాశ్వతముగా సన్నిహిత సంబంధాము కలిగి ఉన్నాము , ఇది కృత్రిమము కాదు. మీరు కృష్ణుడినితో ఎల్లప్పుడూ సంబంధం కలిగివుంటే, ఇక కలతలు ఉండవు. శాంతముగా. Yaṁ labdhvā cāparaṁ lābhaṁ manyate nādhikaṁ tataḥ. మీరు ఆ పరిస్థితికి వస్తే, అది అత్యధిక ప్రయోజనము, అత్యధిక లాభం, Yaṁ labdhvā ca, అప్పుడు మీరు ఏ ఇతర లాభం కోసం ఆశ పడరు. నేను అత్యధిక లాభం పొందానని మీరు గ్రహించగలరు. Yaṁ labdhvā cāparaṁ lābhaṁ manyate nādhikaṁ tataḥ, yasmin sthitaḥ... మీరు ఆ స్థితిలో స్థిరపడితే, అప్పుడు guruṇāpi duḥkhena na ( BG 6.20-23) భారీ విపత్తులు ఉన్నా కూడా, మీరు కలత చెందరు. అది శాంతి. అది శాంతి. చిన్న గిల్లుడు వలన, మీరు కలత చెందటము కాదు. మీరు వాస్తవమునకు కృష్ణ చైతన్యము లో స్థిరపడి ఉంటే, మీరు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో కుడా కలత చెందరు. అది కృష్ణ చైతన్యము యొక్క పరిపూర్ణము. ధన్యవాదాలు.