TE/Prabhupada 0322 - మీ కర్మ ప్రకారం శరీరమును భగవంతుడు ఇచ్చినాడు



Lecture on SB 1.15.40 -- Los Angeles, December 18, 1973


మనకు దేవాదిదేవునిచే ఇవ్వబడినది, "ఇప్పుడు ఇది మీ అమెరికా, ఇది మీ భారతదేశం." కానీ అమెరికన్ లేదా భారతీయుడికి ఏది చెందదు. ఇది తండ్రికి, దేవాదిదేవుని చెందుతుంది. వారు ఆ చైతన్యమునకు రాకపోతే, "దేవుడు నాకు ఆనందించడానికి ఇచ్చాడు, ఇది నాది, కానీ నిజానికి ఇది దేవుడికి చెందినది ... " దీనిని కృష్ణ చైతన్యము అంటారు. దీనిని కృష్ణ చైతన్యము అంటారు.

కృష్ణ చైతన్యములో ఉన్నవారు , అర్ధము చేసుకుంటారు "ఏదీ నాకు చెందదు. ప్రతిది చెందుతుంది ... "Isavasyam idam sarvam yat kinca ( ISO mantra 1) చిన్న విషయము కూడా, అణువు అయిన, ఆది దేవుడికి చెందుతుంది. నేను యజమాని కాదు. ఈ భావమునకు మీకు వచ్చినట్లయితే, మీరు స్వేచ్ఛగా ఉంటారు. ఇది భగవద్-గీతలో చెప్పబడినది, mam ca yo '

mam ca yo 'vyabhicarena
bhakti-yogena sevate
sa gunan samatityaitan
brahma-bhuyaya kalpate
(BG 14.26)

బoధనము gunamayi maya, ప్రకృతి యొక్క గుణాత్మక గుణాలతో చుట్టబడి ఉన్నాది. ఇది బoధనము. కానీ ఒక వ్యక్తి భక్తియుక్త సేవలో వున్నట్లయితే, అయిన ఈ బoధనము క్రింద ఉండడు, ఎందుకంటే అయినకు విషయాలు యధాతదముగా తెలుసు. ... నేను విదేశీయుడిగా ఉన్నాను నేను ... నేను మీ దేశానికి వచ్చాను. నేను "ఈ దేశం నాది," అని చెప్పితే, అప్పుడు సమస్య ఉంటుoది. కానీ నేను ఒక సందర్శకుడిగా వచ్చానని లేదా ఒక విదేశీయుడిగా నేను ఇక్కడకు వచ్చానని గుర్తుంచుకుంటే, సమస్య ఉండదు. నేను స్వేచ్ఛగా తిరగవచ్చు. యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం యొక్క అన్ని సౌకర్యాలను నేను పొందగలను. ఏ ఇబ్బంది లేదు. అదేవిధంగా, ఈ భౌతిక ప్రపంచం లోపల, యాత్రికుడిగా మనము వచ్చాము, "ఈ భౌతిక ప్రపంచం నాకు చెందుతుంది" లేదా మనుష్యుల సమూహమునకు అని మనము చెప్పితే లేదా దేశముల సమూహమునకు దానిని అజ్ఞానం అంటాము .

అందువల్లన కృష్ణ చైతన్య ఉద్యమము అంటే ఈ అజ్ఞానాన్ని తీయటము, ప్రజలకు తెలివినిచ్చేలా, "ఏదీ నీకు చెందదు, అంతా దేవుడికి చెందుతుంది." ఇక్కడ సాదారణ పద్ధతి ఉన్నాది, త్యాగము, మహారాజు యుధిష్టర, అయిన ఇలా చెబుతున్నాడు ... ఎందుకంటే ఇప్పటికే నేను వివరించినట్లు, అహంకరా భావనలో మనం చాలా ఎక్కువగా నిమగ్నమయ్యము, నేను ఈ శరీరాన్ని ఈ శరీరంతో సంబంధంలో ఉన్నది ఏదైనా అది నాది. ఇది భ్రమ, మోహ. ఈ మోహా, భ్రాంతి అని పిలుస్తారు. Janasya moho 'yam. మోహ అంటే భ్రాంతి. ఇది భ్రమ. ఈ భ్రమ ఏమిటి? Aham mameti: ( SB 5.5.8) నేను ఈ శరీరం, ఏదైనా ఈ సంబంధంలో ఉన్నది అది నాది. దీనిని మోహా, భ్రాంతి అని పిలుస్తారు. శరీరాము కూడా అతనికి చెందదు, ఎందుకంటే మీ కర్మ ప్రకారం శరీరము దేవుడు ఇచ్చినవాడు. మీ చెల్లింపు ప్రకారం, భూస్వామి మీకు అపార్ట్మెంట్ ఇస్తాడు. అపార్ట్మెంట్ మీకు చెందదు. ఇది వాస్తావము. మీరు వారానికి $ 500 చెల్లిస్తే, మీరు చాలా మంచి, మంచి అపార్ట్మెంట్ ను పొందుతారు. మీరు $ 25 చెల్లించి ఉంటే, మీరు వేరేది పొందుతారు. అదేవిధంగా, ఈ వివిధ రకాల శరీరాలను మనము పొందాము ... మనము అందరము కలిగి ఉన్నాము, వివిధ రకాలున్నాయి. ఇది అపార్ట్మెంట్. వాస్తవానికి, ఇది అపార్ట్ మెంట్ ఎందుకంటే నేను ఈ శరీరం లోపల నివసిస్తున్నాను. నేను ఈ శరీరం కాదు. ఇది భగవద్గీత సూచన. Dehino 'smin yatha dehe ( BG 2.13) Asmin dehe, దేహి ఉన్నాడు, నివసిoచువాడు, యజమాని కాదు. నివసిoచువాడు. ఏ అపార్ట్మెంట్లోనైనా, ఎవరో నివసిస్తారు , యజమాని ఇంకా ఎవరో ఉంటారు అదేవిధంగా, ఈ అపార్ట్మెంట్, ఈ శరీరం. నేను ఆత్మను, నివసిస్తున్నాను. చెల్లింపు ప్రకారం లేదా కర్మ ప్రకారం నేను అద్దెకు తీసుకున్నాను.