TE/Prabhupada 0328 - ఈ కృష్ణ చైతన్య ఉద్యమము అన్నిటిని-ఆలింగనం చేసుకుంటుంది



University Lecture -- Calcutta, January 29, 1973


ఈ కృష్ణ చైతన్య ఉద్యమము అన్నిటిని-ఆలింగనం చేసుకుంటుంది. ఇది ప్రపంచంలోని అన్ని సమస్యలను పరిష్కరించగలదు - రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత సంభందించిన, ప్రతిదీ. ఇది అన్నిటిని ఆలింగనం చేసుకుంటుంది. నా అభ్యర్థన నేను ఇప్పుడు నా అమెరికన్ శిష్యులతో ఐరోపా శిష్యులతో పని చేస్తున్నాను. ఎందుకు భారతీయులతో చేయలేము? ఈ సమావేశంలో చాలామంది యువకులు, విద్యావంతులు, జ్ఞానవంతులైన పండితులు ఉన్నారు. ఈ ఉద్యమములో చేరండి, శ్రీ చైతన్య మహాప్రభు ఆజ్ఞ ప్రకారం,

bhārata-bhūmite manuṣya janma haila yāra
janma sārthaka kari' karo paropakāra
(CC Adi 9.41)

మొత్తం ప్రపంచమునకు సంక్షేమ కార్యక్రమాలను చేసే సమయం ఇది . వారు ప్రతిచోటా, గందరగోళములో ఉన్నారు. పాశ్చాత్య దేశాలలో, హిప్పీ ఉద్యమాలు ఉన్నాయి మీకు తెలుసు. హిప్పీలు అంటే ఏమిటి? వారు కూడా చదువుకున్నారు, చాలా గొప్ప సంపన్న కుటుంబముల నుండి కూడా వచ్చినవారు, కానీ వారు తమ తండ్రులు తాతలు ఇష్టపడిన మార్గాన్ని ఇష్టపలేదు. వారు తిరస్కరించారు. ప్రపంచవ్యాప్తంగా కృష్ణుడి సంస్కృతిని ప్రచారము చేయడానికి ఇది గోల్డెన్ అవకాశం. పాకిస్తాన్ మీ దేశం నుండి కొన్ని గజాల భూమిని తీసుకున్నందుకు మీరు విలపిస్తున్నారు, కానీ మీరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును వ్యాప్తి చేస్తే, మొత్తం ప్రపంచం హిందూస్థాన్ అవుతుంది. ఆటువంటి శక్తి ఉంది; నేను నా ప్రత్యక్ష అవగాహనను ఇస్తున్నాను. ప్రజలు దీని కోసము ఆకాంక్షిస్తున్నారు. నేను భారతదేశంలో ఉన్నాoత వరకు, ఆచరణాత్మకంగా నా సమయమును వృధా చేస్తుకున్నాను. భారతదేశం వెలుపల, ఈ ఉద్యమమును చాల తీవ్రముగా తీసుకున్నారు. ఎంతగా అంటే నా ఉద్యమములో ప్రతి భాగం సరిగ్గా ఉపయోగించబడుతోంది.

ఈ విశ్వవిద్యాలయానికి నేను వచ్చాను మీలో కొందరు వాస్తవమునకు బ్రాహ్మణులు అవ్వుతారని ఆశాతో. సంస్కృత విభాగం బ్రహ్మణుల కోసం ఉద్దేశించబడింది. Paṭhan pāṭhan yajana yājana dāna pratigraha. ఒక బ్రాహ్మణుడిని పండిత అని పిలుస్తారు. ఎందుకు? ఎందుకంటే ఒక బ్రాహ్మణుడు జ్ఞానము కలిగి ఉండాలి. బ్రాహ్మణుడిని అవివేకి అని పిలువరు. ఈ శాఖ, సంస్కృత శాఖ, బ్రాహ్మణుల కోసం ఉద్దేశించబడింది. నేను మీలో కొందరు ఈ ఉద్యమంలో చేరి , విదేశాలకు వెళ్లుతారు అని చైతన్య మహాప్రభు యొక్క ఈ ఉత్కృష్టమైన సంస్కృతిని ప్రచారము చేయండి. Pṛthivīte āche yata nagarādi grāma. గొప్ప అవసరం ఉంది. మనము చాలా ఆలయాలను ఏర్పాటు చేసాము, కానీ ఇప్పటికీ మనము దేవాలయాలను స్థాపించాల్సిన అవసరం ఉంది, రాధా-కృష్ణుడి ఆలయాలు, చైతన్య మహాప్రభు యొక్క దేవాలయం, ప్రతి గ్రామంలో, ప్రపంచంలోని ప్రతి పట్టణములో. ఇప్పుడు ప్రతి కేంద్రం నుండి, బస్సులలో భక్తులను పంపిస్తున్నాం. వారు లోపలికి వెళ్తున్నారు, ఐరోపా అమెరికా గ్రామాల్లోకి వెళుతున్నారు, వారిని చాలా బాగా అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్లో, వారు గ్రామ గ్రామానికి వెళ్తున్నారు. వారిని చాలా బాగా స్వాగతిస్తున్నారు. ఈ ఆచారం చాలా బాగుంది. క్రైస్తవ పూజారులు కూడా వారు ఆశ్చర్యపోతున్నారు. వారు ఆశ్చర్యపోతున్నారు. బోస్టన్లోని ఒక పూజారి, అయిన ఈ పాంప్లెట్ను విడుదల చేశాడు: "ఈ బాలురు, వారుమనఅబ్బాయిలే, క్రైస్తవులు యూదుల . ఈ ఉద్యమం ముందు, వారు చర్చిలకు రావటానికి పట్టించుకోలేదు. ఇప్పుడు వారు దేవుడి కోరకు పిచ్చివాళ్ళు అయ్యారు. "వారు ఒప్పుకుంటున్నారు. క్రిస్టియన్ పూజారి తరగతి వారు, మనకు వ్యతిరేకం కాదు. స్థిరమైన చిత్తం ఉన్నా వారు, "స్వామిజీ వాస్తవమైనది ఇస్తున్నారు" అని అంగీకరిస్తున్నారు . వారి తండ్రులు తాతలు నా దగ్గరకు వచ్చారు. వారు నమస్కరిస్తున్నారు. వారు చెప్తారు, "స్వామిజీ, మీరు మా దేశంలోకి రావడము అది మాకు గొప్ప అదృష్టము." నేను ఒంటరిగా పని చేస్తున్నాను, ఉద్యమం ప్రశంసలు అందుకుంది. ఈ యూనివర్సిటీ నుండి వ్యక్తులు, పండితులు ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని బోధిస్తుంటే ... ఇది దాని కోసం ఉద్దేశించబడింది. బ్రాహ్మణుడి యొక్క కర్తవ్యము ఇది. Brahmā jānāti. బ్రాహ్మణుడిని తెలుసుకోవాలి, బ్రహ్మ జ్ఞానాన్ని ప్రచారము చేయాలి. అది బ్రహ్మణాల కర్తవ్యము.