TE/Prabhupada 0329 - మీరు ఆవుని చంపినా లేదా కూరగాయలని చంపినా, పాపపు ప్రతిక్రియ ఉన్నది



Room Conversation -- April 23, 1976, Melbourne


మిస్టర్ డిక్సన్: మాంసం తినడం పై ఉన్న విమర్శ, అది ఇ కారణముగా వచ్చినదా జంతువులు ప్రాణము కలిగి ఉన్నాయి ...

ప్రభూపాధ: కూరగాయలు ప్రాణము కలిగి ఉన్నాయి

మిస్టర్ డిక్సన్: అవును. నేను అడుగుతున్నాను ఎందుకంటే? జంతువులు కూరగాయలు కంటే జీవితంలో అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నాయి ,

ప్రభుపాద: ప్రాధాన్యత అనేది లేదు. మన తత్వము మనము దేవుడి సేవకులము. దేవుడు తీసుకు౦టారు, అయిన విడిచిపెట్టిన ఆహారమును మనము తీసుకు౦టాము . భగవద్గీతలో ... మీరు ఈ శ్లోకముని కనుగొంటారు. Patraṁ puṣpaṁ phalaṁ toyaṁ yo me bhaktyā prayacchati ( BG 9.26) మీరు ఇక్కడకు వచ్చినట్లుగానే. తినదగినది మీకు ఏదైనా నేను ఇస్తే అడగటము నా కర్తవ్యము, మిస్టర్ నిక్సన్, మీరు తినడానికి ఇష్టపడే ఆహారము ఏమిటి? మీరు చెప్పుతారు, "నేను దీనిని చాలా ఇష్ట పడతాను అప్పుడు, నేను మీకు ఆ ఆహారాన్ని ఇస్తే, మీరు సంతృప్తి చెందుతారు మనము ఈ గుడిలోకి కృష్ణుడిని పిలిచాము, మనము ఎదురుచూస్తున్నాము, ఏ ఆహారమును అయిన తినాలని కోరుకుంటున్నాడు? అందువలన అయిన చెప్పాడు ...

గురు-కృపా: "ఎవరైనా నాకు ప్రేమతో, భక్తితో ఒక ఆకును, పువ్వును, పండును లేదా నీటిని అందించినట్లయితే, దానిని నేను అంగీకరిస్తాను."

ప్రభుపాద: Patraṁ puṣpaṁ phalam. . అయిన ప్రతి ఒక్కరూ ఇవ్వగలిగిన చాలా సులభమైన వాటిని అడుగుతున్నారు. కేవలము ఒక్క ఆకును , పత్రమును, ఒక చిన్న పువ్వును, పుష్పమును, కొద్దిగా పండును, కొద్దిగా ద్రవమును, నీరు లేదా పాలును గాని. మనము దాన్ని ఆర్పిస్తాము మనము పదార్ధాలతో విభిన్న రకాలను తయారుచేస్తాము, patraṁ puṣpaṁ phalaṁ toyam ( BG 9.26) కృష్ణుడు తిన్నా తర్వాత, మనము తీసుకుంటాము. మనము సేవకులము. మనము కృష్ణుడిచే వదిలేసిన ఆహార పదార్థామును, ప్రసాదమును తీసుకుంటాం. మనము శాఖాహారి లేదా మంసాహరిమి కాదు. మనము prasād-ian. మీరు ఆవుని చంపినా లేదా కూరగాయలని చంపిన, పాపము చేసినట్లే. కూరగాయలా, కాదా అనేది కోసం మనము పట్టించుకోము. ప్రకృతి చట్టం ప్రకారం, ఇది చెప్పబడినది జంతువులు, చేతులు లేనివి , ఆది చేతులు ఉన్నా జంతువులకు ఆహారం. మనము చేతులు ఉన్నా జంతువులము. మనము మానవులము, మనం కూడా చేతులు కలిగిన జంతువులము , అవి జంతువులు - ఏ చేయి లేదు కానీ నాలుగు కాళ్ళు ఉన్నాయి. ఏ కాలు లేని జంతువులు ఈ కూరగాయలు. Apadāni catuṣ-padām. ఎటువంటి కాలు లేని ఈ జంతువులు, అవి నాలుగు కాళ్ళు ఉన్నా జంతువులకు ఆహారం. ఆవు గడ్డిని తింటున్నట్లు, మేక గడ్డిని తింటుంది. కూరగాయల తినడము వలన, ఏ కీర్తి లేదు అప్పుడు మేకలు ఆవులు మరింత కీర్తి కలిగి ఉండాలి, మరింత కీర్తి కలిగి ఉండాలి, ఎందుకంటే అవి కూరగాయలు తప్ప మరి దేనిని తాకవు. మేము మేకలుగా ఆవులుగా మారమని ప్రచారము చేయటము లేదు. లేదు. మీరు కృష్ణుడి యొక్క సేవకునిగా ఉoడమని మనము ప్రచారము చేస్తున్నాము. కృష్ణుడు ఏదైతే తింటాడో, మనము దానిని తినవచ్చు. కృష్ణుడు "నాకు మాంసం ఇవ్వండి, నాకు గుడ్లు ఇవ్వండి" అని చెప్పితే మనము కృష్ణుడికి మాంసం గుడ్లు అర్పించి మనము దానిని తీసుకుంటాము. మనం శాఖాహారి, మంసాహరి అని అనుకోవద్దు. కాదు ఇది మన తత్వము కాదు. ఎందుకంటే మీరు కూరగాయలను తీసుకోవడం లేదా మాంసం తీసుకోవడం వలన మీరు చంపుతున్నారు. మీరు చంపాలి ఎందుకంటే లేకపోతే మీరు జీవించలేరు. అది ప్రకృతి యొక్క మార్గం.

మిస్టర్ డిక్సన్: అవును.

ప్రభుపాద: మన విధానము అది కాదు. మిస్టర్ డిక్సాన్: సరే, ఎందుకు మీరు విమర్శ చేస్తారు?

ప్రభుపాద: ఈ విధంగా విమర్శ ఉండటం, మాంసం తినకూడదు అని, ఎందుకంటే ఆవు రక్షణ అవసరము. మనకు పాలు అవసరం. పాలను తీసుకోవటానికి బదులుగా, మనము ఆవులను తిoటు ఉంటే, అప్పుడు పాలు ఎక్కడ నుండి వస్తాయి

మిస్టర్ డిక్సన్: పాలు చాలా ముఖ్యం.

ప్రభుపాద: చాలా, చాలా ముఖ్యమైనవి.

మిస్టర్ డిక్సన్: ప్రపంచములో ఆహార ఉత్పత్తి కోరకు, ప్రపంచం మెరుగైనదిగా ఉంటుంది జంతువులను తినకుండా ఉంటే .

ప్రభుపాద: కాదు, పాలు అవసరం. కొన్ని కొవ్వుతో కూడిన విటమిన్ల ఆహారము అవసరం. ఆ అవసరమును పాలు సరఫరా చేస్తుంది. అందువలన ప్రత్యేకంగా ...

మిస్టర్ డిక్సన్: మీరు ధాన్యాల నుండి మీకు అవసరమైనవి అన్ని పొందలేరా?

ప్రభుపాద: ధాన్యాలు, లేదు. ధాన్యాలు, అవి పిండిపదార్థం. వైద్య విజ్ఞానం ప్రకారం, మనకు నాలుగు వేర్వేరు గ్రూపులు అవసరమవుతాయి: పిండి పదార్ధాము, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు కొవ్వు. అది పూర్తి ఆహారం. అందువల్ల మీరు బియ్యం, పప్పు - కాయ ధాన్యములు, గోధుమలు తినడం ద్వారా మీరు వీటిని పొందవచ్చు. పప్పులు గోధుమలలో ప్రోటీన్ ఉంటుంది. పాలు కూడా ప్రోటీన్ కలిగి ఉంది. మనకు ప్రోటీన్ అవసరం . మనము పాలు నుండి కొవ్వు పొందుతాము. కొవ్వు అవసరం. కూరగాయలు, కార్బోహైడ్రేట్; ఆహార ధాన్యం, పిండి పదార్ధాలు. మీరు ఈ పదార్ధాలతో మంచి ఆహార పదార్థాన్ని సిద్ధం చేస్తే, మీకు కావలిసినది పూర్తిగా పొందుతారు. కృష్ణుడికి అర్పించండి, అది పవిత్రము అవుతుంది. అప్పుడు మీరు పాప కార్యక్రమములన్నిటి నుండి స్వేచ్ఛను పొందుతారు. లేకపోతే, మీరు కూరగాయలను చంపినప్పటికీ, అది పాపం అవుతుంది, ఎందుకంటే దానికి ప్రాణము ఉన్నాది. మరొక ప్రాణిని చంపడానికి మీకు హక్కు లేదు. కానీ మీరు జీవితములో జీవించాలి. ఇది మీ పరిస్థితి. అందువల్ల మీరు ప్రసాదం తీసుకోవటము పరిష్కారము. కూరగాయలు లేదా మాంసం తినడం ద్వారా పాపం ఉంటే అది తినేవాడికి వెళ్తుంది. మనము ప్రసాదమును తీసుకుంటాము, అంతే.