TE/Prabhupada 0356 - మనము చపలముగా పనిచేయడం లేదు. మనము ప్రామాణికమైన శాస్త్రము నుండి తీసుకుంటున్నాము



Lecture at World Health Organization -- Geneva, June 6, 1974


ప్రభుపాద: ఎవరూ నిరుద్యోగులు లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వ నిది. ఆది మంచి ప్రభుత్వం. ఎవరూ నిరుద్యోగులు కారు. అది వేదముల పద్ధతి. సమాజం నాలుగు విభాగాలుగా విభజించబడింది: బ్రాహ్మణుల, క్షత్రియులు, వైశ్యులు, శుద్రులు. అది ప్రభుత్వాము లేదా రాజు యొక్క కర్తవ్యముగా ఉంది, బ్రాహ్మణుడు బ్రహ్మణుడి యొక్క కర్తవ్యము చేస్తున్నాడా లేదా అని, క్షత్రియుడు యొక్క కర్తవ్యమును, 'క్షత్రియుడు, ఆతని కర్తవ్యం క్షత్రియుని యొక్క కర్తవ్యము. అదేవిధంగా, వైశ్య ... ఎందుకు ప్రజలు నిరుద్యోగులుగా ఉన్నారో చూసే బాధ్యత ప్రభుత్వనిది . అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది.

అతిధి: కానీ ప్రభుత్వంలో కూడ అదే వ్యక్తులు ఉన్నారు.

ప్రభుపాద: ఎహ్?

అతిథి: వారు కూడా ... పాతుకు పోయినారు , సంపదను కలిగిన వారు, భూస్వాములు, వారు కూడా ప్రభుత్వంలో బలమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నారు.

ప్రభుపాద: కాదు. ఆoటే, చెడ్డ ప్రభుత్వం అని అర్థం.

అతిథి: అవును. ఇది వాస్తవము.

ప్రభుపాద: ఇది చెడ్డ ప్రభుత్వం. లేకపోతే, ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేస్తున్నట్లు చూడాడము ప్రభుత్వం యొక్క బాధ్యత .

అతిధి: నేను, కృష్ణ చైతన్యం ఉద్యమం, ఏదో ఒక రోజు, నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడు సమాజం యొక్క ముఖం మార్చగలిగే ఒక వాస్తవమైన విప్లవాత్మక ఉద్యమం అవ్వుతుంది అని.

ప్రభుపాద: అవును. నేను విప్లవాన్ని తెస్తుంది అని అనుకు౦టున్నాను, ఎందుకంటే అమెరికన్ యూరోపియన్ యువకులు, వారు చేతిలోకి తీసుకున్నారు. నేను వారికి పరిచయం చేశాను. నేను ఐరోపా అమెరికన్ అబ్బాయిల నుండి ఆశిస్తున్నాను, వారు చాలా తెలివైనవారు, వారు ఏదైనా చాలా తీవ్రంగా తీసుకుంటారు. అందువలన... ఇప్పుడు మనము కొన్ని సంవత్సరాలుగా, ఐదు, ఆరు సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. అయినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉద్యమమును మనము విస్తరించాము. నేను అభ్యర్థిస్తున్నాను ... నేను వృద్ధుడను. నేను చనిపోతాను. వారు తీవ్రంగా తీసుకుంటే, అది కొనసాగుతుంది, అప్పుడు విప్లవం ఉంటుంది. మనము చపలముతో, నియమములు లేకుండా పనిచేయడం లేదు కనుక మనము చపలము పనిచేయడం లేదు. మనము ప్రామాణికమైన శాస్త్రము నుండి తీసుకుంటున్నాము మనము ప్రామాణికమైన శాస్త్రము నుండి తీసుకుంటున్నాము. మనము ...మన కార్యక్రమము, ఈ పరిమాణం గల వంద పుస్తకాలను కనీసం ప్రచురించడము. చాలా సమాచారం ఉంది. వారు ఈ పుస్తకాలను చదివి సమాచారం తీసుకోగలరు. ఇప్పుడు మనల్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో, కళాశాలలో విశ్వవిద్యాలయాలలో ఉన్నత స్థానములో ఉన్నా వ్యక్తులు, వారు ఇప్పుడు ఈ పుస్తకాలను చదువుతున్నారు, వారు అభినందిస్తున్నారు. మనము మన శక్తీ కొలది ప్రయత్నిస్తున్నాము. మన సాహిత్యాన్ని పరిచయం చేస్తున్నాము, సాధ్యమైనంతవరకు ఆచరణాత్మకంగా పని చేస్తున్నాము, ప్రచారము చేస్తున్నాము. కానీ నేను, ఈ అబ్బాయిలు, యువకులు, చాలా తీవ్రంగా తీసుకుంటే, అది విప్లవాన్ని తెస్తుంది.