TE/Prabhupada 0357 - నేను ఒక విప్లవాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను దేవుడులేని నాగరికతకు వ్యతిరేకంగా



Morning Walk -- December 11, 1973, Los Angeles


ప్రభుపాద: నా ఆరోగ్యం ఎప్పుడూ సరిగ్గా ఉండటము లేదు. అయినా, నేను ఎందుకు ప్రయత్నిస్తున్నాను? అది నా ఆశయం. నేను ఒక విప్లవాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. వారి దేవుడులేని నాగరికత, దేవుడులేని నాగరికతకు వ్యతిరేకంగా . అది నా ఆశయం. అమెరికా ఈ శ్రేణిలో విద్యాభ్యాసం తీసుకోని, నాయకత్వము వహించడానికి ఉత్తమ వ్యక్తిగా ఉంటుంది, నాయకులు కావాటానికిని. వారు ఇప్పటికే నాయకులు, కానీ వారు ఇప్పుడు వాస్తవమైన నాయకుడిగా ఉండాలి, తద్వారా మొత్తం ప్రపంచం సంతోషంగా ఉంటుంది. దానికి నేను దర్శకత్వం ఇవ్వగలను. ఉన్నత స్థానములలో ఉన్నా అమెరికన్ మనుషులు నా దగ్గరకు వచ్చినట్లయితే, వారు ప్రపంచ నాయకుడిగా ఎలా మారవచ్చనే దానికి దిశను నేను వారికి ఇవ్వగలను. వాస్తవ నాయకుడు, బూటకపు నాయకుడు కాదు. ఎoదుకoటే దేవుడు వారిని ఎoపిక చేసుకున్నాడు, ఎన్నో విషయాలు. ఈ ఉద్యమం అమెరికా నుండి ప్రారంభించబడింది. నేను న్యూయార్క్ నుండి ఈ ఉద్యమాన్ని ప్రారంభించాను. కావునా ప్రభుత్వం దీనిని చాలా తీవ్రంగా తీసుకోవాలి. (విరామం)

హృదయనాందా: మీరు అమెరికా చాలా ముఖ్యం అని చెప్తున్నారా?

ప్రభుపాద: అవును.

హృదయనాందా: మీరు అనుకుంటారా ...

ప్రభుపాద: అందువల్లనే నేను మీ దేశంలోకి వచ్చాను ...

హృదయనాందా: బహుశా ...

ప్రభుపాద: ... ఎందుకంటే మీరు చాలా ముఖ్యమైనవారు. ఇప్పుడు మీరు తప్పక ... నా మార్గదర్శకంలో మీరు తప్పనిసరిగా ముఖ్యమైన వారుగా ఉండవలెను, అప్రామానికముగా కాదు.

హృదయనాందా: బహుశా నేను ఇక్కడే ఉండి ప్రచారము చేయాలి.

ప్రభుపాద: ah?

హృదయనాందా: ఇది చాలా ముఖ్యమైనది అయితే, నేను బహుశా ఇక్కడ ఉండాలని అనుకుంటున్నాను రుపానుగకు సహాయం చేయటానికి.

ప్రభుపాద: అవును. మీ మొత్తం దేశమును, దేవుడి చైతన్యములోకి మార్చండి, ఎందుకంటే వారు రాజ్యాంగములో ప్రకటించారు, "దేవుడుని మనము విశ్వసిస్తున్నాము." ఇప్పుడు వారు చాలా తీవ్రంగా తీసుకోవాలి. "దేవుడు" అంటే ఏమిటి? "నమ్మడము" అంటే ఏమిటి? మీరు ఈ ప్రచారాన్ని తీసుకోండి. వాస్తవానికి మనము చేస్తున్నాం. మనము దేవుణ్ణి నమ్ముతాము; మనము దేవుడు కోసం మన మొత్తం జీవితాన్ని త్యాగము చేసాము. ఇది దేవుడు మీద నమ్మకం. పార్లర్ లో ధూమపానం చేయటము మరియు, మీరు దేవుడిని నమ్మటము కాదు. అలాంటి నమ్మడము కాదు. వాస్తవముగా నమ్మడము.