TE/Prabhupada 0367 - కృష్ణుడు, వృందావనము అంటే కృష్ణుడు కేంద్రం
Lecture on BG 7.1 -- Bombay, December 20, 1975
కృష్ణుడు తనను అర్థం చేసుకోవడానికి వ్యక్తిగతంగా భగవద్గీతను ఉపదేశిస్తున్నాడు, మనం ఈ ప్రయోజనాన్ని పొందాలి, లేకుంటే ఈ మానవ జీవితము యొక్క ఈ అవకాశాన్ని కోల్పోతాము. కృష్ణుడు కొన్ని పిల్లులు కుక్కలకు భగవద్గీత ప్రచారము చేయటం లేదు. అయిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తికి బోధిస్తున్నాడు, imaṁ rājarṣayo viduḥ. భగవద్గీత రాజర్షి కోసం, చాలా ధనిక, సంపన్నమైన, అదే సమయంలో సాధువు అయిన వ్యక్తులకు. పూర్వం రాజులు అందరు రాజర్షులు. రాజు మరియు ఋషి ఇద్దరు కలిపి. అందువల్ల భగవద్గీత అనేది సోమరుల తరగతికి ఉద్దేశించినది కాదు. ఇది సమాజం యొక్క నాయకులు అర్ధం చేసుకోవాలి: yad yad ācarati śreṣṭhas tat tad evetaro janaḥ ( BG 3.21) సమాజ నాయకులము అని చెప్పుకునే వారు , వారు భగవద్గీతను నేర్చుకోవాలి, ఎలా ఆచరణాత్మక వాస్తవ నాయకుడు కావాలి, అప్పుడు సమాజం ప్రయోజనము పొందుతుంది. మనము భగవద్గీతలో కృష్ణుడి ఆదేశాలను అనుసరిస్తే, అప్పుడు అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఇది ఒక వర్గపు మతపరమైన మూఢ విశ్వాసము లేదా మూఢత్వం కాదు. అది కాదు. ఇది శాస్త్రం - సామాజిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, సాంస్కృతిక విజ్ఞాన శాస్త్రం. అంతా ఉంది.
మా అభ్యర్థన ఏమిటి అంటే మీరు ప్రతి ఒక్కరు గురువు అవ్వండి. ఇది చైతన్య మహాప్రభు యొక్క ఉత్తర్వు. ప్రతిఒక్కరూ గురువుగా అవ్వాలని అయిన కోరుకున్నారు. ఎలా? అతను చెప్తాడు:
- yāre dekha tāre kaha 'kṛṣṇa'-upadeśa
- āmāra ājñāya guru hañā tāra' ei deśa
- (CC Madhya 7.128)
ఇది గురువు. మీరు కుటుంబ సభ్యులు అని అనుకుoదాము. చాలా జీవులు,మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ కోడలు, లేదా పిల్లలు, మీరు వారి గురువు కావచ్చు. సరిగ్గా ఇలాగా సాయంత్రం కూర్చుని భగవద్గీత గురించి మాట్లాడవచ్చు, yāre dekha tāre kaha kṛṣṇa-upadeśa ( CC Madhya 7.128) మీరు దేనినీ తయారు చేయవలసిన అవసరము లేదు. ఆదేశం ఉంది; మీరు కేవలం తిరిగి చెప్పి, వారిని శ్రవణము చేయనివ్వండి - మీరు గురువు అవుతారు. ఇది కష్టం కాదు. అది మన ప్రచారము. మనము ఒంటరిగా గురువు కావాలని కోరుకోవడం లేదు, కాని మనము ఎ విధంగా ప్రచారము చేస్తే ప్రతి ఒక్కరు, ముఖ్య వ్యక్తి, లేదా ఏ వ్యక్తి అయినా, అయిన తన చుట్టుప్రక్కల గురువు అవుతాడు. ఎవరైనా దానిని చేయగలరు. ఒక కూలీ కూడా, అయిన కూడా, అయినకు కుటుంబం ఉన్నాది. , అయినకు స్నేహితులు ఉన్నారు, అయిన నిరక్షరాస్యుడు అయినప్పటికీ, అయిన కృష్ణుడి ఉపదేశము వినవచ్చు, అయిన దానినే ప్రచారము చేయవచ్చు. మనకు ఇది కావాలి. మనం గౌరవనీయులైన మనుష్యులను, నాయకులను ఆహ్వానిస్తున్నాము. ఇది చాలా సులభం: man-manā bhava mad-bhakto mad-yājī māṁ namaskuru ( BG 18.65) కృష్ణుడి ఈ ఉత్తర్వును అమలు చేయడం ద్వారా, అయిన హామీ ఇస్తున్నాడు mām evaiṣyasi, "నీవు నా దగ్గరకు రావచ్చు." Yad gatvā na nivartante tad dhāma paramaṁ mama ( BG 15.6) Tyaktvā dehaṁ punar janma naiti mām eti kaunteya ( BG 4.9) చాలా సులభమైన విషయము
అందువల్ల మన అభ్యర్థన సమాజంలోని నాయకులు భగవద్-గీత ఉపదేశములను చాలా తీవ్రంగా చేపట్టాలి, తనకు తాను నేర్చుకొని, ఇతరులకు ప్రచారము చేయాలి. ఆది కృష్ణ చైతన్య ఉద్యమం. ఇది చాలా కష్టము కాదు; ఇది చాలా సులభం. ప్రతి ఒక్కరూ దానిని చేయగలరు. కానీ మీకు అర్ధమైన వెంటనే ప్రజలు కృష్ణుడిని అర్థం చేసుకుంటారు, janma karma ca me divyaṁ yo jānāti tattvataḥ ( BG 4.9) కృష్ణుడి అర్థం చేసుకున్న ఎవరైనా, ఫలితం tyaktvā dehaṁ punar janma naiti... ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత అతడు ఏ ఇతర భౌతిక శరీరాన్ని అంగీకరించడు. అయిన తన ఆధ్యాత్మిక గుర్తింపులో ఉంటాడు కృష్ణుడి సమాజాన్ని ఆనందిస్తాడు. ఇది వృందావనము. గోపీజన-వల్లభ. కృష్ణడు ... కృష్ణుడు, వృందావనా అంటే కృష్ణుడు కేంద్రం. అతను అందరిచే ప్రేమించ బడేవాడు. గోపీకలు, గోప బాలురు, దూడలు, ఆవులు, చెట్లు, పండ్లు, పువ్వులు, తండ్రి, తల్లి - ప్రతి ఒక్కరూ కృష్ణుడికి ఆకర్షించ బడ్డారు. ఇది వృందావనము. ఇది ప్రతిరూపం, ఈ వృందావనా, వాస్తవమైన వృందావనము ఉంది. ఇది కూడ వాస్తవము. సంపూర్ణములో వ్యత్యాసం లేదు. కానీ మన అవగాహనకు వాస్తవ వృందావనము ఉంది,
- cintāmaṇi-prakara-sadmasu kalpa-vṛkṣa-
- lakṣāvṛteṣu surabhīr abhipālayantam
- lakṣmī-sahasra-śata-sambhrama-sevyamānaṁ
- govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
- (Bs. 5.29)
- veṇuṁ kvaṇantam aravinda-dalāyatākṣaṁ
- barhāvataṁsam asitāmbuda-sundarāṅgam
- kandarpa-koṭi-kamanīya-viśeṣa-śobhaṁ
- govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
- (Bs. 5.30)
ఇది వివరణ, గోలోక వృందావనము యొక్క.