TE/Prabhupada 0373 - భజాహురేమనా పాటకు భాష్యము



Purport to Bhajahu Re Mana -- The Cooperation of Our Mind


Bhajahū re mana śrī-nanda-nandana-abhaya caraṇāravinda re. ఈ పాటను గోవింద దాస పాడినారు, కవి గోవింద దాస పాడిన పాట. ఆయన తన మనస్సును ఉద్దేశించి మాట్లాడు తున్నాడు ఎందుకంటే, ఏమైనప్పటికీ, మన మనస్సు యొక్క సహకారంతో మనము పనిచేయలి. మన మనస్సు కలత చెందితే, మన మనస్సు వేరే వాటిని ఎన్నుకోవడానికి లాగుతూవుంటే, అప్పుడు ఒక పని మీద దృష్టి పెట్టడం చాలా కష్టము. అది ఆచరణాత్మకమైనది. అందువల్ల యోగ పద్ధతి అంటే మనస్సును నియంత్రించడము. మనస్సును నియంత్రించే విధానము యాంత్రిక పద్ధతి. మనస్సును నియంత్రించకుండా, మనస్సులో కలతలు లేకుండ ఉండకపోతే, ఎవరూ ఆధ్యాత్మిక మార్గములో పురోగతిని సాధించలేరు. మన వైష్ణవ పద్ధతి మనస్సును నేరుగ భక్తియుక్త సేవలో నిమగ్నం చేయడము, అది భక్తియుక్త సేవ యొక్క పరిధుల వెలుపలకు వెళ్లకపోవచ్చు. అది మన పద్ధతి. ఆచరణాత్మకముగా ఉంది. కృష్ణుడి యొక్క కమల పాదములపై మన మనస్సు నిమగ్నము చేస్తే, arcanam śravaṇaṁ kīrtanaṁ viṣṇoḥ, smaraṇaṁ pāda-sevanam ( SB 7.5.23) Pāda-sevanam, అప్పుడు సహజముగా మనస్సు నియంత్రించబడుతుంది. యోగులు మనసును నియంత్రించడానికి కృత్రిమముగా ప్రయత్నిస్తున్నారు, కానీ వారు విఫలమౌతున్నరు. గొప్ప, గొప్ప యోగులు విఫలమయిన ఉదాహరణలు ఉన్నాయి. కృత్రిమముగా చేసినది ఏదైన సంపూర్ణముగా చేయడానికి సాధ్యం కాదు. మనస్సును నియంత్రించే పద్ధతి అంటే మనస్సుకు ఉన్నతమైన సేవను ఇవ్వడము అప్పుడు మనస్సు న్యూన శక్తికి ఆకర్షించబడదు. ఇది విజయ రహస్యము లేదా శాస్త్రము .

గోవింద దాస కృష్ణుడి యొక్క కమల పాదాలపై మనస్సును లగ్నము చేయటానికి ప్రయత్నిస్తున్నారు, దీనిని abhaya-caraṇa అని పిలుస్తారు. Abhaya అంటే "ఎక్కడైతే భయం లేదో" అని అర్ధం. మనము నమ్మకమైన బ్యాంకులో మన డబ్బుని జమ చేస్తాము, నష్టపోతాము అనే భయము ఉండదు అని మనము భావిస్తాము. అది abhaya అని పిలువబడుతుంది, "ఏ భయమూ లేకుండ" caraṇa "కమల పాదములు" అని అర్ధం. గోవింద దాస తన మనస్సుకు సలహా ఇస్తున్నాడు,hū re mana "నా ప్రియమైన మనస్సా," hū re మనస్సుకు ప్రచారము చేస్తున్నాడు. Bhaja hū re mana. Bhaja. Bhaja అనగా "భక్తియుక్త సేవలో నిమగ్నమవ్వటము." Bhaja hū re mana śrī-nanda-nandana, "కృష్ణుడి సేవలో, నంద కుమారుడు." అనేకమంది , అనేక కృష్ణులు ఉన్నారు, కాని మనము ప్రత్యేకముగా ఈ కృష్ణుడితో సంబంధము కలిగి ఉన్నాము. నంద మహరాజు యొక్క కుమరుడిగా వాసుదేవుని కుమరుడిగా జన్మించినారు. అందువలన ఆయన ప్రత్యేకముగా చెప్పారు ... మనము ఒక వ్యక్తిని గుర్తిస్తాము, ఆయన పేరు, ఆయన తండ్రి పేరు, అప్పుడు అది పరిపూర్ణముగా గుర్తించబడ్డినట్లు. కావున ఆయన చెప్పారు śrī nanda-nandana; bhajahū re mana śrī-nanda-nandana abhaya-caraṇāravinda re, తన కమల పాదములు ఆశ్రయం తీసుకోవటానికి సురక్షితమైనవి. భాగవతములో అనేక శ్లోకాలు ఉన్నాయి: Samāśritā ye pada-pallava-plavam mahat-padaṁ puṇya-yaśo murāreḥ. Mahat-padam, "కృష్ణుడి కమల పాదముల నందు, మొత్తం భౌతిక సృష్టి ఆధారపడి ఉన్నాది." అటువంటి అతిగొప్ప సృష్టి ఆధారపడి ఉంటే, నేను అత్యంత అల్పమైన చిన్నజీవిని, నేను కృష్ణుడి కమల పాదముల వద్ద ఆశ్రయం తీసుకుంటే, అవి భయము లేనివి, అప్పుడు నా భద్రత హమీ ఇవ్వబడుతుంది. Bhajahū re mana śrī-nanda-nandana, abhaya caraṇā-ravinda re, durlabha mānava-janama sat-saṅge, taroho e bhava-sindhu re. Durlabha, "చాల ఆరుదుగా ఈ మానవ జీవితం వస్తుంది." Durlabha mānava-janama. కృష్ణుడి కమల పాదములు పై మన మనస్సును ఉంచుకోవటానికి, భక్తుల సాంగత్యములో మనం జీవించ వలసిన అవసరం ఉంది. Durlabha mānava-janama sat-saṅge. Sat-saṅge అంటే "భక్తుల సాంగత్యములో." భక్తుల సాంగత్యములో మనం జీవించకపోతే, మనము కృష్ణుడి యొక్క కమల పాదములపై మన మనస్సును స్వతంత్రముగా లగ్నము చేయడానికి ప్రయత్నిస్తే, అది సాధ్యం కాదు. అది వైఫల్యం అవుతుంది. అందువల్ల ఆయన sat-saṅge "భక్తుల సాంగత్యములో అని చెప్పుతున్నారు. Taroho e bhava-sindhu re "జీవితం యొక్క నిజమైన ప్రయోజనము అజ్ఞాన సముద్రమును దాటి వెళ్ళడము భక్తుల సాంగత్యములో కృష్ణుడి కమల పాదములపై మన మనస్సును నిమగ్నము చేసుకుంటే, అప్పుడు మనము చాల సులభముగా, సులభముగా అజ్ఞాన సముద్రమును, భౌతిక స్థితిని దాటవచ్చు.

అప్పుడు నా ప్రస్తుత కర్తవ్యము ఏమిటి? ఇప్పుడు నా ప్రస్తుత కర్తవ్యము ఏమిటి? : śīta ātapa bāta bariṣaṇa, e dina jāminī jāgi re. నేను భౌతికముగా నిమగ్నమై ఉన్నప్పుడు "నేను తీవ్రమైన చలిని పట్టించుకోను, నేను కాలుస్తున్న వేడిని పట్టించుకోను, నేను రాత్రిపూట నిద్ర కోసం పట్టించుకోను; నేను కష్టపడి పగలు రాత్రి పని చేస్తున్నాను. " Śīta ātapa bāta bariṣaṇa, e dina jāminī jāgi re. దేని కోసము? Kṛpaṇa, bhipale sevinu kṛpaṇa durajana, "kṛpaṇa dura-jana సేవ కోసం." Kṛpaṇa durajana అంటే బయటవారు. భౌతిక సమాజము, స్నేహం, ప్రేమ, మొదలైనవి అని పిలవబడే, అవి అన్నీ బయటవారు. వారు నాకు వాస్తవమైన ఆధ్యాత్మిక పురోగతిని ఇవ్వలేరు. కానీ మనము సమాజం, స్నేహం లేదా ప్రేమ, జాతీయతావాదము, సమాజవాదము, చాలా వాటి సేవలో నిమగ్నమై ఉన్నప్పుడు. మనకు పనులు చాలా ఉన్నాయి,కానీ అది biphale. biphale అంటే "ఫలితమే లేకుండ." ఫలితముగా నేను ఒక నిర్దిష్టమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటాను, దేశం, సమాజం, కుటుంబం అని పిలవబడే వాటిని రక్షించుకోవడానికి మరణం సమయంలో నా మనస్తత్వం ప్రకారము ఒక శరీరమును అంగీకరించవలసి ఉంటుంది. ప్రజలు చాల హేయమైన పద్ధతులను అంగీకరిస్తున్నారు సమాజం, స్నేహం ప్రేమ అని పిలవబడే ఈ పనులను కొనసాగించడానికి, ఫలితముగా ఆయన నిర్దిష్టమైన మానసిక స్థితిని అభివృద్ధి చేసుకుంటున్నాడు, అది మానవత్వము కాదు ఫలితముగా ఆయన ఆ మనస్తత్వం ప్రకారము, తదుపరి జీవితములో శరీరమును అంగీకరించవలసి వస్తుంది. అందువలన kṛpaṇa durajana. Kṛpaṇa అంటే "లోభి". వారు నాకు ఏ విధమైన బుద్ధిని, జ్ఞానోదయమును , నా వాస్తవమైన జీవిత అవసరమునకు ఇవ్వరు కానీ అప్పటికీ మనము అలాంటి దుర్జనుడి సేవలో నిమగ్నమై ఉంటాము, "బయట వారు." Biphale sevinu kṛpaṇa durajana, capala sukha-laba lāgi' re, అక్కడ చిన్న ఆనందము ఉంది. లేకపోతే, ఒక మనిషి అయినా ఎలా కష్టపడి పగలు రాత్రి పని చేస్తాడు. ఆ ఆనందం మైథున ఆనందం, చపల, "మిణుకు మిణుకుమనేది." విద్యాపతి పాడుతున్నారు, tatala saikate vari bindu-sama, ఆ ఆనందం ఉదాహరణకు ఎడారిలో నీళ్ళ చుక్క వలె ఉంటుంది. ఎడారికి నీళ్ళు అవసరమవుతాయి, కానీ మీరు కొద్దిగా నీటిని తీసుకొని దానిపై చల్లుతూ ఉంటే, "ఇప్పుడు నీళ్లు తీసుకో", ఆ నీటి వలన విలువ ఏమి ఉంటుంది? అదేవిధంగా, మనము శాశ్వతమైన ఆనందం కోసము కాంక్షిస్తున్నాము, ఈ సమాజం, స్నేహం ప్రేమ మనకి ఏమి ఇస్తుంది? అందువల్ల మనము సంతోషాన్ని పొందుటకు మన సమయాన్ని వృధా చేస్తున్నాము భౌతిక జీవితపు విధానము అని పిలువ బడే దాని కొరకు, సమాజమును, స్నేహమును, మరి ఎన్నో వాటి కోసము, కేవలం వృధా చేస్తున్నాము. Biphale. Biphale. అంటే "ఏ మంచి ఫలితము లేకుండ." Biphale sevinu kṛpaṇa durajana, capala sukha-laba lāgi' re. ఫరవాలేదు, నేను వ్యక్తిగతముగా ఆనందిస్తాను. నేను యవ్వన జీవితమును కలిగి వున్నాను, నేను డబ్బును సంపాదిస్తాను, నా కుటుంబమును నేను పట్టించుకోను. " వాస్తవానికి ఇది ప్రస్తుత క్షణములో జరుగుతోంది. ఎవరూ కుటుంబమును పట్టించుకోరు, కానీ అయినా తనను తాను పోషించుకోవాడానికి మాత్రమే బిజీగా ఉంటాడు, తన యవ్వన జీవితమును ఉపయోగించుకోవటానికి, మరియు చాల విషయములు ఉన్నాయి . ... గోవింద దాస కవి సలహా ఇస్తున్నాడు, "నా ప్రియమైన మనస్సా, ఇప్పుడు మీరు యవ్వన జీవితమును పొందారు, మీరు ఆనందించవచ్చు." అందువల్ల, నీవు అంటున్నావు dhana yaubana putra parijana, ithe ki āche paratīti re ఈ సంపదను కూడపెట్టుకోవడము: డబ్బు సంపాదించడము; ఈ యవ్వన జీవితమును ఆనందించడము. E dhana yaubana putra parijana, సమాజము ద్వారా, స్నేహం మరియు ప్రేమ వలన మీకు ఏమైన వాస్తవమైన ఆనందం లేదా ఆధ్యాత్మికమైన ఆనందం ఉందా? Ithe ki āche paratīti re. ఇది కమలపు ఆకు మీద నీరు లాగ ఉంటుంది. Kamala-dala-jala, jīvana ṭalamala. ఇది, నీరు యొక్క ఈ స్థితి మారుతూ ఉంటుంది. ఏ సమయంలో అయినా అది పడి పోతుంది వాస్తవమునకు, ఈ యవ్వన ఆనందము లేదా డబ్బు సంపాదించే పని, ఏ సమయంలోనైన ఆగి పోతుంది వాస్తవానికి మీరు ఆ నమ్మకాన్ని ఆస్వాదించలేరు లేదా ఆ విధమైన సంతోషములో మీ విశ్వాసమును ఉంచలేరు. ఇది ఏ సమయములో అయినా పూర్తి అవుతుంది అందు వలన ఇది మంచిది కాదు. ఈ వ్యక్తులు ఆకాశహర్మ్యం భవనాలను నిర్మించుటలో, బ్యాంకులో డబ్బు జమ చేసుకోవడము, మంచి మోటరు వాహనాలు కలిగి ఉండటములో నిమగ్నమై ఉన్నారు, చాల విషయాలను వారు ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఏ క్షణములో అయినా అది ముగిసిపోతుంది అని మర్చిపోతున్నారు. ఏ క్షణములో అయినా. ఇది kamala-dala-jala లగా ఉంటుంది, "కమల ఆకుల మీద నీరు ఉంటుంది." ఇది నిలబడదు, అది వంగి ఉంటుంది, ఏ క్షణంలో అయినా పడిపోతుంది. ఉదాహరణ చాలా బాగుంది. అందువలన ఆయన సలహా śravaṇa kīrtana ఆయన మనసును ఆదేశిస్తున్నాడు, ఏమనగా దీన్ని చేయవద్దు, దీన్ని చేయవద్దు, అవి చాలా ప్రతికూల విషయాలు. అప్పుడు తరువాతి ప్రశ్న, వాస్తవానికి, గోవిందదాస ను మనస్సు అడగవచ్చు, "వాస్తవానికి మీరు ఏమి చేయలనుకుంటున్నారు? మీరు ఈ భౌతిక పనులు అన్నిటినీ నిరాకరిస్తున్నారు, అది సరే , అయితే మీ సానుకుల ప్రతిపాదన ఏమిటి?" ఆయన చెప్పాడు, "అవును,నా సానుకుల ప్రతిపాదన ఇది: śravaṇa kīrtana smaraṇa vandana, pāda-sevana dāsya re, pūjana sakhī-jana ātma-nivedana, govinda dāsa-abhilāṣa re." నా ప్రియమైన మనస్సా, ఈ abhaya-caraṇāravinda, కృష్ణుడు, గురించిన శ్రవణము చేయడానికి, మీరు నాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఆయన మహిమల గురించి నన్ను కీర్తించనివ్వండి. śravaṇa kīrtana నన్ను గుర్తు పెట్టుకోనివ్వండి, తన కమల పాదములకు నన్ను సేవ చేయనివ్వండి, నన్ను ఆయనతో స్నేహం చేయనివ్వండి. నేను ఆయనకు నా దగ్గర ఉన్న ప్రతిదీ ఇచ్చేటట్లు చేయనివ్వండి. ఇవి నా కోరికలు. మీరు దయతో నాకు సహకరిస్తే, అప్పుడు నేను చేయగలను. " ఇది చాల వివరణత్మకముగా ఉన్న పాట, మానవ జీవితపు లక్ష్యము యొక్క సారంశము, ఈ సూత్రాన్ని అనుసరిస్తే ఎవరైనా వాస్తవమునకు అధ్యాత్మికముగా సంతోషంగా ఉంటారు