TE/Prabhupada 0374 - భజాహురేమన భాష్యము భాగము ఒక్కటిPurport to Bhajahu Re Mana -- San Francisco, March 16, 1967


Bhajahū re mana śrī-nanda-nandana-abhaya-caraṇāravinda re. భజ, భజ అంటే ఆరధన; hu, హలో; మన, మనస్సు. కవి గోవింద దాస, ఒక గొప్ప తత్వవేత్త భగవంతుడి భక్తుడు, ఆయన ప్రార్దిస్తున్నాడు. అతను తన మనస్సును అభ్యర్థిస్తున్నాడు, ఎందుకంటే మనస్సు మిత్రుడు మనస్సు ప్రతి ఒక్కరి శత్రువు. కృష్ణ చైతన్యములో తన మనస్సుకు శిక్షణ ఇచ్చినట్లయితే, అతను విజయవంతమవ్వుతాడు. అతను తన మనస్సుకు శిక్షణ ఇవ్వలేకపోతే, అప్పుడు జీవితం విఫలమవుతుంది. అందువలన గోవింద దాస, కృష్ణుని గొప్ప భక్తుడు ... ఆయను పేరే సూచిస్తుంది, గోవింద దాస . గోవింద, కృష్ణ, దాస అoటే సేవకుడు. ఇది అందరి భక్తుల వైఖరి. వారు ఎల్లప్పుడూ పేరు చివరిలో దాస అని పెట్టుకుంటారు. దాస అంటే సేవకుడు అని అర్థం. కాబట్టి గోవింద దాస ప్రార్దిస్తున్నాడు, "నా ప్రియమైన మనస్సా, దయచేసి, మీరు నందా కుమారుడిని పూజించడానికి ప్రయత్నిoచండి, ఎవరు abhaya-caraṇa, ఎవరి కమల పాదములు సురక్షితమో. భయం లేదు. " Abhaya. Abhaya అంటే భయము లేదు, caraṇa, caraṇa అంటే కమల పాదములు. అందువలన అతను తన మనస్సుకు సలహ ఇస్తున్నాడు, "నా ప్రియమైన మనస్సా, దయచేసి, నందుని కుమారుడి నిర్భయమైన కమల పాదాలను పూజించేటట్లు మీరు నిమగ్నం అవ్వండి. " Bhajahū re mana śrī-nanda-nandana. Nanda-nandana అంటే నంద మహరాజు, కృష్ణుని కుమారుడు. అయన కమల పాదాలు abhaya, నిర్భయమైనవి. గోవింద దాస తన మనస్సును కోరుతున్నాడు, దయచేసి కృష్ణుని యొక్క కమల పాదముల యొక్క ఆద్యాత్మిక ప్రేమపూర్వక సేవలో నిమగ్నమవ్వoడి. ఇంతవరకు ఇతర విషయల గురించి ఆలోచించినప్పుడు ...

అతను చెప్పుతాడు durlabha mānava-janama. Durlabha అంటే పొందటము చాలా కష్టము అని అర్థం. Mānava-janma అంటే ఈ మానవ జీవతము ఇది చాల జన్మల తర్వాత వస్తుంది. ఒకసారి, కృష్ణ చైతన్యములోకి రావడానికి అవకశం ఇవ్వబడుతుంది,వ్యక్తులు జన్మ మరణ చక్రం నుండి బయటపడవచ్చు . అందువలన అతను సలహా ఇస్తున్నాడు ఈ జీవితం, మానవ జన్మ, చాల ముఖ్యమైనది, durlabha. దుర్లభ అంటే ... Duḥ అంటే చాల కష్టము, laabha అంటే పొందగలిగినది. కాబట్టి మూర్ఖుపు ప్రజలు, వారికి ఈ మానవ జీవితము యొక్క ప్రాముఖ్యత వారికి తెలియదు. వారు కేవలం జంతువుల వలె ఇంద్రియాలను తృప్తి పరుచుకుంటున్నారు. కాబట్టి ఇది చాల చక్కగా భోధిస్తుంది, అతను తన మనస్సుకు శిక్షణ ఇస్తున్నాడు, "నీవు కృష్ణుని ఆరాధనలో నీ మనస్సును నిమగ్నం చేయoడి." Durlabha mānava-janama sat-saṅge. మనస్సు యొక్క ఈ శిక్షణ మంచి సాంగత్యములో మత్రమే సాధ్యమవ్వుతుంది, sat-saṅga sat-saṅga అంటే కేవలం వ్యక్తులు , వంద శాతము భగవంతుడి యొక్క సేవలో నిమగ్నమై ఉంటారు. వారిని sat. Satāṁ prasaṅgāt. అని పిలుస్తరు. భక్తుల సాంగత్యము లేకుండ మనస్సుకు శిక్షణ ఇవ్వడము సాధ్యం కాదు. యోగ పద్ధతి లేద ధ్యానము అని పిలవబడే వాటి ద్వారా సాధ్యము కాదు. వ్యక్తులు భక్తుల సాంగత్యమును తీసుకోవాలి; లేకపోతే అది సాధ్యం కాదు. అందువలన మేము ఈ కృష్ణ చైతన్య సమాజమును ఏర్పర్చినాము, కాబట్టి ఎవరైనా ఈ సంఘం యొక్క ప్రయోజనముని పొందవచ్చు. గోవింద దాస, కవి మరియు భక్తుడు, సలహ ఇస్తున్నాడు, durlabha mānava-janama sat-saṅge: "మీకు చాలా మంచి, అరుదైన మానవ శరీరము ఉన్నాది. ఇప్పుడు భక్తులతో కలవండి, కృష్ణుని యొక్క నిర్భయమైన కమల పాదములపై మీ మనస్సును నిమగ్నం చేయండి. "అతను తన మనస్సును కోరుతూన్నాడు.

తరువాత అతను జీవితము యొక్క చిరాకులను చూపిస్తున్నాడు. అది ఏమిటి? Śīta ātapa bāta bariṣaṇa e dina jāminī jāgi re. Śīta అంటే శీతకాలము. Ātapa అంటే వేసవిలో, తీవ్రమైన వేడి ఉన్నప్పుడు. Śīta ātapa bāta, cold, bariṣaṇa, కుంభ వర్షము ఉన్నప్పుడు కాబట్టి ఈ ఆవంతరాలు ఎల్లప్పుడూ ఉన్నాయి. కొన్నిసార్లు తీవ్రమైన చలి ఉంటుంది. కొన్నిసార్లు తీవ్రమైన వేడి ఉంటుంది. కొన్నిసార్లు కుంభ వర్షము ఉంటుoది. కొన్నిసార్లు ఇది లేదా ఆది జరుగుతుంది. అందుకే అతను ఇలా అన్నడు, śīta ātapa bāta bariṣaṇa e dina jāminī jāgi re మొత్తం పగలు మరియు రాత్రి, ప్రజలు శ్రద్ధ లేకుండ చాల కష్టపడి పని చేస్తున్నారు తీవ్రమైన చలి, తీవ్రమైన వేడి, కుంభ వర్షము, రాత్రులు పని చేయడము, ఎడారికి వెళ్లడము, సముద్రం క్రిందకు వెళ్ళటము - ప్రతిచోట వారు చాల బిజీగా ఉన్నారు. Śīta ātapa bāta bariṣaṇa e dina jāminī jāgi re. రాత్రి ఉద్యోగము, చాల ఇతర పనులు ఉoటాయి. అందువల్ల అతను చెప్పుతాడు,

śīta ātapa bāta bariṣaṇa
e dina jāminī jāgi re
biphale sevinu kṛpaṇa durajana
capala sukha-laba lāgi' re

ఇప్పుడు, ఈ కఠినమైన శ్రమతో నేను ఏమి చేశాను? నా కృష్ణ చైతన్యమునకు అనుకూలము కాని కొందరి వ్యక్తులకు నేను సేవ చేశాను. ఎందుకు నేను వారికి సేవ చేశాను? "క Capala sukha-laba lāgi' re: Capala, చాల కొద్దిపాటి సమయము ఉండే ఆనందము. నా చిన్న పిల్ల వాడు నవ్వితే నేను సంతోషముగా ఉంటాను. నా భార్య సంతోషముగా ఉంటే నేను సంతోషముగా ఉoటాను అని నేను భావిస్తాను. కాని ఈ అన్ని తాత్కాలిక నవ్వులు లేదా ఆనందము అనే భావన, ఇవి అన్ని మినుకుమినుకుమనేవిగా ఉoటాయి. " వ్యక్తులు దానిని గ్రహించవలసి ఉంది. అనేకమంది ఇతర కవులు కూడ ఉన్నారు, అదే విధంగ మనము పాడాము ..., ఈ మనస్సు ఉదాహరణకు ఒక ఎడరిలా ఉంటుంది, అది సముద్ర నీటి కోసము ఆరాట పడుతుంది. ఒక ఎడరిలోకి, ఒక మహసముద్రమును పంపించినట్లయితే, అప్పుడు దానిని పూర్తిగా నింపవచ్చు. ఒక్క నీటి చుక్క ఉంటే, అక్కడ ఏ ప్రయోజనమును పొందవచ్చు? అదే విధముగా,మన మనస్సు, మన చైతన్యము, సముద్రము అంత ఆనందము కోసము ఆరాటపడుతున్నాయి. కుటుంబ జీవితములో ఈ తాత్కలిక ఆనందము సమాజ జీవితము, ఇవి అన్ని కేవలం నీటి చుక్క వలె ఉంటాయి. కాబట్టి ఎవరైతే తత్వవేత్తలో, వాస్తవానికి ప్రపంచ పరిస్థితిని అధ్యయనము చేసిన వారు, వారు అర్దము చేసుకోగలరు "ఈ మిణుకుమిణుకు ఆనందం నాకు సంతోషము ఇవ్వదు."

తరువాత అతను చెప్పుతాడు, kamala-dala-jala, jīvana talamala. Kamala-dala-jala అంటే కలువ, లిల్లీ పుష్పం. మీరు అందరు సరస్సులో లిల్లీ పుష్పములను చూసినారా. అవి ఎల్లప్పుడూ నీటిలో కదులుతు ఉంటాయి.. ఏ మర్గములో అయినా, ఏ సమయంలో అయినా,వాటిని ముంచెత్తవచ్చు. అదేవిధముగా, ఈ జీవితం ఎల్లప్పుడూ ప్రమాదములతో నిండి ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రమాదములో ఉంటుoది. ఏ క్షణములో అయినా ముగిసి పోతుంది. చాల సందర్భాలు ఉన్నాయి. ప్రజలు దీనిని చూస్తారు, కానీ వారు మర్చిపోతున్నారు. ఇది అద్భుతమైన విషయము. వారు ప్రతిరోజు, ప్రతి క్షణం చూస్తున్నారు, అతను తానే ప్రమదములో ఉన్నానని, ఇతరులు ప్రమదంలో ఉన్నారు అని. అయినప్పటికీ, "నేను సురక్షితముగా ఉన్నాను" అని అతను ఆలోచిస్తున్నడు. ఇది పరిస్థితి.