TE/Prabhupada 0380 - దశావతారము స్తోత్రము యొక్క భాష్యము



Purport to Dasavatara Stotra, CD 8


తరువాత, అవతారము వామనదేవుడు. ఈ వామనదేవుడు, ఒక మరుగుజ్జు, ఆయన బలి మహారాజు దగ్గరకు వెళ్లి ఆయనని మూడు అడుగుల భూమిని అడిగాడు, ఆయన గురువు, శుక్రచార్య, ఆయనను వాగ్దానం ఇవ్వద్దు అని ప్రేరేపించాడు ఎందుకంటే ఆయన విష్ణువు. కానీ బలి మహారాజు విష్ణువుకు ఏదైనా దానము ఇవ్వడానికి చాల సంతృప్తి చెందాడు, ఆయన తన గురువు యొక్క సంబంధమును విడిచిపెట్టాడు, ఎందుకంటే ఆయన విష్ణువుకు సేవ చేయడమును నిషేధించాడు కనుక అందువల్ల బలి మహరాజు మహాజనులలో ఒకరు. విష్ణువు ఆరాధనను ఎవరూ ఆపలేరు. ఎవరైనా ఆపినట్లయితే, ఆయన గురువు కావచ్చు, ఆయన తండ్రి కావచ్చు, ఆయన బంధువు కావచ్చు, ఆయనను వెంటనే తిరస్కరించాలి. వెంటనే అందువల్ల బలి మహారాజు ఒక మహాజన. ఆయన ఈ ఉదాహరణను చూపించాడు: ఎందుకంటే తన గురువు తాను పూజిస్తున్న విష్ణువు మార్గంలో అడ్డుపడ్డాడు, ఆయన తన గురువు యొక్క సంబంధమును విడిచిపెట్టాడు. అందువలన ఈ పద్ధతి ద్వారా ఆయన యాచించాడు,కాని ఆది యాచించడము కాదు, ఆచరణాత్మకముగ అది మోసం చేయుట. బలి మహారాజు భగవంతుడు చేత మోసం చేయబడటానికి అంగీకరించారు. ఇది భక్తుడి లక్షణం. భక్తుడు భగవంతుడు యొక్క ఏ చర్యనైనా అంగీకరిస్తాడు, బలి మహారాజు భగవంతుడు మోసగించాలని కోరుకుంటున్నాడు అని చూసాడు. మూడు అడుగుల భూమిని అడిగి, ఆయన మొత్తం విశ్వాన్ని తీసుకుంటాడు , అందుచే ఆయన అంగీకరించారు. రెండు అడుగులతో మొత్తం విశ్వాన్ని పైన క్రింద ఆక్రమించారు. అప్పుడు వామనదేవుడు మూడవ అడుగును ఎక్కడ ఉంచాలి అని అడిగారు? బలి మహారాజు అంగీకరించారు, "నా ప్రభు, మీరు నా తలపై ఉంచండి, నేను ఇంకా నా శరీరాన్ని కలిగి వున్నాను." ఈ విధంగా ఆయన భగవంతుడు విష్ణువును, వామనదేవుని కొనుగోలు చేసాడు, బలి మహారాజు యొక్క ద్వారపాలకుడిగా వామనదేవుడు ఉన్నాడు. ప్రతీదీ ఇవ్వడం sarvatma snapane bali, ఆయన భగవంతునికి ప్రతీదీ ఇచ్చాడు ఆ విధముగా ఇచ్చి వేయటము వలన, అతడు భగవంతుడిని కొనుగోలు చేశాడు. ఆయన బలి మహారాజు యొక్క ద్వార పాలకుడిగ స్వచ్ఛందంగా ఉన్నారు. కావున chalayasi vikramane balim adbhuta-vamana pada-nakha-nira-janita-jana-pavana, వామనదేవుడు ఆయన కాలుని పైకి విస్తరించినప్పుడు, ఆయన బ్రొటన వేలు వలన విశ్వం యొక్క ఆవరణలో ఒక రంధ్రం ఏర్పడింది, ఆ రంధ్రం ద్వార గంగా జలం వైకుంఠము నుండి వస్తుంది. Pada-nakha-nira-janita, ఆ గంగా జలము ఇప్పుడు ఈ విశ్వములో ప్రవహించుచున్నది, ప్రతిచోటును పవిత్రము చేస్తుంది , ఎక్కడ గంగా జలం ఉన్నా. Pada-nakha-nira-janita-jana-pavana.

తరువాత అవతరాము భృగుపతి, పరశురామ. పరశురామ అనేది ఒక శక్తావేశ అవతారము. అందువల్ల ఆయన ఇరవై ఒక్క సార్లు క్షత్రియులను హతమార్చాడు. పరశురాముడి భయము వలన, క్షత్రియులు అందరు, వారు యూరోప్ వైపు వలస వెళ్ళరు, చరిత్రలో, మహాభారతంలో చెప్పబడింది. ఇరవై ఒక్క సార్లు ఆయన క్షత్రియులు అందరిపై దాడి చేశాడు. వారు సక్రమముగా లేరు, అందువలన ఆయన వారిని హత్య చేశాడు, కురుక్షేత్రములో పెద్ద చెరువు ఉంది. రక్తం అంతా దాచిపెట్టబడినది . తరువాత అది నీరు అయ్యింది. ksatriya-rudhira, బాధపడిన భూమిని శాంతింపజేయడానికి, ఆయన భూమిని క్షత్రియుల రక్తంతో తడిపినారు, snapayasi payasi samita-bhava-tapam.

Vitarasi diksu rane dik-pati-kamaniyam dasa-mukha-mauli-balim ramaniyam. తరువాత అవతారము రామచంద్రునిది. రావణుడు, పది తలలు కలిగిన వాడు, ఆయన భగవంతుడిని సవాలు చేశాడు, భగవంతుడు రామచంద్రుడు సవాలు చేపట్టి ఆయనని హత్య చేసాడు. తరువాత vahasi vapusi visade vasanam jaladabham hala-hati-bhiti-milita-yamunabham. బలరాముడు, యమునను ఆయన తన సమీపంలోకి రావాలని కోరుకున్నప్పుడు, ఆమె రాలేదు. అందువల్ల అతను తన నాగలితో భూమిని రెండుగ చీల్చాలని అనుకున్నాడు, ఆ సమయంలో యమున శరణాగతి పొందినది, ఆమె భగవంతుని దగ్గరకు వచ్చినది. Hala-hati-bhiti-yamuna, hala-hati-bhiti-milita-yamunabham, యమునను బలదేవుడు శిక్షించారు. Kesava dhrta-haladhara-rupa, hala, haladhara అంటే నాగలి అని అర్ధము, haladhara-rupa jaya jagadisa hare.

తరువాత, బుద్ధుడు, భగవంతుడు బుద్ధుడు. Nindasi yajna-vidher ahaha sruti-jatam. భగవంతుడు బుద్ధుడు వేదముల ఉత్తర్వును తిరస్కరించారు, ఎందుకంటే ఆయన లక్ష్యము జంతువులను చంపడం ఆపడము, వేదాలలో, కొన్ని యజ్ఞాలలో, జంతువులను చంపడం సూచించబడినది. వేద నియమాలు పాటించేవారు అని పిలువబడేవారు, వారు బుద్ధదేవుని, ఆయన లక్ష్యము అయిన జంతువులను చంపడం నిలిపివేయటమును ఆపాలని కోరుకున్నారు, అందువలన ప్రజలు వేదాల నుండి సాక్ష్యం కావాలని కోరుకున్నప్పుడు, వేదాలలో వర్ణన ఉంది, జంతువులను హతమర్చడానికి అనుమతి ఉన్నది, ఎందుకు మీరు ఆపుతున్నారు? అయినా వేద నియమాలు పాటించేవారు అని పిలువబడేవారు, nindasi, ఆయన తిరస్కరించాడు. ఆయన వేదాల యొక్క ప్రామాణికాన్ని తిరస్కకరించడము వలన , బుద్ధుని తత్వము భారతదేశంలో ఆమోదించబడలేదు. నాస్తిక, వేదముల ప్రామాణికాన్ని తిరస్కరించేవారు ఎవరైనా, ఆయనను ఒక నాస్తికుడు అని పిలుస్తారు, నమ్మకం లేనివాడు వేదాలను అగౌరవ పరచకూడదు. అందువలన ఈ విధముగా, బుద్ధుడు, నిస్సహాయమైన జంతువులను కాపాడటానికి, ఆయన కొన్నిసార్లు వేదముల యొక్క ఉత్తర్వులను తిరస్కరించాడు. Kesava dhrta buddha-sarira jaya jagadisa.

తదుపరి అవతారము కల్కి అవతారము. మనము ఎదురు చూస్తున్నాము, ఇప్పటి నుండి నాలుగు వందల వేల సంవత్సరాల తరువాత, కల్కి అవతారము వస్తుంది, ఆయన ఒక రాజు వలె , గుర్రంపై ఒక కత్తిని తీసుకొని, ఆయన కేవలం ఈ నమ్మని వారిని, దేవుడు లేడు అనే వారిని చంపుతూ వెళ్ళుతాడు. ప్రచారము ఇంక ఉండదు. ఇతర అవతారములలో ప్రచారము ఉంది, కల్కి అవతారములో మొత్తం ప్రపంచం యొక్క జనాభా జంతువుల స్థాయికి పడిపోతారు, దేవుడు అంటే అర్థం ఏమిటి లేదా ఆధ్యాత్మికం అంటే ఏమిటి. అని తెలుసుకోవడానికి శక్తి ఉండదు, ఇది ఇప్పటికే కలి యుగములో ఉంది. ఇది పెరుగుతుంది. ప్రజలు ఈ తత్వము, దేవుడు చైతన్యమును అర్థం చేసుకోవడానికి ఎటువంటి శక్తి కలిగి ఉండరు. ఆ సమయంలో వారిని చంపడము కంటే ఇతర ప్రత్యమ్నాయం లేదు, అప్పుడు మరొక సత్య-యుగములోకి ప్రవేశిస్తాము. అది ఈ మార్గము యొక్క...