TE/Prabhupada 0389 - హరి హరి బిఫలే కు భాష్యము
(Redirected from TE/Prabhupada 0389 - హరి హరి భిపలె కు భాష్యము)
Purport to Hari Hari Biphale -- Hamburg, September 10, 1969
Hari hari! biphale janama goṅāinu. ఇది నరోత్తమ దాస ఠాకురా పాడిన పాట, ఆయన చాలా ప్రముఖ ఆచార్యులు, చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయ క్రమములో, గురు శిష్య పరంపర ద్వారా. ఆయన అనేక పాటలు పాడారు, ముఖ్యమైన పాటలు, ఆయన పాటలు వేదముల సారంశముగా అంగీకరించబడ్డాయి. చాలా ప్రామాణికమైన పాటలు. అందువల్ల ఆయన కృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు, నా ప్రియమైన ప్రభు, హరి హరి, "నేను నా జీవితమును పాడు చేసుకున్నాను" Hari hari biphale janama goṅāinu. నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకున్నావు? ఆయన ఇలా అన్నాడు, manuṣya-janama pāiyā, , "నేను ఈ మానవ రూపాన్ని పొందాను," rādhā-kṛṣṇa nā bhajiyā, ", కాని నేను రాధా-కృష్ణుడిని ఆరాధించటాన్ని పట్టించుకోలేదు. అందుచేత నేను నా జీవితాన్ని పాడుచేసుకున్నాను. " అది ఎలా? ఇది ఖచ్చితముగా ఒక వ్యక్తి తెలిసి విషయమును తీసుకున్నట్లు ఒకవేళ ఎవరైనా విషమును తెలియకుండా తీసుకుంటే, దానిని మన్నించ వచ్చు, కాని ఎవరైనా తెలిసి విషమును తీసుకుంటే, అది ఆత్మహత్య చేసుకున్నట్లు. అందువల్ల ఆయన ఇలా చెప్పాడు, "ఈ మానవ రూపంలో రాధా కృష్ణులను పూజించకుండా నేను పిచ్చిగా ఆత్మహత్య చేసుకున్నాను."
తరువాత ఆయన అన్నాడు, golokera prema-dhana, hari-nāma-saṅkīrtana. ఈ కృష్ణ చైతన్య ఉద్యమము, సంకీర్తన ఉద్యమము, ఇది భౌతికము కాదు. ఇది నేరుగా ఆధ్యాత్మిక రాజ్యం అయిన గోలోక వృందావనము నుండి తీసుకు రాబడింది. కావున golokera prema-dhana.. ఇది సాధారణ పాట కాదు. కేవలం ఇది ఒక్కటే భగవంతుని ప్రేమ యొక్క నిధి కాబట్టి... "కాని దీనిపై నాకు ఎటువoటి ఆకర్షణ లేదు." Rati nā janmilo kene tāy. దానిపై ఎటువoటి ఆకర్షణ లేదు. దీనికి విరుద్ధంగా, viṣaya-biṣānale, dibā-niśi hiyā jwale, నేను అంగీకరించలేదు కనుక, అందువలన భౌతిక జీవితము యొక్క మండుతున్న అగ్ని నిరంతరం నన్ను కాలుస్తుంది. Dibā-niśi hiyā jwale. "పగలు మరియు రాత్రి, నా హృదయము మండుతూ ఉంది, భౌతిక జీవితము యొక్క ఈ విష ప్రభావము వలన. " taribare nā koinu upāy. "కాని నేను దీని కోసం ఏ పరిష్కారం వెతక లేదు." మరో మాటలో చెప్పాలంటే, భౌతిక జీవితము యొక్క ఈ మండుతున్న అగ్నికి పరిష్కారం ఈ సంకీర్తన ఉద్యమం. ఇది ఆధ్యాత్మిక రాజ్యం నుండి దిగుమతి చేయబడిoది. ఎవరు దిగుమతి చేసినారు? లేదా ఎవరు తెచ్చినారు?
అప్పుడు ఆయన చెప్పారు, brajendra-nandana jei, śaci-suta hoilo sei.. భ్రజేంద్ర-నందనా, భ్రజ రాజు యొక్క కుమారుడు. అది కృష్ణుడు. కృష్ణుడు నంద మహారాజు కుమారుడు. ఆయన భ్రజభూమికి రాజు. కాబట్టి భ్రజేంద్ర-నందనా జయి, అదే వ్యక్తి , ఆయన గతంలో నంద మహారాజు కుమారుడు , ఇప్పుడు శచీ మాత కుమారుడుగా వచ్చారు. Śacī-suta hoilo sei. balarāma hoilo nitāi. భగవంతుడు బలరాముడు నిత్యానందగా మారారు. కాబట్టి ఈ ఇద్దరు సోదరులు వచ్చి, వారు అన్ని రకాల పతితులైన వ్యక్తులకు ముక్తి ప్రసాదిస్తున్నారు. Pāpī-tāpī jata chilo. ఎంత మంది పతితులైన వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉన్నారో, వారు కేవలం ఈ కీర్తన పద్ధతి ద్వారా వారిని రక్షిస్తున్నారు. Hari-nāme uddhārilo, కేవలం ఈ కీర్తన ద్వారా. ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు ఆయన చెప్పినాడు tāra sākṣī jagāi and mādhāi. జీవించి ఉన్న ఉదాహరణ ఇద్దరు సోదరులు, జగాయ్ మాధాయ్. ఈ జగాయ్ మాధాయ్ ఇద్దరు సోదరులు, వారు ఒక బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించుట జరిగినది, కాని వారు అధములలో ప్రథమ స్థానములో ఉన్నారు. ... ఈ రోజుల్లో, ఈ యుగములో, వారి అర్హతను చెత్తగా పరిగణించటము లేదు. వారి వేశ్యాలోలత్వము ఎoదుకంటే వారు తాగుబోతులు మరియు స్త్రీ లోలులు. అందువల్ల వారిని వేశ్యాలోలులు అని పిలుస్తారు. మరియు మాంసం తినేవారు కూడా. కాబట్టి... కాని వారు భగవంతుడు చైతన్య మరియు నిత్యానంద కృపచే విముక్తులు అయ్యారు. గొప్ప భక్తులు అయ్యారు.
కాబట్టి నరోత్తమ దాస యొక్క ఈ వివరణ చెప్పుతుంది, ఈ యుగములో, ప్రజలు తాగుబోతులు అయిన్నప్పటికీ, స్త్రీ-లోలులు, మాంసం-తీనేవారు, మరియు అన్నీ..., జూదగాడు, అన్ని రకాల పాపములు చేస్తారు, అయినప్పటికీ, వారు ఈ కృష్ణ చైతన్య ఉద్యమమును తీసుకొని, హరే కృష్ణ కీర్తన చేస్తే , వారు నిస్సందేహంగా రక్షించబడుతారు. ఇది చైతన్య మహాప్రభువు యొక్క దీవెనలు. తరువాత నరోత్తమ దాస ఠాకూరా ప్రార్థిస్తాడు, hā prabhu nanda-suta, vṛṣabhānu-sutā-juta. నా ప్రియమైన ప్రభూ కృష్ణ, నీవు నంద రాజు యొక్క కుమారుడివి, మీ సహవాసి రాధారాణి, వృషభాను రాజు యొక్క కుమార్తె. కాబట్టి మీరు ఇక్కడ కలసి నిలబడి ఉన్నారు. " Narottama dāsa kahe, nā ṭheliho rāṅgā pāy, "ఇప్పుడు నేను నీకు శరణాగతి పొందుతున్నాను, దయచేసి నన్ను దూరంగా కొట్టి వేయవద్దు, లేదా మీ కమల పాదాలతో నన్ను దూరముగా నెట్టి వేయ వద్దు, ఎందుకంటే నాకు ఇతర ఆశ్రయం లేదు. నేను ఏ ఇతర దారి లేకుండా కేవలము మీ కమల పాదాల దగ్గర ఆశ్రయం తీసుకుంటున్నాను. దయచేసి నన్ను అంగీకరించండి నన్ను రక్షించండి. "ఇది ఈ పాట మొత్తం సారంశము.