TE/Prabhupada 0390 - జయ రాధ మాధవ యొక్క భాష్యము



Purport to Jaya Radha-Madhava -- New York, July 20, 1971


కాబట్టి ఇది కృష్ణుని అసలు స్వభావం, కృష్ణుని యొక్క స్వభావం అతను రాధా-మాధవ. అతను శ్రీమతి రాధా రాణి యొక్క ప్రేమికుడు. మరియు తను కుంజ్ విహారీ ,బృందావన అడివి పొదల్లో అతను ఎల్లప్పుడూ గోపీకల సహచర్యములో ఆనందం గా ఉండేవాడు. రాధా- మాధవ కుంజ్ విహారీ . అందువల్ల అతను రాధారాణి యొక్క ప్రేమికుడు మాత్రమే కాదు, కానీ బ్రజ-జన-వల్లభ. బృందావనం లో నివసించే వారందరూ కృష్ణుణ్ణి ప్రేమిస్తారు. వారికి ఇంకేమీ తెలియదు. వాళ్లకి కృష్ణుడు భగవంతుడా, కాదా కూడా తెలీదు. అతను భగవంతుడు అని అంటేనే, నేను కృష్ణుడిని ప్రేమిస్తాను అలాంటి బలవంతం ఏమీ లేదు. అతను భగవంతుడు కావచ్చు లేదా అతను ఏమైనా కావచ్చు. ఇది పట్టింపు లేదు, కానీ మేము కృష్ణుడిని ప్రేమిస్తాము. అంతే. అది స్వచ్ఛమైన, నిష్కల్మషమైన ప్రేమ అని పిలువబడుతుంది. కృష్ణుడు భగవంతుడు అయితేనే నేను ఆయనను ప్రేమిస్తాను - ఇది షరతులకు లోబడ్డ ప్రేమ. ఇది స్వచ్ఛమైన ప్రేమ కాదు అతను భగవంతుడు కావచ్చు లేదా అతను ఏమైనా కావచ్చు. కానీ అతని అద్భుత క్రియల ద్వారా, వ్రిందావన్ వాసి, వారు ఆలోచిస్తున్నారు, ఓహ్ కృష్ణుడు, అతను చాలా అద్భుతమైన శిశువు, బహుశా ఎవరైనా దేవత కావచ్చు. ఎందుకంటే సామాన్యమైన జనులు ఏమనుకుంటారంటే దేవీదేవతలు చాలా బలవంతులు అని అనుకుంటారు. వారు ఈ భౌతిక ప్రపంచం లోపల శక్తివంతులు. కానీ వారు కృష్ణుడు అన్నింటికన్నా గొప్పవాడని వారికి తెలియదు. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ sac-cid-ānanda-vigrahaḥ (Bs. 5.1). దేవతలలో అత్యున్నత మైనవాడు, బ్రహ్మ,, తన అభిప్రాయాన్ని ఇస్తున్నారు, "సర్వశ్రేష్టమైన నియంత్రికుడు కృష్ణుడు"

బృందావన నివాసులు శ్రీకృష్ణుని ఎటువంటి షరతులు లేకుండా ప్రేమిస్తారు. అదేవిధంగా, కృష్ణుడు వారిని కూడా ప్రేమిస్తాడు. Vraja-jana-vallabha giri-vara-dhārī. ఇంద్రుడు-యజ్ఞం ఆగిపోయినందున బృందావన నివాసులు ప్రమాదంలో ఉన్నప్పుడు, ఇంద్రుడు చాలా కోపంగా మారి, అతను చాలా గొప్ప, శక్తివంతమైన మేఘమును పంపించాడు . ఏడు రోజులు నిరంతరంగా వృందవనముపై వర్షాన్ని కురిపించాడు బృందావన నివాసులు చాలా అశాంతికి గురి అయ్యారు. కృష్ణుడు, ఏడు సంవత్సరాలు వయసుగల అబ్బాయి అయినప్పటికీ, అతను గోవర్ధనగిరిని ఎత్తడం ద్వారా వారిని రక్షించాడు అందువలన అతను ఇంద్ర దేవునికి ఏమని నేర్పించాడు అంటే నా చిటికెన వేలు యొక్క పని మీ కష్టములను ఆపడం . అంతే. అందువలన అతను తన మోకళ్లపైకి వచ్చాడు. ఈ విషయలు మీరు కృష్ణుడి పుస్తకంలో చూస్తారు. గోపీ-జన-వల్లభ అయినందువలన, అతని ఏకైక వ్యాపారం గోపీ-జనాన్ని ఎలా రక్షించుకోవాలో అని. మన కృష్ణ చైతన్యం ఏమిటంటే మనం గోపీ జనులలో ఒకరిగా మారటం అప్పుడు కృష్ణుడు ఎలాంటి ప్రమాదం లో నుంచి అయినా మనల్ని కాపాడుతాడు, ఒక కొండ లేదా పర్వతాన్ని ఎత్తడం ద్వార. కృష్ణుడు చాలా దయగలవాడు మరియు చాలా శక్తిమంతుడు కృష్ణుడు కొండను ఎత్తినప్పుడు, అతను యోగ అభ్యాసము నేర్చుకుని ఎత్తలేదు. మరియు భగవంతుడు అంటే అదే . అతను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటికీ, అతను చిన్నపిల్లలాగే ఆడటం, అతను చిన్న పిల్లవాడిగా వ్యవహరిస్తున్నాడు, కానీ అవసరమయినప్పుడు, అతను భగవంతుడిగా మనుష్యులకు ప్రదర్శిస్తాడు. కృష్ణుడు అంటే ఇదే. ఇది కృష్ణుడంటే, అంతేగాని యోగాన్ని అభ్యసించాల్సిన అవసరం లేదు. అప్పుడు ఆయన భగవంతుడు అవుతాడు... కాదు. అతను ఆ రకమైన భగవంతుడు కాదు, అలా తయారు చేసిన భగవంతుడు కాదు.అతను భగవంతుడు.

కాబట్టి gopī-jana-vallabha giri-vara-dhārī.. శిశువుగా, యశోద యొక్క ప్రియమైన పిల్లవాడిగా, యశోద-నందన. కృష్ణుడు భక్తుడు యొక్క బిడ్డగా ఉండటానికి ఇష్టపడుతాడు. అతను తన భక్తుడైన తండ్రి మరియు తల్లిచే శిక్షింపబడాలని కోరుకుంటాడు. ప్రతిఒక్కరూ ఆయనను ఆరాధించే వాళ్లే, ఎవరూ అతణ్ణి శిక్షించటానికి వెళ్ళరు, అందువలన భక్తుడు అతనిని శిక్షించేటప్పుడు ఆయన ఆనందం పొందుతాడు. అది కృష్ణుడి సేవ. అయితే కృష్ణుడు శిక్షించబడటానికి ఆనందముగా ఉంటే , కావున భక్తుడు బాధ్యత తీసుకుంటాడు: సరే, నేను నీ తoడ్రి అవుతాను, నిన్ను శిక్షిస్తాను. కృష్ణుడు పోరాడాలని కోరుకున్నప్పుడు, అతని భక్తులలో ఒకడు హిరణ్య కశిపుడు గా మారి, అతనితో పోరాడుతాడు. కాబట్టి కృష్ణుని యొక్క అన్ని కార్యకలాపాలు అతని భక్తులతో ఉంటాయి. అతను ... అందువలన, కృష్ణుని సహచరుడిగా, కృష్ణ చైతన్యముని అభివృద్ధి చేయడానికి Yaśodā-nandana vraja-jana-rañjana . అతని ఏకైక పని ఎలా సంతృప్తి పరచాలి ... బ్రజ జనుల యొక్క కర్తవ్యము కృష్ణుడిని ఎల సంతృప్తి పరచాలి అని, అదేవిధంగ, కృష్ణుడి కర్తవ్యము బ్రజ-జనులను సంతృప్తి పరచుట. ఇది పరస్పరం ఇచ్చి పుచ్చుకొను ప్రేమ వ్యవహారం. యమునా తీర వనచారి. కృష్ణుడు , దేవాదిదేవుడు , తను యమునా నది ఒడ్డున తిరుగుతూ ఉన్నాడు. గోపీస్, గోపబాలురు, పక్షులు, జంతువులు, దూడలను ఆనంద పరచడానికి. అవి సాధారణ పక్షులు, జంతువులు, దూడలు లేదా వ్యక్తులు కారు. వారు ఆత్మ సాక్షాత్కారము లో పరిపూర్ణమైన దశలో ఉన్నారు. Kṛta-puṇya-puñjāḥ ( SB 10.12.11) చాలా చాలా జన్మల తర్వాత వాళ్లు కృష్ణునితో ఆడుకునే స్థాయిని పొందారు.

కాబట్టి మా కృష్ణచైతన్య ఉద్యమం చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ అందరూ కృష్ణ లోకానికి వెళ్లగలరు. మరియు అతని సహచరుడిగా, స్నేహితుడిగా లేదా చాలా ఇతర విషయాలుగా, సేవకునిగా,తండ్రిగా, తల్లిగా, . మరియు ఇన్ని ప్రతిపాదనలలో ఏదో ఒక దానికి కృష్ణుడు సమ్మతిస్తాడు. ఈ విషయాలు మా చైతన్య మహాప్రభు బోధనలలో చాలా చక్కగా వివరించబడ్డాయి. కృష్ణుడు బృందావనము వదిలి ఒక్క అడుగుకూడా బయటపెట్టాడు. అసలు కృష్ణుడు బృందావనములోనే ఉన్నారు. ఇది బ్రహ్మ సంహితలో వివరించబడింది.

cintāmaṇi-prakara-sadmasu kalpa-vṛkṣa-
lakṣāvṛteṣu surabhīr abhipālayantam
lakṣmī-sahasra-śata-sambrahma-sevyamānaṁ
govindam ādi-puruṣaṁ (tam ahaṁ bhajāmi)
(Bs. 5.29)

బ్రహ్మ బృందావనములో గోవింద, కృష్ణుని దేవాదిదేవునిగా అంగీకరించారు. వేణుమ్ క్వనంతం: "అతను వేణువుని ఆడించడంలో నిమగ్నమై ఉన్నాడు."

veṇuṁ kvaṇantam aravinda-dalāyatākṣaṁ
barhāvataṁsam asitāmbuda-sundarāṅgam
kandarpa-koṭi-kamanīya-viśeṣa-śobhaṁ
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Bs. 5.30)

కాబట్టి ఈ పుస్తకాల ప్రయోజనాన్ని, ఈ జ్ఞానాన్ని, మరియు ఈ ప్రసాదంను తీసుకోండి. ఈ కీర్తనతో, సంతోషంగ కృష్ణుడి దగ్గరికి వెళ్లండి. చాలా మంచిది, అయితే సరే