TE/Prabhupada 0396 - కులశేఖర మహారాజు ప్రార్ధనలకు భాష్యము



Purport to Prayers of King Kulasekhara, CD 14


ప్రస్తుత శ్లోకము, ముకుంద-మాలా-స్తోత్రము అని పిలువబడే ఒక పుస్తకం నుండి తీసుకోబడిన ప్రార్థన. ఈ ప్రార్ధన కులశేఖర అనే ఒక రాజు చేత చేయబడినది. అతను ఒక గొప్ప రాజు, అదే సమయంలో గొప్ప భక్తుడు. వైదిక సాహిత్య చరిత్రలో ఇటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. రాజులు గొప్ప భక్తులుగా వుండేవారు, మరియు వారిని రాజర్షులు అని పిలువబడేవారు. రాజర్షులు అంటే అర్థం, వారు రాజ సింహసనంపై ఉన్నప్పటికీ, వారందరూ సాధువులు. ఈ రాజా కులశేఖరుడు, కృష్ణుడిని ఈవిధంగా ప్రార్థిస్తున్నాడు. నా ప్రియమైన కృష్ణా,ఇప్పుడే నా మనస్సు అనే రాజహంస మీ పాదాల వద్ద నిలువ నివ్వు. నీ పాదపద్మముల తూడు దగ్గర. ఎందుకంటే, మరణం సమయంలో, కఫ,వాత,పిత్తములు అని పిలువబడే మూడు శారీరక విధులు వాటి మూడింటి కలయిక వల్ల కంఠధ్వని ప్రభావం అవుతుంది, కాబట్టి నా మరణం సమయంలో మీ పవిత్ర నామాన్ని ఉచ్చరించలేను. " పోలిక ఈ విధంగా ఇవ్వబడింది, తెల్లని హంస లాంటి, ఎప్పుడైతే అది తామరపువ్వును చూస్తుందో, వెంటనే అది నీటిలోనికి దుమికి,అక్కడికి వెళ్ళి ఆటలాడుతుంది మరియు అది తామర తూడును చుట్టుముడుతుంది. రాజా కులశేఖర తన మనస్సు మరియు శరీర ఆరోగ్యకరమైన దశలోనే, అతను భగవంతుని పాదపద్మముల తూడు మీద మనసు నిలిపి,వెంటనే మరణాన్ని పొందదలచాడు. దీని సారాంశమేమనగా ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలి, అతని మనస్సు శరీరం మంచి స్థితిలో ఉన్నప్పుడే. మీ జీవితంలోని చివరి దశ కోసం వేచి ఉండవద్దు. మీ శరీరం మరియు మనస్సు ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నప్పుడే, కృష్ణ చైతన్యాన్ని అభ్యసించండి, తద్వారా మరణ సమయంలో మీరు కృష్ణుడిని,ఆయన లీలలను స్మరించగలుగుతారు. మరియు వెంటనే ఆధ్యాత్మిక లోకానికి చేరగలుగుతారు.