TE/Prabhupada 0397 - రాధా-కృష్ణ బోల్ కు భాష్యము
Rādhā-kṛṣṇa bolo bolo bolo re sobāi. ఇది భక్తి వినోద ఠాకూరుల వారు పాడిన గేయము. ఇక్కడ ఏమని చెప్పబడినది అంటే శ్రీ చైతన్య మహప్రభు మరియు నిత్యనందప్రభు, వారు నదియా పట్టణ వీధుల గుండా నడుస్తూ, ఈవిధంగా ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఉపదేశిస్తున్నారు. వారు అంటున్నారు, "మీరు అందరూ, దయచేసి రాధా-కృష్ణుల లేదా హరే కృష్ణ నామాన్ని చెప్పండి." Rādhā-kṛṣṇa bolo bolo bolo re sobāi. మీలో ప్రతి ఒక్కరు, కేవలం రాధా కృష్ణ లేదా హరే కృష్ణ అనే నామాలను జపించండి. ఇది ఉపదేశము. Ei şikhā diyā. చైతన్య మహప్రభు మరియు నిత్యనందప్రభు, ఇద్దరూ కలిసి, వీధిలో నడుస్తూ, నృత్యం చేస్తున్నప్పుడు, మీరు అందరూ కేవలం రాధా కృష్ణ అని చెప్పండి అని సూచిస్తున్నారు. Ei śikhā diyā, sab nadīyā, phirche nece' gaura-nitāi. ఫిర్చే, ఫిర్చే అంటే నడవడం.నదియా పట్టణమంతా వారు ఈవిధంగా ప్రచారము చేస్తున్నారు. Ei śikhā diyā, sab nadīyā, phirche nece' gaura-nitāi. తర్వాత వారు అంటున్నారు,keno māyār bośe, jāccho bhese’, మీరంతా మాయా కెరటాలలో లేదా భౌతిక కాలుష్యంలో ఎందుకు కొట్టుకుపోతారు? Khāccho hābuḍubu, bhāi. "ఎందుకు రాత్రింబవళ్లు కేవలం పూర్తి కల్లోలపూరితంగా ఉంటారు. ఒక వ్యక్తిని నీటిలో ఉంచినప్పుడు, కొన్నిసార్లు అతను మునిగిపోతాడు, కొన్నిసార్లు పైకి తేలతాడు, కానీ అతను చాలా సతమతమవుతున్నాడు. అదేవిధంగా, మాయసముద్రంలో, ఎందుకు మీరు ఇంత సతమతమవుతున్నారు? కొన్నిసార్లు మునిగిపోయి, కొన్నిసార్లు పైకి తేలుతూ, కొన్నిసార్లు ఆనందంతో, కొన్నిసార్లు విచారంతో. వాస్తవానికి,ఆనందం లేదు. మిమ్మల్ని నీటిలో ఉంచినప్పుడు, మరియు మీరు కొన్ని సార్లు మునిగిపోతూ కొన్నిసార్లు పైకి తేలుతూ వున్నప్పుడు,దానిని ఆనందం అని పిలువరు. తాత్కాలికంగా కొద్ది సమయం పైకి తేలడం,ఆ తర్వాత మళ్లీ మునిగిపోవటం, అది ఆనందం కాదు. " అందువలన చైతన్య మహప్రభు ఈ విధంగా ఉపదేశిస్తున్నారు "ఎందుకు మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు," māyār bośe, "మాయ యొక్క తెర చేత?" అయితే ఏమి చేయవలసివుంది? అతను చెబుతున్నాడు జీవ కృష్ణ-దాస్,ఇ విశ్వాస్ కేవలం మీరు భగవంతుని సేవకుడనని లేదా కృష్ణుని సేవకుడనని విశ్వసించండి. Jīv kṛṣṇa-dās, e viśvās, korle to' ār duḥkha nāi: ఎప్పుడైతే మీరు భగవంతుని లేదా కృష్ణుని సేవకుడనని విశ్వాసం కలిగినపుడు, వెంటనే మీ కష్టాలు నిలిచిపోతాయి. అప్పుడు ఇక ఏ ఇబ్బంది ఉండదు. " అందువల్ల చైతన్య మహప్రభు వీధులగుండా నడుస్తూ ఈ ఉపదేశం చేసారు. Jīv kṛṣṇa-dās, e viśvās, korle to' ār duḥkha nāi. తర్వాత భక్తివినోద ఠాకురు తన వ్యక్తిగత అనుభవాన్ని వివరిస్తున్నారు. వారు చెప్తున్నారు, జే సకల విపద్"నేను అన్ని రకాల ప్రమాదాల నుండి విడుదల అయ్యాను." గాయ్ భక్తివినోద. భక్తివినోద ఠాకుర, వారు గొప్ప ఆచార్యులు, వారి స్వానుభవాన్ని విధంగా చెబుతున్నారు.. ఎప్పుడైతే నేను హరే కృష్ణ లేదా రాధా కృష్ణుల నామాన్ని జపిస్తానో, నేను అన్ని రకాల అపాయాల నుండి విముక్తుడనవుతాను. Jay sakal vipod. Jakhon ami o-nām gāi, ఎప్పుడైతే నేను భగవన్నామాన్ని,హరే కృష్ణ లేదా రాధా కృష్ణ అని జపిస్తానో, వెంటనే నా అపాయాలన్నీ దూరమవుతాయి. రాధా-కృష్ణ బోలో, సంగే చలో. అందువల్ల చైతన్య మహప్రభు చెబుతున్నారు, నేను వీధిలో నడుస్తూ మిమ్మల్ని యాచిస్తున్నాను. దేనిని యాచిస్తున్నారు? మీరు కేవలం భగవన్నామాన్ని కీర్తించండి. ఇది నా అభ్యర్థన, యాచన. " రాధా-కృష్ణ బోలో, సంగె చలో. " మరియు కేవలం నన్ను అనుసరించండి." Rādhā-kṛṣṇa bolo, saṅge calo, ei-mātra bhikṣā cāi,"నేను మీ తరపు నుంచి కేవలం దీన్నే అభ్యర్థిస్తున్నాను, మీరు హరే కృష్ణ మంత్రాన్ని జపించండి మరియు నన్ను అనుసరించండి, తద్వారా ఈ భౌతిక సాగరంలో మీ యొక్క జీవన పోరాటం ఆపివేయబడుతుంది.. "