TE/Prabhupada 0405 - భగవంతుడు ఒక వ్యక్తి అని రాక్షసులు అర్థం చేసుకోలేరు. అది అసురత్వం



Lecture on SB 7.7.30-31 -- Mombassa, September 12, 1971


దేవుడు ఒక వ్యక్తి అని రాక్షసుల అర్ధంచేసుకోలేరు. అది అసురత్వం. వారు గ్రహించలేరు ... వారు గ్రహించలేరు కాబట్టి వచ్చిన చిక్కల్లా ఏంటంటే వారు భగవంతున్ని తమతో పోల్చుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

డాక్టర్ కప్ప గారు, డాక్టర్ కప్ప గారి కథ. డాక్టర్ కప్ప గారు అట్లాంటిక్ మహాసముద్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తన మూడు అడుగుల బావితో పోల్చుకుని, అలా వుంది సంగతి. అతను అట్లాంటిక్ మహాసముద్రం ఉందని తెలుసుకున్నప్పుడు, అతను తన పరిమిత స్థలంతో ఆ మహాసముద్రాన్ని పోల్చకుంటున్నాడు. అది నలుగు అడుగులు వుండవచ్చు, లేదా ఐదు అడుగులు కావచ్చు, మహా అయితే అది పది అడుగులు వుండవచ్చు, ఎందుకంటే అతను మూడు అడుగుల పరిధిలో ఉన్నాడు. స్నేహితుడు ఈ విధంగా చెప్పాడు ", నేను నీటిసముదాయాన్ని చూసాను, అనంతమైన జలం" ఆ అనంతాన్ని, అతను కేవలం కల్పనలు చేసుకుంటూ, "ఎంత విస్తరము కావచ్చు? నా బావి మూడు అడుగులు, అది నలుగు అడుగులు వుండవచ్చు,లేదా ఐదు అడుగులు, "అతను అలా ఆలోచిస్తున్నాడు. కానీ అతను లక్షల కోట్ల అడుగులకు వెళ్ళినా, అయినా అది ఇంకా పెద్దది.అది వేరే విషయం. అందువలన, నాస్తిక వ్యక్తులు, రాక్షసులు, వారు తమకు తోచినట్లు ఆలోచిస్తారు, దేవుడు, కృష్ణుడు ఇలా వుండవచ్చు, కృష్ణుడు ఈ విధంగ ఉండవచ్చు, కృష్ణుడు ఈ విధంగా ఉండవచ్చు. సాధారణంగా వారు కృష్ణున్ని తమతో పోల్చుకుని ఈ విధంగా అంటారు. కృష్ణుడు గొప్పవాడు కాదు. వారు దేవుడు గొప్పవాడని నమ్మరు. వారు ఈ విధంగా ఆలోచిస్తారు ,దేవుడు నా అంత గొప్పవాడు.నేను కూడా దేవుడినే.ఇది రాక్షసత్వ స్వభావం.