TE/Prabhupada 0406 - కృష్ణుడి విజ్ఞానం తెలిసిన ఎవరైనా, అతను ఆధ్యాత్మిక గురువుగా ఉండవచ్చు



Discourse on Lord Caitanya Play Between Srila Prabhupada and Hayagriva -- April 5-6, 1967, San Francisco


ప్రభుపాద: తొలి సన్నివేశం విజయ నృసింహ ఘర్ ఆలయ పర్యటన.

హయగ్రీవ: విజయ ...

ప్రభుపాద: విజయ నృసింహఘర్.

హయగ్రీవ: నేను దీని యొక్క అక్షర క్రమాన్ని తరువాత తెలుసుకుంటాను.

ప్రభుపాద: నేను అక్షరక్రమాన్ని చెబుతున్నాను.V-i-j-a-y N-r-i-s-i-n-g-a G-a-r-h. విజయ నృసింహ ఘర్ దేవాలయం. ఇది ఆధునిక విశాఖపట్నపు నౌకాశ్రయానికి సమీపంలో ఉంది. విశాఖపట్నంలో గొప్ప భారతీయ ఓడరేవు ఉంది. గతంలో విశాఖపట్నంలో ఇది లేదు. దానికి దగ్గరలో, ఆ స్టేషన్ నుండి అయిదు మైళ్ళ దూరములో కొండ మీద ఆ చక్కని దేవాలయం ఉంది. అందువల్ల ఆ ఆలయదృశ్యం ఉంటుందని నేను భావిస్తున్నాను, చైతన్య మహాప్రభు ఆ దేవాలయాన్ని సందర్శించారు. ఆ ఆలయదర్శనం తరువాత, అతను గోదావరి నది ఒడ్డుకు వచ్చారు. ఎలాగైతే గంగా నది చాలా పవిత్ర నదో, అదేవిధంగా అటువంటివి నాలుగు ఇతర నదులు ఉన్నాయి. యమున, గోదావరి, కృష్ణ, నర్మద. గంగ, యమున, గోదావరి, నర్మద, కృష్ణ. ఈ ఐదు నదులు పరమ పవిత్రమైనవిగా పరిగణించబడుతున్నాయి. అందువలన వారు గోదావరి ఒడ్డుకు వచ్చారు, ఒక చెట్టు కింద ఒక చక్కని ప్రదేశంలో కూర్చుని, ఆయన హరేకృష్ణ మంత్రజపము చేస్తున్నారు. ఆ సమయంలో అతను ఆ దారి గుండా ఒక గొప్ప ఊరేగింపు వస్తున్నట్లు గమనించారు, మరియు అది ప్రస్తుత దృష్టాంతం... ఆ ఊరేగింపులో... పూర్వం రాజులు మరియు గవర్నర్లు, వారు తమ పరివారంతోకూడి గంగయందు స్నానం చేయటానికి వచ్చేవారు, డక్కాలు మోగించేవారు, బ్రాహ్మణులు మరియు అన్ని రకాల దానసామాగ్రితో కూడి, ఈ విధంగా వారు స్నానం చేయటానికి వచ్చేవారు. చైతన్య మహప్రభు ఎవరో ఆ గొప్ప ఊరేగింపులో వస్తున్నట్లు గమనించారు, వచ్చేది మద్రాసు రాష్ట్ర గవర్నర్ రామానంద రాయ అని అతను తెలిసుకున్నారు. సార్వభౌమ భట్టాచార్య మహాప్రభుకు ఇలా విన్నవించారు "మీరు దక్షిణ భారతదేశానికి వెళుతున్నారు. కాబట్టి మీరు రామానంద రాయ అనే వ్యక్తిని తప్పక కలుసుకోవాలి. అతను గొప్ప భక్తుడు." అందువల్ల అతను కావేరి నది ఒడ్డున కూర్చున్నాడు.మరియు రామానందరాయ ఊరేగింపులో వస్తున్నారు. మహాప్రభు అతను రామానంద రాయ అని గ్రహించారు.కానీ తాను సన్యాసి అయిన కారణాన అతన్ని పలకరించలేదు. కానీ గొప్ప భక్తుడు అయిన రామానంద రాయ అక్కడ ఒక చక్కని సన్యాసి కూర్చుని ఉండడం గమనించాడు, యువ సన్యాసి కూర్చుని హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తున్నాడు. సాధారణంగా ,సన్యాసులు, వారు హరే కృష్ణ మంత్రాన్ని జపించరు. వారు ఓంకారాన్ని జపిస్తారు, హరే కృష్ణ మంత్రాన్ని జపించరు.

హయగ్రీవ: వారు సన్యాసి కాబట్టి అతన్ని పలకరించలేదు అనడంలో మీ ఉద్దేశం ఏమిటి?

ప్రభుపాద: సన్యాసులు, వారికుండే కట్టుబాటు ప్రకారం అధిక ధనవంతుల నుండి యాచించ కూడదు లేదా వారిని చూడకూడదు అది నిబంధన.అధిక ధనవంతులైన స్త్రీ,పురుషుల గురించిన నిబంధన.

హయగ్రీవ: అయితే రామానంద రాయ భక్తుడు కదా.

ప్రభుపాద: అవును నిస్సందేహంగా అతను గొప్ప భక్తుడే , కానీ బయటకు అతను ఒక గవర్నర్. బాహ్యంగా. అందువల్ల చైతన్య మహప్రభు అతణ్ణి కలవలేదు, కానీ అతను "ఇక్కడ ఒక చక్కని సన్యాసి వున్నాడు" అని అర్థం చేసుకున్నాడు. అతనుగా ముందుకు వచ్చి,మహా ప్రభుకు గౌరవం ఇచ్చి ఆయన ముందు కూర్చున్నాడు. తర్వాత వారి పరస్పర పరిచయాలు జరిగాయి, మరియు చైతన్య మహాప్రభు ఈ విధంగా చెప్పారు. భట్టాచార్య ఇదివరకే మీ గురించి చెప్పారు. మీరు గొప్ప భక్తులు. కాబట్టి నేను మిమ్మల్ని చూడటానికి వచ్చాను." ఆ తరువాత అతను ఇలా బదులు చెప్పాడు, "బాగుంది, ఎటువంటి భక్తున్ని నేను? నేను ఒక డబ్బు మనిషిని, రాజకీయవేత్తను. కానీ మీవంటి పవిత్రుని నన్ను కలవమని చెప్పి భట్టాచార్య నా పైన గొప్ప దయ చూపించాడు. ఆవిధంగా మీరు వచ్చినట్లే, దయ ఉంచి కరుణతో నన్ను ఈ భౌతిక మాయ నుంచి ఉద్ధరించండి. " రామానంద రాయతో తిరిగి కలవడానికి సమయనిర్దారణ చేసుకున్నారు, మరియు ఇద్దరూ సాయంత్రం మళ్లీ కలుసుకున్నారు, మరియు అక్కడ ఆధ్యాత్మిక జీవిత పురోగతి గురించి చర్చ జరిగింది. చైతన్య మహాప్రభు అతడిని ప్రశ్నలు అడిగారు రామానందరాయ వాటికి బదులిచ్చారు. వాస్తవానికి, మహాప్రభు ఎలా ప్రశ్నించారు, అతను ఎలా సమధానమిచ్చాడు అనేది,అది సుదీర్ఘ చర్చ,

హయగ్రీవ: రామానంద రాయ,

ప్రభుపాద: అవును. హయగ్రీవ: బాగుంది! మరి వారి సమావేశానికి సంబంధించిన సన్నివేశం ముఖ్యమైనదా?

ప్రభుపాద: సమావేశం, సమావేశం, ఆ చర్చ మీరు ఇవ్వలనుకుంటున్నారా?

హయగ్రీవ: సరే.సన్నివేశానికి సంబంధించి చర్చ ముఖ్యమైనదయితే దానిని చేయవచ్చు.మీరు నేను చర్చను చేయలనుకుంటున్నారా?

ప్రభుపాద : మహాప్రభు రామానంద రాయను కలుసుకున్న సన్నివేశం ముఖ్యమైనది, అతను ఊరేగింపులో వచ్చే దృశ్యం చక్కనైనది. ఈ విషయాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇప్పుడు వారి మధ్య జరిగిన చర్చ విషయానికి వస్తే, చర్చ యొక్క సారంశం ఇలా ఉంది ...

హయగ్రీవ: నాకు సంక్షిప్త సారంశం ఇవ్వండి.

ప్రభుపాద: సంక్షిప్త సారంశం. ఈ సన్నివేశంలో చైతన్య మహాప్రభు విద్యార్థి అయ్యారు. అంటే పూర్తిగా విద్యార్థిగా కాదు. అతను ప్రశ్నించాడు , రామానంద రాయ సమాధానం చెప్పారు. సన్నివేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, చైతన్య మహాప్రభు సాధారణత్వాన్ని అనుసరించడం లేదు, కేవలం సన్యాసులు మాత్రమే ఆధ్యాత్మిక గురువులు అవ్వాలి. కృష్ణుడి విజ్ఞానం తెలిసిన ఎవరైనా, అతను ఆధ్యాత్మిక గురువుగా ఉండవచ్చు. మరియు ఈ విషయాన్ని ఆచరణాత్మకంగా చూపించడానికి,ఆయన సన్యాసి మరియు బ్రాహ్మణుడు అయినప్పటికీ, మరియు రామానంద రాయ ఒక శూద్రుడు,గృహస్థుడు, అయినప్పటికీ అతను ఒక విద్యార్థి వలె రామానంద రాయను ప్రశ్నించాడు. రామానంద రాయ ఒకరకంగా భావించారు, చెప్పాలంటే సంశయించాడు అని చెప్పవచ్చు. నేను ఒక సన్యాసికి ఉపదేశించే బోధకుడు స్థితిని ఎలా తీసుకోగలను? అప్పుడు చైతన్య మహాప్రభు ప్రత్యుత్తరం ఇచ్చారు, "లేదు, లేదు, సంకోచించకండి." ఆయన ఇలా అన్నారు, ఎవరైనా అతను సన్యాసి కావచ్చును లేదా గృహస్తుడు కావచ్చును. లేదా ఒక బ్రాహ్మణుడు కావచ్చు లేదా శూద్రుడు కావచ్చు, అది పట్టింపు లేదు. కృష్ణుడి విజ్ఞానం తెలిసిన వారెవరైనా, అతను గురువు స్థితిని తీసుకోవచ్చును. ఒక రకంగా చెప్పాలంటే అది ఆయన ఇచ్చిన బహుమతిగా చెప్పవచ్చును. ఎందుకంటే భారతీయ సమాజంలో,కేవలం బ్రహ్మణులు, సన్యాసులే ఆధ్యాత్మిక గురువులు అనే ముద్ర ఏర్పడింది. కానీ చైతన్య మహాప్రభు ఇలా చెప్పారు " అలా కాదు,ఎవరైనా సరే కృష్ణచైతన్య విజ్ఞానంలో ప్రవీణులైతే చాలు వారు ఆధ్యాత్మిక గురువులు కావచ్చు." మరియు చర్చ యొక్క సారాంశం ఇలా ఉంది ఎవరైనా భగవత్ ప్రేమ యొక్క ఉన్నతమైన పరిపూర్ణస్థితిలో ఎలా సుప్రతిష్టులు అవగలరు. ఆ భగవత్ప్రేమ గురించి వర్ణించబడింది, భగవత్ప్రేమ ఉంది, నా ఉద్దేశం రాధారాణిలో అవధులు లేనంతగా వుంది. భావ స్థితి లో, రాధారాణి యొక్క రూపంలో. రామానంద రాయ, రాధారాణి యొక్క సహచారిని అయిన లలిత-సఖి యొక్క రూపంలో, వారిద్దరూ పరస్పరం ఆలింగనం చేసుకుని పారవశ్యంతో నృత్యం చేయడం ప్రారంభించారు. ఆ సన్నివేశం చివరలో ఉంటుంది. వారిద్దరూ పారవశ్యంతో నృత్యం చేయటం ప్రారంభించారు.

హయగ్రీవ: రామనంద రాయ.

ప్రభుపాద: చైతన్య మహప్రభు కూడా. హయగ్రీవ:బాగుంది