TE/Prabhupada 0407 - హరిదాస జీవిత చరిత్ర ఏమిటంటే ఆయన ఒక ముస్లిం కుటుంబములో జన్మించారు



Discourse on Lord Caitanya Play Between Srila Prabhupada and Hayagriva -- April 5-6, 1967, San Francisco


ప్రభుపాద : ఈ సమయంలోనే ఒక బ్రాహ్మణుడు వచ్చారు చైతన్య మహాప్రభుని ఆహ్వనించాడు నేను వారణాసి యొక్క అందరు సన్యాసులను ఆహ్వానించాను, కానీ నీవు ఈ మయావాది సన్యాసిని కలుసుకోలేదని నాకు తెలుసు, కాని నేను మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను. మీరు నా ఆహ్వానాన్ని దయతో అంగీకరించాలి. " ఈ రీతిగా చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతిని కలిసే అవకాశాన్ని చూశారు. మహాప్రభువు అతని ఆహ్వానాన్ని అంగీకరించారు, ఒక సమావేశం జరిగింది, ప్రకాశానంద సరస్వతితో వేదాంత-సూత్రం చర్చలు జరిగాయి, ఆయన అతన్ని వైష్ణవునిగా మార్చాడు. అది మరొక సంఘటన.

హయగ్రీవ : అతనికి ఎంత వయస్సు?

ప్రభుపాద: ప్రకాశానంద సరస్వతి? అతను కూడ వృద్ధుడు. అరవై సంవత్సరల కన్నా తక్కువ కాదు. అవును.

హయగ్రీవ : ఈ పట్టణంలో అతని పాత్ర ఏమిటి? అతను ఏమిటి ... అతను ఒక వేదాంతవేత్తా?

ప్రభుపాద: ప్రకాశానంద సరస్వతి. అతను ఒక మయావాది సన్యాసి. అతను చైతన్య మహాప్రభు యొక్క సూత్రాన్ని అంగీకరించారు, ఆయన్ని గౌరవించాడు. అతను ఆయన పాదాలను తాకారు. అతను సహితం చేరాడు. కానీ అతను అధికారికంగా వైష్ణవుడని అక్కడ చెప్పబడలేదు , కానీ అతను చైతన్య మహాప్రభు యొక్క తత్వాన్ని అంగీకరించారు. కానీ అధికారికంగా సార్వభౌమ భట్టాచార్య, అతడు వైష్ణవుడు అయ్యరు. అప్పుడు భగవంతుడు హరిదాసని కలుస్తాడు ...

హయగ్రీవ : ఐదవ దృశ్యం.

ప్రభుపాద : ఐదవ దృశ్యం.

హయగ్రీవ : ఇది హరిదాస ఠాకురా?

ప్రభుపాద : హరిదాస ఠాకురా.

హయగ్రీవ : ఎవరు మరణిస్తారు? హరిదాసుని మరణం?

ప్రభుపాద : అవును. హరిదాస చాలా వృద్ధుడు. అతను మహమ్మదీయుడు

హయగ్రీవ : అతను నదిలో వేయబడిన వ్యక్తి.

ప్రభుపాద : అవును.

హయగ్రీవ: అతను చివరికి ఐదవ సన్నివేశంలో, ఇక్కడ తన ముగింపులో కలుసుకున్నారు.

ప్రభుపాద : మనము వారిని ఉద్దేశించినది కాదు ... వాస్తవానికి, హరిదాస ఠాకురా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉన్నారు కానీ మనము చూపించబోవడం లేదు.

హయగ్రీవ : అవును. అయితే సరే ఈ ప్రత్యేక సంఘటన. ప్రభుపాద : ప్రత్యేకమైన సంఘటన ముఖ్యమైనది, చైతన్య మహప్రభు ఒక బ్రాహ్మణుడు అతను ఒక సన్యాసి. సాంఘిక ఆచారం ప్రకారం అతను కూడ ఒక మహమ్మదీయుని తాకకూడదు, కానీ ఈ హరిదాస ఠాకురా ఒక మహమ్మదీయుడు, అతని మరణంతో ఆయన ఆ శరీరాన్ని ఎత్తుకొన్నాడు నృత్యం చేశాడు, అతన్ని స్మశానంలో ఉంచాడు ప్రసాదం వితరణము చేసాడు. మరియు హరిదాస ఠాకురా కొరకు రెండు, మూడు రోజులు ఆయన అనుభూతి బాగాలేదు. అతను మహమ్మదీయుడు అందువలన అతను జగన్నాథ ఆలయంలో ప్రవేశించలేదు. ఎందుకంటే హిందువులు చాలా కఠినంగా ఉన్నారు. అతను భక్తుడు, అతను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎందుకు అతను అల్లరి సృష్టించాలి? అందువల్ల చైతన్య మహాప్రభు తన ప్రవర్తనను ప్రశంసించాడు, అతను ఏమైనా సృష్టించాలని కోరుకోలేదు ... ఎందుకంటే అతను భక్తుడు. బలవంతంగా అతను ఆలయనికి వెళ్ళడం లేదు. కానీ చైతన్య మహాప్రభు స్వయంగా రోజూవారీగ వచ్చి అతనిని చూశారు. సముద్రంలో స్నానం చేయటానికి వెళ్తున్నప్పుడు, అతను మొదట హరిదాసని చూస్తాడు. హరిదాస నువ్వు ఏమి చేస్తున్నావు? హరిదాస తన గౌరవం చూపేవారు అతను కొంతసేపు కూర్చుని మాట్లాడతాడు. అప్పుడు చైతన్య మహాప్రభు తన స్నానం చేసుకోవడానికి వెళతారు. ఈ విధంగా, ఒకరోజు ఆయన వచ్చినప్పుడు ఆయన చూసారు హరిదాస అంత బాగాలేరు. హరిదాస మీ ఆరోగ్యం ఎలా ఉంది? " అవునయ్య అది బాగాలేదు ... ఏమైనప్పటికీ, అది శరీరం." అప్పుడు మూడవ రోజు హరిదాస తన శరీరాన్ని విడిచి వెళ్తున్నాడని చూశాడు. అందువల్ల చైతన్య మహాప్రభు అడిగినారు, " హరిదాస, నీవు ఏం కోరుకుంటున్నావు?" వారిద్దరూ అర్థం చేసుకోగలరు. హరిదాస చెప్పుతారు, "ఇది నా చివరి దశ. దయచేసి మీరు నా ఎదుటకు రండి అందువల్ల చైతన్య మహాప్రభు అతని ముందు నిలబడెను, అతను తన శరీరాన్ని విడిచిపెట్టాడు. (విరామం)

హయగ్రీవ : మీరు అది చెప్పారు ...

ప్రభుపాద : అతను పరమపదించిన తరువాత శరీరాన్ని చైతన్య మహాప్రభు స్వయంగా తీసుకున్నారు, ఇతర భక్తులు అతన్ని సముద్ర తీరానికి తీసుకువెళ్లారు స్మశానంలో అతనికి గొయ్యి త్రవ్వించారు. ఆ సమాధి ఇప్పటికీ జగన్నాథ పురిలో ఉంది. హరిదాస ఠాకురా యొక్క సమాధి, సమాధి. చైతన్య మహాప్రభు నృత్యం చేయటం ప్రారంభించారు. ఇది ఆచారం . ఎందుకంటే వైష్ణవ ఆచారంలో, ప్రతిదీ కీర్తనం నృత్యం. ఇది హరిదాస ఠాకురా యొక్క ఆఖరి వేడుక.

హయగ్రీవ : హరిదాసతో చైతన్య నృత్యం గురించి మీరు చెప్పారు?

ప్రభుపాద: హరిదాస శరీరం . చైతన్య ...ఆ చనిపోయిన శరీరం. హరిదాస మృతదేహం.

హయగ్రీవ : ఓహ్ తన మృతదేహంతో?

ప్రభుపాద: అవును. అతని మృతదేహంతో.

హయగ్రీవ : అతని మరణం తరువాత.

ప్రభుపాద: అతని మరణం తరువాత.

హయగ్రీవ : చైతన్య ...

ప్రభుపాద: నేను హరిదాస సజీవంగా ఉన్నాడని, నృత్యం చేస్తున్నాడని చెప్పను. కానీ హరిదాస మరణించిన తరువాత, చైతన్య మహాప్రభు స్వయంగా శరీరాన్ని తీసుకున్నాడు, కీర్తనతో నృత్యం చేయటం మొదలుపెట్టాడు. తన అంత్యక్రియల కార్యమును చైతన్య మహాప్రభు స్వయంగా నిర్వహించారు. ఆయన ఆ శరీరంను తీసుకుని సముద్రతీరం స్మశానంలో పెట్టారు ఆయన...

హయగ్రీవ : ఆయన నిర్వహించారా...

ప్రభుపాద : అవును. అంత్యక్రియల కార్యము, అవును.

హయగ్రీవ : కీర్తనతో. ప్రభుపాద: కీర్తనతో. కీర్తన ఎల్లప్పుడూ ఉంది. ఖననం తరువాత ప్రసాద వితరణము జరిగింది మరియు కీర్తన హరిదాస ఠాకురా. ఇక్కడ మీరు హరిదాసలో ఎలాంటి భావాన్ని చూపించవలసి ఉంది.

హయగ్రీవ : అది సరే. ఇంకా ఏమైనా ఉన్నవా? హరిదాస గురించి ఏదైనా ఇతర సమచారం ఉందా?

ప్రభుపాద: హరిదాస జీవిత చరిత్ర అతను మహమ్మదీయ కుటుంబంలో జన్మించినట్లు. ఏదో క్రమంలో ఎలాగో అతను భక్తుడయై, 300,000 సార్లు జపించేవారు, హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే హరే, చైతన్య మహాప్రభు అతనిని నామాచార్య గా చేసాడు. అందువలన మనము అతని మహిమను కీర్తిస్తాము, "నామాచార్య హరిదాస ఠాకురా కీ జయ." ఎందుకంటే అతడు హరే కృష్ణని జపించే ప్రామణికాన్ని ఆచరింప చేసాడు. అప్పుడు, చైతన్య మహాప్రభు సన్యాసను తీసుకున్నప్పుడు, హరిదాస ఠాకురా కోరుకున్నాడు, నా ప్రియమైన భగవంతుడా, మీరు నవద్వీపాన్ని వదిలేస్తున్నారు, తర్వాత నా జీవితంలో ఉపయోగం ఏమిటి? మీరు నన్నైనా తీసుకెళ్లండి లేదా నన్ను చనిపోనివ్వండి. " అందువల్ల చైతన్య మహాప్రభు అన్నాడు, "లేదు ఎందుకు చనిపోతావు? నీవు నాతో వచ్చేయి." అందువలన అతన్ని జగన్నాథ పురికి తీసుకువెళ్ళాడు. జగన్నాథ పురి వద్ద, తను మహమ్మదీయ కుటుంబంలో జన్మించాడని భావించి, అతను ప్రవేశించలేదు. అందువల్ల చైతన్య మహాప్రభు అతను కాశీనాథ మిశ్ర ఇంటిలో ఒక స్థానాన్ని ఇచ్చారు అక్కడ అతను జపము చేసుకుంటాడు చైతన్య మహాప్రభు అతడికి ప్రసాదం పంపించేవారు. ఆ విధంగా అతను తన రోజులు వెళ్ళబుచ్చేవాడు. చైతన్య మహాప్రభు ప్రతిరోజూ అతనిని చూడటనికి వచ్చేవారు, ఒకరోజు అతను ఈవిధంగా మరణించాడు.