TE/Prabhupada 0418 - ఇప్పుడు దీక్ష అనగా కార్యక్రమాలు ప్రారంభము
Lecture & Initiation -- Seattle, October 20, 1968
ఈ దీక్ష… మన విద్యార్థుల్లో చాలామంది దీక్ష తీసుకున్నారు. మన విద్యార్థుల్లో లో కొందరు ఈ సాయంత్రం దీక్ష తీసుకోబోతున్నారు. దీక్ష అంటే ఈ ఉద్యమం లో చేరడానికి మూడవ దశ . మొదటి దశ శ్రద్ధ ,కొద్దిగా విశ్వాసం ఎలా అంటే మన విద్యార్థులు మార్కెట్ వెళ్తున్నప్పుడు వారు జపం చేస్తూ ఉంటారు చాలామంది ప్రజలు కొంత డబ్బును సేవకు ఇస్తున్నారు, కొందరు మన Back to Godhead పత్రికను కొంటున్నారు ఇది విశ్వాసం యొక్క ఆరంభం. ఇక్కడ ఒక మంచి ఉద్యమం నేను కూడా సహకరిస్తాను అదౌ శ్రద్ధ , అప్పుడు అతడింకా కొంచెం ఆసక్తిని కలిగి ఉంటే అతడు ఇక్కడికి వస్తాడు, తరగతులకు వస్తాడు సరే, ఈ ప్రజలు కూడా ఇక్కడ ఏమి బోధిస్తున్నారు చూద్దాం ఈ కృష్ణ చైతన్యములో అని వారు వస్తారు. ఇది రెండవదశ మొదటి దశ ఈ ఉద్యమం కోసం స్వతహాగా సానుభూతి రెండవ దశలో మన కార్యక్రమాలలో పాల్గొనాలని లేదా చేరాలని మీరు ఇక్కడికి దయతో వస్తున్నారు నా నుంచి వింటున్నారు అదే విధంగా ఎవరైనా మరింత ఆసక్తి కలిగి ఉంటే లేదా అతని విశ్వాసం మరింత పురోభివృద్ధి చెందితే అప్పుడు అతనువస్తాడు, అది రెండవ దశ. మూడవ దశ Adau sraddha - tatha sadhu sanga atha bhajana kriya ( cc Madhya 23.14-15) ఇప్పుడు దీక్ష అనగా కార్యక్రమాలు ప్రారంభము , కార్యక్రమాలు ప్రారంభం పరిపూర్ణ స్థాయికి ఈ కృష్ణ చైతన్యమును ఎలా అభివృద్ధి చేయచ్చు. అదే దీక్షగా పిలవబడుతుంది. దీక్ష అంటే అంతా అయిపోయింది అని అర్థం కాదు ఇది మూడవదశ అప్పుడు నాల్గవ దశలో దీక్ష తీసుకున్న వ్యక్తి అతడు నియమ నిబంధనలను పాటిస్తాడు ఎప్పుడైతే అతడు హరే కృష్ణ మంత్రాన్ని స్థిరమైన లెక్కింపుతో చేస్తాడో అప్పుడు క్రమంగా అతనిలో ఉన్న అనుమానాలు అంతరించి పోతాయి అనుమానాలు ఏమిటి? మనం మన విద్యార్థులను అడుగుతాం వీటిని ఆపమని మాంసాహారం అక్రమ లైంగిక జీవితం మద్యం మత్తు మరియు జూదంలో పాల్గొనటం ఈ నాలుగు విషయములు సమాజంలో సాధారణంగా ఈ నాలుగు విషయములు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో చాలా ప్రముఖంగా ఉన్నాయి కానీ దీక్ష తీసుకున్న ఈ విద్యార్థులు జపం కూడా చేయటం వలన వారు చాలా సులభంగా ఈ నాలుగు విషయాలు ఏ కష్టం లేకుండా విడిచిపెడతారు దీనినే అనర్థనివృత్తి అంటారు అదే నాల్గవ దశ అయిదవ దశలో అతను స్థిరపడతాడు అవును ఎలా అయితే ఒక విద్యార్థి మిస్టర్ ఆండర్సన్ అతన్ని నేను చూడలేదు కానీ మన ఇతర భక్తులతో సాంగత్యము వలన, అతను రాశారు ఈ కృష్ణ చైతన్యం కోసం నా మొత్తం జీవితాన్ని నేను అంకితం చేయాలనుకుంటున్నాను అని దీన్ని వారు నిష్ఠ అంటారు Tato nishta tato ruchi. రుచి అంటే వారు ఒక రుచిని పొందుతారు. ఈ అబ్బాయిలు ఎందుకు బయిటకు వెళుతున్నారు? ఈ జపం, కీర్తన రుచి వారికి నచ్చిoది. వారు ఒక రుచిని అభివృద్ధి చేసుకుంటున్నారు. లేకపోతే ఏమి లేని దాని కోసము ఎవరూ కూడా వారి సమయాన్ని వృధా చేసుకోరు వారు చదువుకున్న వారు పెద్ద వారు అయ్యారు అందుకే రుచి స్థిరపడిన ఆ తర్వాత రుచి అనేది tathāsaktis రుచి ఉన్నప్పుడు ఆసక్తి అనుబంధం ఉంటుంది. అతడు దానిని వదులుకోలేడు నాకు చాలా ఉత్తరాలు వస్తాయి కొందరు విద్యార్థులు వారి గురువుసోదరులతో సర్దుకొనలేక వెళ్లిపోతారు తర్వాత వారే వ్రాస్తారు" నేను వెళ్ళలేను, నేను వెళ్ళలేను " అని . ఎందుకంటే అతడు ఆకర్షితుడు అయ్యాడు. చూశారా మీరు? ఉమాపతి ఆ లేఖను రాశారు అతనికి చాలా కష్టంగా ఉన్నాది అని అతడు ఉండలేకపోయాడు, వెళ్లలేకపోయాడు .అతడు డల్లాస్ లో ఉన్నాడు .మీరు చూడండి? సంస్థను అతడు విడిచిపెట్టలేడు లేదా కొంత అపార్థం, అతడు గురువు సోదరులతో కలసి జీవించ లేక పోయాడు కానీ ఇది తాత్కాలికమైనది దీనిని ఆసక్తి అని పిలుస్తారు. Tathāsaktis tato bhāva. తరువాత క్రమంగా పెరుగుతూ, కొంత పారవశ్యం ఉండే స్థితి, ఎప్పుడూ కృష్ణుని గురించి ఆలోచిస్తూ దాని తర్వాత అదే పరిపూర్ణ దశ . కృష్ణ చైతన్యాన్ని 100% ప్రేమిస్తాడు ఇది పద్ధతి.