TE/Prabhupada 0419 - దీక్ష అంటే కృష్ణ చైతన్యం యొక్క మూడవ దశ



Lecture & Initiation -- Seattle, October 20, 1968


ఈ దీక్ష అంటే కృష్ణ చైతన్యం యొక్క మూడవ దశ ఎవరైతే దీక్షను తీసుకుంటున్నారో, వారు ఈ దీక్ష యొక్క నియమ నిబంధనలను పాటించాలని గుర్తుంచుకోవాలి అది ఎలా అంటే ఎలాగైతే ఒక వ్యక్తి ఒక రకమైన వ్యాధిని నయం చేసుకోవాలనుకుంటే అతడు వైద్యుడు చెప్పిన నియమములను పాటించాలి. అది అతనికి అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవటానికి సహాయం చేస్తుంది కావున ఈ నాలుగు నియమాలను రోజూ అనుసరించాలి. కనీసం 16 మాలలు జపం చేయాలి క్రమక్రమంగా అతనిలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆసక్తిని మరియు అందులో గల రుచిని తెలుసుకుంటాడు అప్పుడు కృష్ణ ప్రేమ సహజంగా సిద్ధిస్తుంది ఆ ప్రేమ అందరి హృదయాలలో ఉంది కృష్ణ ప్రేమ, అది ఒక బాహ్య విషయము కాదు మనము బలవంతముగా ఎక్కించుట లేదు ఇది ప్రతి చోట, ప్రతి జీవిలో ఉంది లేకపోతే అమెరికన్ బాలబాలికలు ఎలా దీనిని తీసుకుంటున్నారు ఇది ప్రతి చోట లేకపోతే? ఇది ఉంది. నేను కేవలము సహాయం చేస్తున్నాను. ఎలా అంటే అగ్గి పుల్లల వలె: అగ్ని ఉంది. కేవలం రుద్దటం అనే చర్య సహాయం తీసుకోవాలి అంతే అగ్ని ఉంది. రెండు పుల్లలను రుద్దడం ద్వారా అగ్నిని పుట్టించలేరు. దాని పైన రసాయనాలు లేకుంటే అలాగే కృష్ణ చైతన్యము అందరి హృదయంలో ఉంది కేవలం ఈ సాంగత్యం, కృష్ణ చైతన్య సాంగత్యం ద్వారా వారిలో ఉన్న కృష్ణ చైతన్యన్ని పునరుద్ధరించుకోవాలి ఇది కష్టమైనది లేదా అసాధ్యమైనది లేదా భరించలేనిది కాదు. అంతా బాగుంటుoది అందరికీ మా అభ్యర్థన, అందరు ఈ అద్భుతమైన బహుమతిని తీసుకోండి కృష్ణ చైతన్య ఉద్యమమును మరియు హరే కృష్ణ జపమును, మీరు సంతోషంగా ఉంటారు. అది మా కార్యక్రమం .

చాలా ధన్యవాదములు