TE/Prabhupada 0420 - నీవు ఈ ప్రపంచం యొక్క దాసిగా భావించవద్దు



Lecture & Initiation -- Seattle, October 20, 1968


ప్రభుపాద : (యజ్ఞము కొరకు మంత్రాలను ఉచ్ఛరిస్తున్నారు, భక్తులు తిరిగి ఉచ్ఛరిస్తున్నారు) ధన్యవాదములు: ఇప్పుడు నాకు పూసలు ఇవ్వండి. పూసలు ఎవరైనా ... (ప్రభుపాద పూసల పైన జపం చేస్తున్నారు.భక్తులు జపం చేస్తున్నారు ) నీ పేరు ఏమిటి ? Bill, బిల్

ప్రభుపాద : నీ ఆధ్యాత్మిక నామము - విలాసవిగ్రహ. v-i-l-a-s-a -v-i-g-r-a-h-a v-i-l-a-s-a v-i-g-r-a-h-a v-i-l-a-s-a నీవు ఇక్కడి నుండి ఆరంభించు, పెద్ద పూస: హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే ఈ వేలు మీరు తాకకూడదు .అదే విధంగా తదుపరిది. ఈ విధంగా, మీరు ఈ వైపుకు వస్తారు ,మళ్ళీ ఇక్కడ నుండి ఈ వైపుకు ప్రారంభించండి. నీ గురు సోదరులు నీకు బోధిస్తారు. ఇంకా మీరు నివారించవలసిన పదిరకాల అపరాధములు ఉన్నాయి . అవి నేను వివరిస్తాను. మీ వద్ద కాగితం ఉన్నదా, ఆ 10 రకాల అపరాధములు

భక్తుడు: అవును.

ప్రభుపాద :నమస్కరిoచు పదము వెంట పదము విలాస విగ్రహ పలుకుతుండగా Nama om vishnu- padaya krishna presthaya bhutale (విలాస-విగ్రహ తిరిగి పలుకుతున్నాడు ఒక్కొక్క పదమును)

నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే
శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే

హరేకృష్ణ జపించండి ఆనందంగా ఉండండి. దన్యవాదములు. హరే కృష్ణ. భక్తులు జపం చేస్తున్నారు . నీ పేరు ?

రాబ్:రాబ్.

ప్రభుపాద : రాబ్ మీ ఆధ్యాత్మిక నామము రేవతి నందన R-e-v-a-t-i, Revati, nandana, n-a-n-d-a-n. రేవతి నందన రేవతి యొక్క కుమారుడు వసుదేవుని భార్యలలో రేవతి ఒకరు .కృష్ణుని యొక్క సవతి తల్లి, బలరాముడు వారి కుమారుడు . అందువల్ల రేవతి నందన అంటే బలరాముడు. రేవతి నందన దాస బ్రహ్మచారి, మీ పేరు. ఇక్కడ నుండి జపం చేస్తూ వెళ్ళు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే తర్వాత తదుపరి ఈ విధంగా నీవు ఈ వైపు వస్తావు , మళ్లీ ఇక్కడనుండి ప్రారంభించు నీ గురు సోదరులు నీకు బోధిస్తారు. నమస్కరించు నమస్కరించు . (రేవతి నందన పదం వెంట పదం పలుకుతున్నారు)

నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే
శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే

ఇప్పుడు మీ మాలను తీసుకోండి. ప్రారంభించండి. జపం చేయండి . (భక్తులు జపం చేస్తారు ) ఇది దేనితో చేయబడింది? లోహమా? ఇది ఎందుకు అంత బరువుగా ఉంది?

యువకుడు : ఇది విత్తనం స్వామిజీ

ప్రభుపాద : ఓ! ఇది విత్తనమా? ఏమి విత్తనము ?

యువకుడు : నాకు తెలియదు . పెద్ద విత్తనము.

ప్రభుపాద: ఇది చాలా బరువుగా ఉంది . బుల్లెట్ లాగా ఉంది .కృష్ణ బుల్లెట్ (నవ్వు) భక్తులు జపం చేస్తున్నారురు. నీ ఆధ్యాత్మిక నామము శ్రీమతి దాసి. శ్రీమతి. s-r-i-m-a-t-i .శ్రీమతి దాసి. శ్రీమతి అంటే రాధారాణి.

శ్రీమతి: అంటే ఏమిటి?

ప్రభుపాద: శ్రీమతి అంటే రాధారాణి. రాధారాణి దాసి అంటే నీవు రాధారాణి యొక్క దాసివి. నీవు ఈ ప్రపంచం యొక్క దాసిగా భావించవద్దు ( నవ్వు) రాధారాణి యొక్క దాసిగా మారటం చాలా అదృష్టం .అవును. అందువలన, నీ పేరు శ్రీమతి దాసి నీవు ఇక్కడ నుండి జపం చేయటం మొదలుపెడతావు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే తరవాత తదుపరి . ఈ విధంగా వచ్చి మళ్లీ ప్రారంభించు. కనీసం 16 మాలలు. శ్రీమతి పదం వెంట పదం పలుకుతుంది.

నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే
శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే

సరే. తీసుకో. సంతోషంగా ఉండు.

శ్రీమతి: హరే కృష్ణ.

ప్రభుపాద: ఆ కాగితం ఎక్కడ ఉంది ? 10 రకాల అపరాధములు? ఆ కాగితం ఎక్కడ వుంది? జపము చేయటములో 3 దశలు ఉన్నాయి అవి ఏమిటి ?

యువకుడు : ఆమె చిత్రీకరించిన చిత్రం.

ప్రభుపాద :ఓ! మీరు చిత్రించారా ఈ చిత్రాన్ని? మంచిది . చాలా బాగుంది. చాలా ధన్యవాదములు

జాహ్నవ: మీ ఆశీస్సులతో , ఇది షరాన్ కి ఇస్తారా ? మీ ఆశీస్సులతో ఇది షరాన్ కి ఇస్తారా?

యువకుడు : శ్రీమతి దాసి.

ప్రభుపాద: ఓ! ఇది బహుమతి. శ్రీమతి: ధన్యవాదములు