TE/Prabhupada 0428 - మానవునికి ఉన్న ప్రత్యేకమైన ప్రయోజనం నేను ఏమిటి అని అర్థం చేసుకోవటం
Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972
మనం ఎంత అజ్ఞానంతో ఉన్నామో అర్థం చేసుకోటానికి ప్రయత్నించండి. మనం అంతా అజ్ఞానంలో ఉన్నాము. ఈ జ్ఞానము కావలసింది, ఎందుకంటే, ఈ అజ్ఞానము వలన, ఒకరితో ఒకరు పోట్లాడుకుంటున్నారు. ఒక దేశము మరొక దేశముతో, ఒక మతస్తుడు మరొక మతస్తుడితో కానీ ఇది అంతా అజ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. నేను ఈ శరీరం కాదు. అందువల్ల శాస్త్రం చెప్తుంది, Yasyatma-buddhih kunape tri-dhatuke( SB 10.84.13) Atma-buddhi kunape, ఇది ఎముకలు మరియు కండరాలతో కూడి ఉన్న సంచి ఇది మూడు ధాతువులతో తయారయి ఉంది. ధాతు అంటే అంశాలు. ఆయుర్వేద పద్ధతి ప్రకారం : కఫ, పిత్త, వాయు భౌతిక విషయాలు. అందువలన నేను ఆత్మను. నేను భగవంతుని యొక్క భాగము మరియు అంశను. అహం బ్రహ్మాస్మి ఇది వైదిక ఙ్ఞానం. మీరు ఈ భౌతిక ప్రపంచానికి చెందిన వారు కాదని అర్థం చేసుకోటానికి ప్రయత్నించండి. మీరు ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందినవారు. మీరు భగవంతునిలో అంశ మరియు భాగం. Mamaivamso jiva bhutah ( BG 15.7) భగవద్గీతలో భగవంతుడు అన్నారు “ అన్ని జీవులు నా భాగాలు మరియు అంశలు”. Manah sasthanindriyani prakriti sthani karsati ( BG 15.7) అతను ఉన్న ఆలోచనా ధోరణిలో, అతను జీవితంతో గొప్పగా పోరాడుతున్నాడు అతను తాను ఈ శరీరము అనే ఆలోచనలో ఉన్నాడు కానీ ఈ రకమయిన అభిప్రాయము జంతు నాగరికత. ఎందువలన అంటే జంతువులు కూడా తింటున్నవి, నిద్రపోతున్నవి, సంపర్కం కలిగి ఉన్నవి, మరియు రక్షించుకుంటున్నవి తమ స్వంత మార్గంలో మనం కూడా, మానవులము, ఇలాంటి కర్మలలో వినియోగింపబడినట్లయితే, తినటం, నిద్రపోవటం, సంపర్కం కలిగి ఉండటం ,రక్షించుకోవటం అప్పుడు మనం జంతువుల కంటే ఉత్తమము కాము . మానవునికి ఉన్న ప్రత్యేకమైన ప్రయోజనం " నేను ఏమిటి ?" అని అర్థం చేసుకోవటం “నేను ఈ శరీరమా లేక ఏదైనా?” వాస్తవమునకు, నేను ఈ శరీరం కాదు . నేను మీకు చాలా ఉదాహరణలు ఇచ్చాను. నేను ఆత్మను . కానీ ప్రస్తుత క్షణం నేను ఈ శరీరం అన్న అవగాహనలో మనమందరం తీరిక లేకుండా ఉన్నాము. అతను శరీరం కాదు, ఆత్మ అను అవగాహనతో ఎవ్వరూ పని చేయడము లేదు. అందువలన ఈ కృష్ణ చైతన్య ఉద్యమంను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి . మేము వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరినీ ఙ్ఞానవంతులను చేయుటకు ప్రయత్నిస్తున్నాము. మేము చేయము... ఎందుకంటే మేము శరీరాన్ని పరిగణలోకి తీసుకోము. శరీరం హిందువు కావచ్చు, శరీరం ముస్లిం కావచ్చు ,శరీరం యూరోపియన్ కావచ్చు, శరీరం అమెరికన్ కావచ్చు . లేదా శరీరం వేరే శైలి కావచ్చు. ఎలాగైతే మీకు దుస్తులు ఉన్నాయో ఇప్పుడు, నేను కాషాయ వస్త్రంలో ఉన్నాను మీరు నల్లని కోటు ధరించి ఉన్నారు కనుక దాని ఉద్దేశ్యం మనము పోట్లాడాలి అని కాదు ఎందుకు? మీరు వేరే దుస్తులు కలిగి ఉండవచ్చు. నేను వేరే దుస్తులు కలిగి ఉండవచ్చు. కానీ మనం పోరాడటానికి కారణం ఏమిటి ? ఈ అవగాహన ప్రస్తుత క్షణం కావలసింది. లేకపోతే, మీరు నాగరికత కలిగిన జంతువులు. ఎలాగైతే, అడవిలో జంతువులు ఉంటాయో. పిల్లులు, కుక్కలు, నక్కలు, పులులు ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ పోట్లాడుతుంటాయి. అందువల్ల, మనకు నిజముగా శాంతి కావాలంటే శాంతి- అంటే శాంతము . అప్పుడు మనము "నేను ఏమి?" అని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి . ఇది మన కృష్ణ చైతన్య ఉద్యమం. అతడు వాస్తవముగా ఎవరు అనునది ప్రతి ఒక్కరికి మేము బోధిస్తున్నాము. కానీ అతని పరిస్థితి... ప్రతి ఒక్కరి పరిస్థితి, నాది లేక మీది మాత్రమే కాదు. అందరిదీ. జంతువులు కూడా. అవి కూడా ఆత్మ . అవి కూడా. కృష్ణుడు చెప్పారు,
- sarva-yoniṣu kaunteya
- mūrtayaḥ sambhavanti yāḥ
- tāsāṁ brahma mahad yonir
- ahaṁ bīja-pradaḥ pitā
- (BG 14.4)
కృష్ణుడు చెప్తారు “నేను అన్ని జీవులకు బీజము ఇచ్చిన తండ్రిని”. నిజంగా, ఇది వాస్తవం. సృష్టి యొక్క మూలం గురించి మనం అధ్యయనం చేయాలనుకుంటే ప్రతిదీ భగవద్గీతలో వివరించబడింది . ఎలా అంటే తండ్రి, తల్లి గర్భంలోనికి విత్తనాన్ని ఇస్తున్నాడు. ఆ విత్తనం ఒక ప్రత్యేక రకమైన శరీరాన్ని పెంచుతుంది. అదేవిధంగా, జీవులైన మనము అందరం భగవంతుని యొక్క భాగము మరియు అంశలము. భగవంతుడు ఈ భౌతిక ప్రకృతిలో ప్రవేశ పెడతాడు. మనము ఈ భౌతిక శరీరంతో వివిధ రూపాల్లో బయటకు వస్తాము. 84 లక్షల రూపాలు ఉన్నాయి. Jalaja nava lakshani sthavara laksha vimsati జాబితా ఉంది. అంతా ఉంది